శివ శంకర్ వరప్రసాద్.. అరే ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది. కానీ గుర్తు రావట్లేదు అని మీరు అనుకుంటున్నారా? ఇది మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు. అదేంటి ఈ విషయాన్ని మళ్లీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నారా అని భావిస్తున్నారా? మరేం లేదు.. ఆయనపై తొలి షాట్ తీసి ఈ గురువారానికి(ఫిబ్రవరి 11) సరిగ్గా 43 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అప్పటి సంగతుల్ని మరోసారి గుర్తుచేసుకుందాం.
మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత చిరంజీవికి తొలి అవకాశం 'పునాదిరాళ్లు' సినిమాతో వచ్చింది. నలుగురు హీరోల్లో ఒకడిగా ఆయన ఎంపికయ్యారు. ఈయనపై తొలి సీన్ తూర్పు గోదావరి జిల్లాలోని దోసకాయలపల్లిలో 1978 ఫిబ్రవరి 11న తీశారు. ఆ జ్ఞాపకానికి నేటితో 43 ఏళ్లు పూర్తయ్యాయి.
'పునాదిరాళ్లు'లో చిరు.. ఓ కథానాయకుడిగా చేసిన సరే తన నటన, డ్యాన్స్‌లతో దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డారు. అనంతర కాలంలో పలు సినిమాల్లో హీరోగా నటించి విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. ఖైదీ, గ్యాంగ్‌లీడర్, స్వయంకృషి, జగదేకవీరుడు అతిలోకసుందరి, ముఠామేస్త్రీ, ఛాలెంజ్, చంటబ్బాయ్, కొండవీటి దొంగ, రుద్రవీణ లాంటి చిత్రాలతో మెగాస్టార్ అభిమానుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేశారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చేస్తున్నారు.
ఇది చదవండి: ఆ చిత్రం కోసం ఒకే డ్రెస్ రెండేళ్లు వేసుకున్న చిరు!