రాధికా ఆప్టే, జాకీ ష్రాఫ్, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఓకే కంప్యూటర్' వెబ్‌సిరీస్ ట్రైలర్ విడుదలై సినీ ప్రియుల్లో ఆసక్తి రేపుతోంది. భారత్‌లోనే తొలిసారి సైన్స్‌ఫిక్షన్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిందీ సిరీస్. ఆనంద్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ ఆరు ఎపిసోడ్లు ఉన్న సిరీస్ మార్చి 26న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
యువ కథానాయకుడు ఆది సాయికుమార్ నటిస్తోన్న కొత్త చిత్రం 'శశి'. సురభి నాయిక. మార్చి 19న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను మార్చి 10న ఉదయం 10.10 గంటలకు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
హీరో రానా నటించిన 'అరణ్య' సినిమాలోని 'వెల్లు వెల్లు' పాట విడుదలై శ్రోతలను అలరిస్తోంది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
విజయ్ కిరణ్ దర్శకత్వం వహించిన 'పైసా పరమాత్మ' చిత్ర ట్రైలర్ విడుదలైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో సాంకేత్, సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, దీవెన, రమణ, అనూష, అరోహి నాయుడు, బనీష్ ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 12న విడుదల కానుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: పరిణీతి సినిమా ట్రైలర్.. 'చెహ్రే' టీజర్ రిలీజ్ డేట్