అనసూయ, అమరావతి, అవును లాంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు తెరకెక్కించిన సినిమా 'ఆవిరి'. ఈ చిత్ర టీజర్ నేడు విడుదలైంది. హర్రర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది టీజర్. ఇప్పటికే అవును, అవును-2 లాంటి హర్రర్ చిత్రాలతో ప్రేక్షకులను భయపెట్టిన రవిబాబు అదే తరహాలో ఆవిరి సినిమాను తెరకెక్కించాడు. ఆత్మను మీరు గుర్తించగలరా..! అంటూ టీజర్లో చూపించాడు.
దిల్ రాజ్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాను రవిబాబే నటిస్తూ.. నిర్మించాడు. నేహా చౌహాన్, శ్రీ ముక్త, భరాణి శంకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ఇదీ చదవండి: అదిరే లుక్స్‌తో అదరగొట్టిన బాలీవుడ్ తారలు