Balakrishna On Cinema Tickets : ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న సినిమా టికెట్ ధరల వివాదంపై నటుడు బాలకృష్ణ స్పందించారు. 'అఖండ' సంక్రాంతి సంబురాలు పేరిట హైదరాబాద్లో ఇవాళ నిర్వహించిన ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడారు. టికెట్ల వివాదంపై పరిశ్రమ అంతా కలిసికట్టుగా ఉండాలన్న ఆయన.. ధరలపై సినీ పరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ఏపీలో సినిమా వాళ్ల గోడును పట్టించుకునేవాళ్లే లేరని వ్యాఖ్యానించారు.
'సినిమా టికెట్ల వ్యవహారం ఒక్కరితో ముడిపడింది కాదు. అన్నీ ఛాంబర్లు (ప్రొడ్యుసర్స్ కౌన్సిల్ , మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్) వారు కూర్చొని చర్చించాలి. సినీ పరిశ్రమ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం' - బాలకృష్ణ.
ఇదీ చదవండి: టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించా.. ఆ హీరోలను టార్గెట్ చేశారనుకోను: ఆర్జీవీ