షూటింగ్‌లో ఓ ప్రమాదం నుంచి నటుడు సంపూర్ణేష్‌బాబు త్రుటిలో తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళితే సంపూర్ణేష్‌బాబు హీరోగా 'బజార్ రౌడీ' చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా చిత్రంలోనే కొన్ని ఫైట్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సంపూ బైక్‌తో పాటు గాల్లో ఉన్నట్టు ఒక షాట్‌ను తీస్తున్నారు. అందుకోసం బైక్‌ను తాడుతో కట్టి కిందకు వదిలే క్రమంలో అదుపు తప్పింది. దీంతో ఒక్కసారిగా అతడు కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడికి చేరుకుని సంపూను పైకి లేపారు. ఆ దృశ్యమంతా మానిటర్‌లో కనిపించింది. అయితే ఈ ప్రమాదం నుంచి అతడు సురక్షితంగా బయటపడినట్టు సమాచారం.
-
A Small Accident took place in the shooting of @sampoornesh's #BazarRowdy sets!
— Pulagam Chinnarayana (@PulagamOfficial) January 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
#SampooneshBabu is doing well & joins back the sets soon! pic.twitter.com/zN5rHV1Ldb
">A Small Accident took place in the shooting of @sampoornesh's #BazarRowdy sets!
— Pulagam Chinnarayana (@PulagamOfficial) January 23, 2021
#SampooneshBabu is doing well & joins back the sets soon! pic.twitter.com/zN5rHV1LdbA Small Accident took place in the shooting of @sampoornesh's #BazarRowdy sets!
— Pulagam Chinnarayana (@PulagamOfficial) January 23, 2021
#SampooneshBabu is doing well & joins back the sets soon! pic.twitter.com/zN5rHV1Ldb
ఈ చిత్రానికి వసంత నాగేశ్వరావు దర్శకత్వం వహిస్తుండగా సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. మహేశ్వరి వద్ది కథానాయికగా ఆడిపాడుతోంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలో సందడి చేయనుంది.