కరోనాతో దాదాపు మూడు నెలలపాటు నిలిచిపోయిన చిత్రీకరణలు, ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల్లో భాగంగా పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మహమ్మారి కారణంగా నిలిచిపోయిన చిరంజీవి 'ఆచార్య' సినిమా షూటింగ్ మళ్లీ ఆగస్టులో మొదలవనున్నట్లు టాక్. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో చిరు దేవదాయ-ధర్మాదాయ శాఖలో ఓ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా కోసం ఏకంగా ఓ పురాతన ఆలయం సెట్‌ని నిర్మించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఎందుకంటే గతంలో లాగా ఏదో గుడిలో షూటింగ్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల గుడి సెట్ వేయడానికి చిత్రబృందం నిర్ణయించిందని తెలుస్తోంది.
ఇప్పటికే సినిమాకు సంబంధించి నలభై శాతం పైగా చిత్రీకరణ పూర్తి చేసుకొంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఇక రామ్‌చరణ్ కూడా చిత్రంలో కనువిందు చేయనున్నాడు. ప్రకాష్ రాజ్, నాజర్, షాయాజీ షిండేలు కీలక పాత్రల్లో నటించనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత స్వరాలు సమాకూరుస్తున్నారు.
ఇది చూడండి : 'ఆ ముగ్గురితో నటించాలనే కల నెరవేరింది'