ETV Bharat / sitara

విక్టరీ వెంకటేశ్​ 'బొబ్బిలి రాజా'కు 30 ఏళ్లు - బొబ్బిలి రాజా తాజా వార్తలు

విక్టరీ వెంకటేశ్​ హీరోగా, బి గోపాల్​ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బొబ్బిలి రాజా'. 1990 సెప్టెంబరు 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. నేటితో ఈ సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బొబ్బిలి రాజా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

Bobbili Raja
బోబ్బిలి రాజా
author img

By

Published : Sep 14, 2020, 4:25 PM IST

'అయ్యో.. అయ్యో.. అయ్యయో..' ఈ మాటను అందరూ అనడం వేరు. వెంకటేశ్‌ అనడం వేరు. అప్పటివరకూ క్లాస్‌ కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేశ్‌ను మాస్‌ హీరోగా మార్చిన చిత్రం 'బొబ్బిలి రాజా'. దివ్య భారతి కథానాయికగా పరిచయమైన తొలి చిత్రమిది. బి.గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇళయరాజా అందించిన సంగీతం హైలెట్‌. ఇందులోని పాటలు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరినీ అలరించాయి. ముఖ్యంగా 'బలపం పట్టి భామ ఒళ్లో'... పాట ఓ ఊపు ఊపేసింది. 1990 సెప్టెంబరు 14న విడుదలైన ఈ చిత్రం నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 'బొబ్బిలి రాజా' గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం!

కథేంటంటే:

సుందరయ్య (గుమ్మడి) ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి. ఆయన ఎదురింటిలోనే నివసిస్తుంటుంది కోటీశ్వరురాలైన రాజేశ్వరి దేవి (వాణిశ్రీ). ఎన్నికల్లో గెలిచి, ఎలాగైనా ఎమ్మెల్యే కావాలన్నది ఆమె ఆకాంక్ష. సరిగ్గా అదే సమయంలో సుందరయ్య కూడా నామినేషన్‌ వేయడం వల్ల తన అన్నయ్య అహోబలరావు (కోట శ్రీనివాసరావు)తో కలసి ఆ కుటుంబంపై చెడుగా ప్రచారం చేయిస్తుంది. సుందరయ్య కూతురు రాజ్యలక్ష్మి (సుమిత్ర), రాజేశ్వరి దేవి తమ్ముడు సూర్యం (విద్యాసాగర్) ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో రాజ్యలక్ష్మి గర్భవతి అవుతుంది. ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని రాజేశ్వరి దేవి.. సుందరయ్య కుటుంబంపై మరింత చెడు ప్రచారం చేయిస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు పట్నం నుంచి వచ్చిన సూర్యం, అహో బలరావుల మధ్య గొడవ జరుగుతుంది. ఇరువురి మధ్య తోపులాటలో మేడపై నుంచి పడి చనిపోతాడు సూర్యం.

Bobbili Raja
బొబ్బిలి రాజా సినిమాలో వెంకటేశ్​

ఆ హత్య రాజ్యలక్ష్మి, సుందరయ్య చేశారని ఆరోపిస్తూ వారిని జైలుకు పంపుతుంది రాజేశ్వరి దేవి. అక్కడ ఇన్‌స్పెక్టర్‌ రాజ్యలక్ష్మిని బలాత్కారం చేయడానికి ప్రయత్నించగా.. అతడ్ని హత్య చేసి, తండ్రితో కలసి అడవిలోకి పారిపోతుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు రాజ్యలక్ష్మికి కొడుకు పుడతాడు. కట్‌ చేస్తే, 25 ఏళ్ల తర్వాత రాజ్యలక్ష్మి కుమారుడు రాజా (వెంకటేశ్‌) అడవిలోనే పుట్టి పెరుగుతాడు. అదే సమయంలో రాజేశ్వరిదేవి రాష్ట్రానికి అటవీ శాఖ మంత్రి అవుతుంది. ఆమెకు రాణి (దివ్య భారతి) అనే కుమార్తె పుడుతుంది. స్నేహితులతో కలసి అడవికి టూర్‌కు వెళ్లిన రాణికి గైడ్‌గా రాజా వస్తాడు. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత తన తల్లిని అవమానించిన రాజేశ్వరి దేవి గురించి తెలిసిన రాజా ఏం చేశాడు? రాణి-రాజా ప్రేమ ఏమైంది? అన్నది కథ!

తొలుత అనుకున్న కథ వేరు

Bobbili Raja
బొబ్బిలి రాజా షూటింగ్​లో వెంకీ మామ, దివ్య భారతి

వెంకటేశ్‌-బి.గోపాల్‌ కాంబినేషన్‌లో నిర్మాత డి.రామానాయుడు సినిమా చేయాలనుకున్నప్పుడు పరుచూరి బ్రదర్స్‌ను పిలిచి కథ చెప్పమనగా.. ఆయన తొలుత వేరే కథ చెప్పారు. ఒక కలెక్టర్‌ కుటుంబం, వారికి మరో కుటుంబానికి గొడవ అవుతుంది. అయితే, కలెక్టర్‌ కుటుంబంలోని అబ్బాయి, మరో కుటుంబంలోని అమ్మాయి ప్రేమించుకుంటారు అంటూ అడవి నేపథ్యం లేకుండా మొత్తం పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో కథ చెప్పారట. ఇది విన్న పరుచూరి వెంకటేశ్వరరావు ఇలా చేస్తే, సినిమా అంత బాగా ఆడదని చెప్పారు. దీంతో ఆయన రంగంలోకి దిగి.. ఇప్పుడు మనం చూస్తున్న కథను తీర్చిదిద్దారు. 'గాడ్స్‌ మస్ట్‌ బి క్రేజీ' సినిమా ప్రభావం దీనిపై కొంత ఉంది. డైలాగ్‌లు రాసేటప్పుడు ఒక రోజు సురేశ్‌బాబు, పరుచూరి గోపాలకృష్ణ దగ్గరకు వచ్చి, 'బి.గోపాల్‌ మాస్‌ కథలు బాగా తీస్తారు. కానీ, ఇందులో ప్రేమకథ కూడా ఉంది. వేరే వాళ్లను పెడదామా' అని అడిగారట. అందుకు పరుచూరి స్పందించి.. 'లేదండీ బి.గోపాల్‌ మీ సంస్థ ద్వారానే డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. పైగా మీ నాన్నగారు ఒప్పుకోరు' అని చెప్పగా సురేశ్‌బాబు మళ్లీ ఆ టాపిక్‌ను ఎప్పుడూ తీసుకురాలేదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పాత్రల ఎంపిక అలా..

రాజేశ్వరి దేవి పాత్రకు మొదట శారదను అనుకున్నారు. అయితే, ఆమె అప్పటికే ఇలాంటి అత్త పాత్రలు చేయడం వల్ల.. సురేశ్‌బాబు సూచన మేరకు వాణిశ్రీని తీసుకున్నారు. ఇక కథానాయికగా రాధను అనుకోగా.. ఇలాంటి పాత్రనే గతంలో రాధ పోషించడం, పైగా ఆమె స్టార్‌ హీరోయిన్‌ కావడం వల్ల కొత్త అమ్మాయిని తీసుకుందామని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. తన దగ్గర ఉన్న ఫొటోలను టేబుల్‌పై ఉంచి, మీరనుకున్న పాత్రకు ఏ అమ్మాయి బాగుంటుందో మీరే ఎంచుకోండి అన్నారు. దీంతో గోపాలకృష్ణ దివ్యభారతి ఫొటో చూసి, 'ఈ అమ్మాయి ఎవరో కనుక్కోండి. కథానాయికగా చక్కగా ఉంటుంది' అన్నారు. వెంటనే బోనీ కపూర్‌కు ఫోన్‌ చేసి దివ్య భారతిని కథానాయికగా ఎంపిక చేశారు. దీంతో 'బొబ్బిలి రాజా' దివ్యభారతి తొలి తెలుగు చిత్రమైంది.

పొల్లాచిలో షూటింగ్‌

'బొబ్బిలిరాజా'లో కనిపించే అటవీ ప్రాంతమంతా తమిళనాడులోని పొల్లాచి సమీపంలోనిది. అక్కడే దాదాపు 40 రోజులకు పైగా షూటింగ్‌ జరిగింది. కెమెరామెన్‌‌గా రవీంద్రబాబును తీసుకుంటే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, ఆయన ప్రతి ఫ్రేమును అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా జంతువులు కనిపించే సన్నివేశాలు తీయడానికి ఎంతో కష్టపడ్డారు. ఇక ఈ చిత్రంలో క్లైమాక్స్‌ ఫైట్‌ హైలైట్‌ అని చెప్పాలి. క్లైమాక్స్‌ ఫైట్‌కు సంబంధించిన సన్నివేశాలను ఫైట్‌ మాస్టర్‌కు అప్పగించేస్తారు దర్శక,రచయితలు. కానీ, ఈ సినిమాకు ఫైట్స్‌ ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నారు. అలా కదిలే రైలుపై యాక్షన్‌ సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఒక్కో బోగీలో అడవి జంతువులను ఉంచి ఆ ఫైట్‌కు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు.

Bobbili Raja
బొబ్బిలి రాజా సినిమా స్టిల్​

ఆ సన్నివేశాలు తీసేద్దామన్నారు

సెప్టెంబరు 10న చిత్ర బృందం ఫస్ట్‌ కాపీ చూసింది. అయితే, ఇందులో ఉన్న పోలీస్‌స్టేషన్‌ ఫైట్‌ సీన్‌ను తీసేద్దామని రామానాయుడు సలహా ఇచ్చారు. ఎందుకంటే 'ఖైదీ'లో చిరంజీవి అలాంటి ఫైటే చేశారు. అప్పట్లో హీరోతో పోలీస్‌ స్టేషన్‌లో ఓ ఫైట్‌ సీన్‌ పెట్టేవారు. ఇది కూడా రొటీన్‌గా ఉంటుందని రామానాయుడు అభిప్రాయపడ్డారు. కానీ, పరుచూరి గోపాలకృష్ణ ఒప్పుకోలేదు. ఆ తర్వాత వెంకటేశ్‌, దివ్యభారతి అడవిలో తప్పిపోయి, కోయవాళ్లకు చిక్కుతారు. అప్పుడు వెంకటేశ్‌ ఓ భారీకాయుడితో పోరాటం చేస్తాడు. దీనినీ తీసేయమని రామానాయుడు చెప్పారు. అయితే, నాయిక-నాయకుల మధ్య ప్రేమ బలపడలాంటే ఇలాంటి సన్నివేశాలు ఉండాలని ఒప్పించారు గోపాలకృష్ణ. ఇక సినిమాలోని 'అయ్యో అయ్యో అయ్యయ్యో...' డైలాగ్‌ ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలో వెంకీ ఆ మాట అనే ప్రతిసారి థియేటర్‌లో నవ్వులు పూశాయి.

ఆ పాట ఇటు.. ఈ పాట అటు

'బొబ్బిలిరాజా'లో మొత్తం ఐదు పాటలున్నాయి. అన్నీ మ్యూజికల్‌గా హిట్​గా నిలిచాయి. ఇళయరాజా వినసొంపైన పాటలు ఇచ్చారు. అయితే, సినిమాలో మూడో పాటగా 'బలపం పట్టి భామ బళ్లో...'ను పెట్టారు. రషెస్‌ చూసిన పరుచూరి గోపాలకృష్ణ మూడో పాటను ఐదో పాటగా.. ఐదో పాటగా ఉన్న, 'చెమ్మ చెక్క చెమ్మ చెక్క...'ను మూడో పాటగా పెట్టమని సలహా ఇచ్చారు. అందుకు మొదట సురేశ్‌బాబు ఒప్పుకోలేదు. పైగా ఎంతో ఖర్చు పెట్టి తీయించిన పాట, వెంకటేశ్‌కు కూడా ఇష్టమన్నారు. ఈ పాట ముందుంటే సెకండాఫ్‌లో ఫ్యామిలీ డ్రామా, ఫస్టాఫ్‌లో లవ్‌డ్రామా బాగా వర్కవుట్‌ అవుతుందని చెప్పడం వల్ల సురేశ్‌బాబు ఒప్పుకొన్నారు. ఇదే విషయాన్ని వెంకటేశ్‌కు చెబితే ఆయనా సరే అన్నారు.

సెప్టెంబరు 14, 1990న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. హైదరాబాద్‌ సుదర్శన్‌ థియేటర్‌లో 265 రోజులు ఆడింది. మొదట అనుకున్న ఒప్పందం ప్రకారం.. 265 రోజుల తర్వాత సుదర్శన్‌లో నుంచి సినిమా తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత శ్రీనివాస్‌లో వంద రోజులు ఆడింది. ఒప్పందం లేకపోతే ఒకే థియేటర్‌లో ఏడాదికి పైగా ఆడిన చిత్రంగా 'బొబ్బిలి రాజా' రికార్డు సృష్టించేది. ఈ సినిమాను తమిళంలో 'వాలిబన్‌'గా, హిందీలో 'రామ్‌పూర్‌ కా రాజా'గా డబ్‌ చేశారు. 1993లో 'బాయ్‌ ఫ్రెండ్‌' పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. ఈ సినిమాకుగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజాకు ఫిలింఫేర్‌ అవార్డు వచ్చింది.

Bobbili Raja
బొబ్బిలి రాజా చిత్రానికి క్లాప్​ కొడుతున్న కమల్​ హాసన్​

బొబ్బిలి రాజా గురించి మరికొన్ని విశేషాలు

  • దివ్య భారతి దుస్తులు, కనిపించిన తీరుపై అప్పట్లో పలు విమర్శలు వచ్చాయి. సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు కూడా దివ్య భారతి వల్లే ఈ సినిమా ఆడిందని అన్నారు. ఆ సినిమా 100 రోజుల ఫంక్షన్‌లో రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'దివ్యభారతి నటించిన ఓ తమిళ చిత్రం కూడా ఇప్పుడు ఆడుతోంది. అందులో ఇంతకన్నా ఘాటైన సన్నివేశాలు ఉన్నాయి. కానీ, ఆ సినిమాకు ఎవరూ వెళ్లడం లేదు. అందరూ 'బొబ్బిలి రాజా' చూస్తున్నారు. ఇది చిత్ర బృందం సమష్టి కృషి' అని తెగేసి చెప్పారు.
  • ఈ సినిమా ముహూర్త సన్నివేశానికి నటుడు కమల్‌హాసన్‌ క్లాప్‌ కొట్టారు.
  • 'రాష్ట్రాన్ని అయినా రాసిస్తా కానీ, అమ్మాయిని ఇవ్వను' అని వాణిశ్రీ డైలాగ్‌ను తీసేద్దామని అన్నారు నిర్మాత సురేశ్‌బాబు. కానీ, రచయితలు ఆయన్ను ఒప్పించారు.
  • సురేశ్‌బాబు నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా ఇది.
  • బి.గోపాల్‌-వెంకటేశ్‌ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా 'బొబ్బిలి రాజా'. అంతకుముందు వీరిద్దరూ 'రక్త తిలకం' చేశారు.
  • డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ ఈ సినిమాకు కో-డైరెక్టర్‌. ప్రేమ సన్నివేశాలు హృద్యంగా తెరకెక్కడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
  • అప్పట్లో యానిమేషన్‌ చిత్రాలు అలరిస్తుండటం వల్ల 'కన్యా కుమారి...' పాటలో సురేశ్‌బాబు అడవి జంతువులను యానిమేషన్‌ రూపంలో చూపించారు. ఆ పాట చిన్నారులను కూడా విశేషంగా అలరించింది. ఈ యానిమేషన్‌ను రూపొందించడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.