ETV Bharat / sitara

వీరు సినిమాల్లోనే కాదు వ్యాపారాల్లోనూ మేటి! - అభిషేక్ బచ్చన్ వ్యాపారాలు

బాలీవుడ్​లో కొందరు నటులు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాల్లోనూ బిజీగా గడిపేస్తున్నారు. ఆయా రంగాల్లో విజయవంతంగా కొనసాగుతున్నారు. అలాంటి వారిపై ఓ లుక్కేయండి మరి.

5 bollywood celebrities who are more successful as entrepreneurs
వీరు సినిమాల్లోనే కాదు వ్యాపారాల్లోనూ మేటి!
author img

By

Published : Dec 2, 2020, 9:23 AM IST

బాలీవుడ్​లోని పలువురు ప్రముఖ నటీనటులు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వారిలో చాలామంది నటనతో పాటే వివిధ వ్యాపారాల్లోనూ ఆరితేరారు. ఆయా రంగాల్లో విజయవంతమయ్యారు. ఇంతకీ వారెవరు? ఏం చేశారు?

1. అభిషేక్ బచ్చన్

బిగ్​ బీ అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్.. నటుడిగా కంటే బిజినెస్​మ్యాన్​గానే ఎక్కువ విజయవంతమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రో కబడ్డీలో పింక్ పాంథర్స్, ఐఎస్​ఎల్​లో చెన్నయన్ ఎఫ్​సీ జట్లకు యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఫుట్​బాల్​ లీగ్​లో చెన్నై జట్టు ఇప్పటికే రెండుసార్లు టైటిల్​ గెలుచుకోవడం విశేషం.

5 bollywood celebrities who are more successful as entrepreneurs
అభిషేక్ బచ్చన్

దీనితో పాటే ఎల్​జీ, అమెరికన్ ఎక్స్​ప్రెస్ క్రెడిట్ కార్డ్, వీడియోకాన్, మోటరోలా మొబైల్స్ లాంటి బ్రాండ్లకు ప్రచారకర్తగానూ ఉన్నారు. అభిషేక్ సంపాదన ప్రతి ఏడాది 30 మిలియన్ డాలర్లకు పైగానే ఉంటుంది.

2. సునీల్ శెట్టి

58 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే లుక్స్​తో ఆకట్టుకుంటున్నారు బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్​శెట్టి. హిందీతో పాటు దక్షిణాదిలోనూ పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. చివరగా సూపర్​స్టార్ రజనీకాంత్ 'దర్బార్​'లో విలన్​గా కనిపించారు.

సునీల్ శెట్టి

సునీల్ ​శెట్టికి పాప్​కార్న్ మోషన్​ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఎఫ్​టీసీ అనే ఆన్​లైన్ ఫ్లాట్​ఫామ్​ను నడిపిస్తూ, ప్రతిభావంతులకు ఇందులో అవకాశాలిస్తున్నారు. 'ఫిట్టర్' అనే ఫిట్​నెస్​ అంకుర సంస్థలోనూ డబ్బు పెట్టారు. హెచ్​20 లిక్విడ్​ లాంజ్ అనే రెస్టారెంట్ ఇతడికి ఉంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్​లో ముంబయి హీరోస్ జట్టుకు సునీల్ యజమాని.

3. ట్వింకిల్ ఖన్నా

'కాఫీ విత్ కరణ్' టాక్​షోలో ఓ ఎపిసోడ్​కు వచ్చిన ట్వింకిల్​ ఖన్నా.. తాను అంత మంచి నటిని కానని చెప్పింది. మళ్లీ సినిమాల్లో నటించనంది. అయితే ఈమెలో స్వతహాగా ఓ రచయిత్రి ఉంది. 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో అప్పుడప్పుడు ఓ కాలమ్​ను రాస్తుంటుంది. మిసెస్ ఫన్నీ బోన్స్, పైజామాస్ ఆర్ ఫర్​గివింగ్, ద లెజెండ్ ఆఫ్ లక్ష్మి ప్రసాద్ అనే పుస్తకాలను రాసింది.

ట్వింకిల్ ఖన్నా

ఈ మధ్య కాలంలో ట్వీక్ మీడియా అనే డిజిటల్ కంపెనీని ప్రారంభించింది. 2016లో మిసెస్ ఫన్నీ బోన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. అందులో తన భర్త అక్షయ్ కుమార్ హీరోగా 'ప్యాడ్​మ్యాన్' సినిమా తీసింది. జాతీయ అవార్డు గెల్చుకుందీ చిత్రం. ఆమె రెండు ఇంటీరియర్ డిజైన్​ స్టోర్స్​ను కూడా నడుపుతోంది.

4. మలైకా అరోరా

ముద్దుగుమ్మ మలైకా అరోరా ఎక్కువగా సినిమాలు చేయకపోవచ్చు. కానీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఫిట్​నెస్​పై ఎక్కువగా దృష్టిసారించే ఈమె.. సోషల్​ మీడియాలో ఎప్పటికప్పుడూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. 'లేబుల్ లైఫ్' పేరుతో ఈ-కామర్స్ సైట్​ను నడుపుతోంది. సుసేన్ ఖాన్- బిపాసా బసు ఇందులో భాగస్వామ్యులు.

మలైకా అరోరా

5. ప్రీతి జింతా

ఈమెను మీరు గత కొన్నేళ్లలో వెండితెరపై కంటే క్రికెట్ మైదానంలో ఎక్కువ చూసుంటారు. ఎందుకంటే ఐపీఎల్​లో పంజాబ్ జట్టుకు ఓ యజమాని ప్రీతినే. దక్షిణాఫ్రికా టీ20లీగ్​లోనూ స్టెల్లన్ బోష్ కింగ్స్ అనే జట్టును కొనుగోలు చేసింది. 2004లో బీబీసీలో కాలమ్​లను రాసింది. తన 34వ పుట్టినరోజున 34 మంది అనాథల్ని దత్తత తీసుకుని, వారికి సంబంధించిన ఆర్థిక బాధ్యతల్ని తనే చూసుకుంటోంది. దీనితో పాటే పీజెడ్ఎన్​జెడ్ మీడియా అనే నిర్మాణ సంస్థను నడిపిస్తోంది.

ప్రీతి జింతా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.