ETV Bharat / sitara

పాన్ఇండియా కథతో కరణం మల్లేశ్వరి బయోపిక్ - వెయిట్​లిఫ్టర్ కరణం మల్లీశ్వరి

ప్రముఖ వెయిట్​లిఫ్టర్, ఒలింపిక్ పతక విజేత కరణం మల్లేశ్వరి బయోపిక్​ను పాన్ ఇండియా కథతో తీయనున్నట్లు నేడు ప్రకటించారు. ఇందులో టైటిల్​ రోల్ ఎవరు పోషిస్తున్నారనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.

పాన్ఇండియాగా కరణం మల్లీశ్వరి బయోపిక్
వెయిట్​లిఫ్టర్ కరణం మల్లీశ్వరి
author img

By

Published : Jun 1, 2020, 10:58 AM IST

Updated : Jun 1, 2020, 11:29 AM IST

టాలీవుడ్​లో మరో బయోపిక్​కు రంగం సిద్ధమైంది. ఒలింపిక్స్​​ మహిళా విభాగంలో భారత్​కు తొలి పతకం అందించిన వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి జీవితాన్ని త్వరలో రూపొందించనున్నారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర పోస్టర్​ను విడుదల చేసి, అధికారిక ప్రకటన చేశారు.

ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఎమ్​వీవీ సత్యనారాయణ, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇందులో మల్లేశ్వరి పాత్రలో ఎవరు కనిపించనున్నారు?, ఇతర సాంకేతిక సిబ్బంది వివరాలు తెలియాల్సి ఉంది. దీనిని పాన్​ఇండియా చిత్రంగా పలు భాషల్లో తెరకెక్కించనున్నారు.

biopic on Karnam Malleswari
కరణం మల్లీశ్వరి బయోపిక్ పోస్టర్

ఒలింపిక్స్​లో భారత్​ తరఫున రెండుసార్లు పాల్గొన్న మల్లేశ్వరి.. 1998 బ్యాంకాక్​లో జరిగిన పోటీల్లో 63 కిలోల విభాగంలో రజతం, 2000లో సిడ్నీ పోటీల్లో కాంస్యం పతకం గెల్చుకున్నారు. 1995లో చైనా, గ్వాంగ్జూలో జరిగిన ప్రపంచ వెయిట్​ లిఫ్టింగ్ టోర్నీలో 54 కిలోల విభాగంలో మూడు స్వర్ణాలు సాధించారు.

అనంతరం వెయిట్​ లిఫ్టింగ్​లో మల్లేశ్వరి చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం.. అర్జున అవార్డు, రాజీవ్ ఖేల్​రత్న, పద్మశ్రీ పురస్కారాలతో ఆమెను సత్కరించింది.

Last Updated : Jun 1, 2020, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.