బాలీవుడ్లో సహాయ దర్శకుడిగా పనిచేసిన హీరో ఆమిర్‌ఖాన్ సోదరుడు ఫైజల్ ఖాన్... 'ఫ్యాక్టరీ' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందీ చిత్రం. 2000లో వచ్చిన 'మేలా'లో సోదరుడు ఆమిర్‌తో కలిసి తెరను పంచుకున్నాడు ఫైజల్.
తన తండ్రి, బాలీవుడ్ దర్శక-నిర్మాత తాహిర్ ఖాన్ తీసిన 'తుమ్ మేరీ హౌ' సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు ఫైజల్ ఖాన్. 'ఖయామత్ సే ఖయామత్ తక్', 'జో జీత్ వోహీ సికిందర్' వంటి చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు.
"నేను మంచి దర్శకుడిని అవుతానని అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటారు. ఇప్పుడు ఆమె ఎంతగానో సంతోషిస్తారని అనుకుంటున్నాను" -ఫైజల్ ఖాన్, దర్శకుడు
ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని చెప్పాడు ఫైజల్. ఈ సినిమాలో రోలీ ర్యాన్, రాజ్ కుమార్ కనోజ్యా, రిబ్బూ మెహ్రా, షరాద్ సింగ్ నటించనున్నారు. 2020లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇదీ చూడండి: స్క్రిప్ట్ పనుల్లో 'వాజ్‌పేయీ' బయోపిక్