ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​ కౌంట్​డౌన్​.. మరో 50 రోజులు మాత్రమే

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా మరో 50రోజుల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర పోస్ట్​ చేసింది చిత్రబృందం.

RRR
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Nov 18, 2021, 5:34 PM IST

సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'(RRR movie) చిత్రం విడుదల కౌంట్‌ డౌన్‌ మొదలైంది. కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్న(Ramcharan nter RRR movie) ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మరో 50 రోజుల్లో ఆర్‌ఆర్‌ఆర్ (రౌద్రం, రణం, రుధిరం) థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్విటర్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ చేసింది ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందం.

"నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున తొలిసారి ఈ మూవీకి సంబంధించి చెర్రీ, జక్కన్న, తారక్‌ ముగ్గురు చర్చలు జరిపారు. మూడేళ్ల క్రితం సినిమా షూటింగ్‌ ప్రారంభించారు. కరోనా కష్టకాలాన్ని దీటుగా ఎదుర్కొని చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. మరో 50రోజుల్లో బిగ్‌ స్క్రీన్‌పై మాయ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ముగ్గురూ.. ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం. 2022 జనవరి7న 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదలవుతుంది. ఆరోజున థియేటర్లలో సందడి కానుంది" అని పేర్కొంది. 2017లో రాజమౌళి ట్వీట్‌ చేసిన ఫొటోను .. నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా రీట్వీట్‌ చేసి ఆ ఆనంద క్షణాలను గుర్తుచేసుకుంది ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్.

RRR
ఆర్​ఆర్​ఆర్​

ఈ చిత్రాన్ని దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో (RRR movie Budget) రూపొందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్లు​ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇదీ చూడండి: టిక్కెట్‌ ధరల తగ్గింపుపై 'ఆర్‌ఆర్‌ఆర్‌' అసంతృప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.