ETV Bharat / sitara

Acharya Update: ఆఖరి షెడ్యూల్​కు రంగం సిద్ధం - రామ్​చరణ్​ పూజా హెగ్డే

మెగాస్టార్​ చిరంజీవి 'ఆచార్య' చిత్రీకరణ(Acharya Shooting) ఆఖరి షెడ్యూల్​కు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలో షూటింగ్​ ప్రారంభించి రెండు వారాల్లో గుమ్మడికాయ కొట్టేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇందులో చిరుతో పాటు రామ్​చరణ్​పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

Acharya movie unit resume shoot in July
Acharya: ఆఖరి షెడ్యూల్​కు రంగం సిద్ధం
author img

By

Published : Jun 27, 2021, 6:55 AM IST

Updated : Jun 27, 2021, 11:31 AM IST

అగ్ర కథానాయకుడు చిరంజీవి 'ఆచార్య'(Chiranjeevi Acharya)కు గుమ్మడికాయ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. చివరి షెడ్యూల్‌ కోసం వచ్చే నెల నుంచి రంగంలోకి దిగనున్నారు. ఇందుకోసం చిత్ర బృందం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది.

తుది దశ చిత్రీకరణలో నిలిచిన ఈ సినిమా, జులై రెండో వారం నుంచి తిరిగి సెట్స్‌పైకి వెళ్లనుంది. దాదాపు 15 రోజుల పాటు సాగే ఈ ఆఖరి షెడ్యూల్‌లో.. చిరుతో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు సమాచారం.

రామ్​ చరణ్‌(Ram Charan) రెండు రోజుల ప్యాచ్‌ వర్క్‌ కోసం తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాలోని రెండో లిరికల్‌ గీతానికి సంబంధించి ఓ ప్రకటన వెలువడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చరణ్‌, పూజాలపై చిత్రీకరించిన పాటను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్‌ నాయిక. రామ్‌చరణ్‌, పూజా హెగ్డే(Pooja Hegde) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇదీ చూడండి.. తమన్నా హోస్ట్‌గా తెలుగు షో..

Last Updated : Jun 27, 2021, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.