ETV Bharat / sitara

ఆ పాట విని పవన్​ మెచ్చుకున్నారు: ఆది - శశి సినిమా

'ఒకే ఒక లోకం నువ్వే..' పాట విని పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ మెచ్చుకున్నారని అన్నారు యువ కథానాయకుడు ఆది సాయికుమార్​. ఆయన హీరోగా నటించిన 'శశి' చిత్రంలోనిదే ఈ పాట. ఈ నెల 19న (శుక్రవారం) చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా హీరో ఆది​ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

Actor Aadi Sai Kumar interview
ఆ పాట విని పవన్​ మెచ్చుకున్నారు: ఆది
author img

By

Published : Mar 18, 2021, 6:35 AM IST

కొన్నిసార్లు పాటలే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తాయి. అలా 'ఒకే ఒక లోకం నువ్వే..' పాటతో బలంగా ప్రచారమైన చిత్రం 'శశి'. ఆది సాయికుమార్‌, సురభి జంటగా నటించిన ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆది సాయికుమార్‌ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..

"ప్రేమకథలు చేయడం నాకు కొత్త కాదు. ఇదివరకు చేసిన చిత్రాలకు భిన్నమైన ప్రేమకథ ఇది. అటు యువతరానికి నచ్చుతుంది. ఇటు కుటుంబ ప్రేక్షకుల్నీ మెప్పిస్తుంది. 2020లో విడుదల కావల్సిన సినిమా ఇది. కరోనా వల్ల ఆలస్యంగా వస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో నేను, సందీప్‌ కిషన్‌, ఇతర యువ హీరోలంతా మాట్లాడుకునేవాళ్లం. 'ఇలా అయ్యిందేమిటి? మళ్లీ ఎప్పుడు మునుపటిలా సినిమాలు చేస్తామో' అనుకునేవాళ్లం".

  • 'ఒకే ఒక లోకం పాట..' సినిమాకు మరింత బలాన్నిచ్చింది. పవన్‌కల్యాణ్‌ విని చాలా బాగుందని మెచ్చుకున్నారు. చంద్రబోస్‌ సాహిత్యం, సిద్‌ శ్రీరామ్‌ గానం వల్లే ఆ పాట మరో స్థాయికి వెళ్లింది.
  • "నేను నటించిన 'లవ్‌లీ' చిత్రాన్ని విశాఖలో పంపిణీ చేశారు నిర్మాత ఆర్‌.పి.వర్మ. ఆయన ఒక కథ ఉందని దర్శకుడిని నా దగ్గరకు పంపారు. దర్శకుడు శ్రీనివాస్‌ నాయుడు కథని, పాత్రల్ని పూర్తిస్థాయిలో వివరించాడు. తను కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. ఇప్పుడున్న ట్రెండ్‌లో డ్రామా కావాలి, సన్నివేశాలు సహజంగా ఉండాలి. అవన్నీ ఉంటూనే దర్శకుడు రాసుకున్న పాత్రలోనూ సహజత్వం కనిపించింది. అందుకే వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నా. కథతోపాటు, ఐదు పాటల్ని సిద్ధం చేసుకుని నా దగ్గరికి వచ్చారు. 'ఒకే ఒక లోకం', 'ధీంతాన' బాణీలు వినగానే నచ్చాయి. అలా మొదలైన సినిమానే 'శశి'. అమ్మాయి పేరే.. శశి. సినిమాకు ఆ పేరు పెట్టడానికి బలమైన కారణమూ ఉంటుంది. అదేంటనేది తెరపైనే చూడాలి. నాయకనాయికల పాత్రలకు రెండో కోణమూ ఉంటుంది. ప్రేమకీ, స్నేహానికి విలువనిచ్చేలా పాత్రల్ని డిజైన్‌ చేశాడు దర్శకుడు. నా పాత్రలో రెండో కోణం కోసం రెండు నెలలు గడ్డం పెంచి నటించా."
  • "ప్రస్తుతం 'జంగిల్‌' పేరుతో ఓ హారర్‌ చిత్రం చేస్తున్నా. 'బ్లాక్‌' అనే ఒక థ్రిల్లర్‌ చిత్రం చేస్తున్నా. అందులో పోలీస్‌గా కనిపిస్తా. ఈ నెల 24న మరో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నాం. కొత్త దర్శకుడు షబ్బీర్‌ తీయనున్న చిత్రమది. చాలా ఆసక్తికరమైన కథని సిద్ధం చేశాడు".

ఇదీ చూడండి: 'సారంగ దరియా' పాట వివాదానికి ఫుల్​స్టాప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.