ETV Bharat / sitara

వేసవిలో హౌస్​ఫుల్​.. మరి ఆ సినిమాలు వచ్చేదెప్పుడు? - 2022 సమ్మర్​ సినిమాలు

2022 Summer movie: కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల సినిమాలన్నీ వరుసగా రిలీజ్​కు సిద్ధమయ్యాయి. మే వరకు వేసవి బెర్తులన్నీ ఇప్పటికే ఖరారైపోయాయి. అందులో బడా సినిమాలు కూడా ఉన్నాయి. అయితే షూటింగ్​ పూర్తి చేసుకున్న కొన్ని చిత్రాలు మాత్రం రిలీజ్​ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. మరి అవి వేసవిలో రిలీజ్​ అవుతాయా? పెద్ద సినిమాలకు పోటీగా నిలుస్తాయా? వంటి విషయాల సమాహారమే ఈ కథనం..

2022 Summer release tollywood movies
2022 Summer release tollywood movies
author img

By

Published : Mar 12, 2022, 6:46 AM IST

2022 Summer movie: ఓ వైపు కొవిడ్‌ ఉద్ధృతి తగ్గడం.. మరోవైపు టికెట్‌ ధరల సమస్యలు కొలిక్కి రావడం వలల్ చిత్రసీమకు సరికొత్త జోష్‌ వచ్చినట్లయింది. దీంతో ఇప్పుడు తెలుగు సినీ క్యాలెండర్‌ కొత్త కాంతులతో తళుకులీనుతోంది. బాక్సాఫీస్‌ ముందు వేసవి వినోదాల జాతర కొనసాగుతోంది. మార్చి నుంచి మే వరకు వేసవి బెర్తులన్నీ ఇప్పటికే ఖరారైపోయాయి. అయితే ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న పలు సినిమాలు విడుదల తేదీల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. మరి వాటిలో వేసవి బరిలో తెరపైకి వచ్చేవెన్ని? ఓటీటీ వేదికగా సందడి చేసేవి ఎన్ని? అన్నది ఆసక్తికరంగా మారింది.

తొలి దశ కరోనా తర్వాత 'అరణ్య'తో.. మూడో దశ ఉద్ధృతి తర్వాత 'భీమ్లానాయక్‌'తో ప్రేక్షకుల్ని పలకరించారు నటుడు రానా. వీటికన్నా ముందు పట్టాలెక్కి.. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘విరాటపర్వం’ చిత్ర విడుదల విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రమిది. వేణు ఊడుగుల తెరకెక్కించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. సురేష్‌బాబు సమర్పిస్తున్నారు.నక్సలిజం నేపథ్యంలో సాగే విభిన్నమైన ప్రేమ కథాంశంతో రూపొందింది. ఈ సినిమా ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు ఇటీవలే రానా ప్రకటించారు. విడుదల ఎప్పుడనే విషయంలో ఏ స్పష్టత ఇవ్వలేదు. ఈ సినిమా ఓటీటీ బాట పట్టనున్నట్లు కొన్నాళ్లుగా చిత్ర వర్గాల్లో ప్రచారం వినిపిస్తోంది. ఇప్పుడు దీనిపై చిత్ర బృందం స్పందన కోసం సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవలే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాతో బాక్సాఫీస్‌ ముందు సందడి చేశారు కథానాయకుడు శర్వానంద్‌. ఇప్పుడాయన నుంచి రానున్న మరో కొత్త చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీకార్తీక్‌ తెరకెక్కించిన ఈ సినిమాని.. ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మించారు. రీతూ వర్మ కథానాయిక. అమల అక్కినేని, ప్రియదర్శి, నాజర్‌ కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దీన్ని వేసవి బరిలోనే బాక్సాఫీస్‌ ముందుకు తీసుకురానున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే విడుదల తేదీపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలతో ముడిపడిన కుటుంబ కథా చిత్రమిది.

‘మనం’ వంటి హిట్‌ తర్వాత నాగచైతన్య - విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘థ్యాంక్‌ యూ’. రాశి ఖన్నా కథానాయిక. అవికా గోర్‌, మాళవిక నాయర్‌ కీలక పాత్రల్లో నటించారు. విభిన్నమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటోంది. దీన్ని ఈ వేసవిలోనే విడుదల చేయనున్నట్లు దిల్‌రాజు ఇటీవల ప్రకటించారు. తేదీ విషయంలో ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందులో నాగచైతన్య మూడు భిన్నమైన గెటప్పుల్లో కనువిందు చేయనున్నారు.

సుధీర్‌బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ‘సమ్మోహనం’, ‘వి’ వంటి చిత్రాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందిన మూడో చిత్రమిది. కృతి శెట్టి కథానాయిక. కొత్తదనం నిండిన ప్రేమ కథాంశంతో రూపొందిన ఈ సినిమా.. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేదెప్పుడన్నది ఇంత వరకు తేల్చలేదు.

గరుడవేగ’ చిత్ర విజయమిచ్చిన స్ఫూర్తితో.. ఈ మధ్య ఎక్కువగా థిల్లర్‌ కథలతోనే ప్రయాణం చేస్తున్నారు కథానాయకుడు రాజశేఖర్‌. ఇప్పుడాయన నుంచి రానున్న కొత్త చిత్రం ‘శేఖర్‌’. జీవిత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమా జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కరోనా పరిస్థితుల వల్ల సాధ్యపడలేదు. ఆ తర్వాత ఫిబ్రవరిలో థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం వినిపించినా అదీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికే వేసవి బెర్తులన్నీ ఖరారైన నేపథ్యంలో.. ఇదెప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం పలు ఓటీటీ సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం అందుతోంది. మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్‌’కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది.

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటించిన తొలి చారిత్రక నేపథ్య చిత్రం ‘బింబిసార’. వశిష్ట దర్శకత్వం వహించారు. హరికృష్ణ.కె నిర్మించారు. కేథరిన్‌, సంయుక్తా మేనన్‌ కథానాయికలు. కొన్నాళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. విడుదల విషయంలో ఇంత వరకు ఏ స్పష్టత ఇవ్వలేదు. కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమైన చిత్రమిది. గతానికి.. వర్తమానానికి ముడిపెడుతూ సాగే ఓ ఆసక్తికరమైన కథాంశంతో రూపొందింది. ఇందులో కల్యాణ్‌ రామ్‌ రెండు భిన్నమైన పాత్రల్లో సందడి చేయనున్నారు.

ఇక సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. కాళిదాసు రచించిన శకుంతల - దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందిస్తున్నారు. నీలిమ గుణ నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఇది వేసవి బరిలో నిలుస్తుందా? లేదా? అన్నది చిత్ర బృందం ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ సినిమాతో అల్లు అర్జున్‌ తనయ అల్లు అర్హ బాల నటిగా తెరకు పరిచయం కానుంది.

ఇదీ చూడండి: ప్రభాస్​ నన్ను ముద్దు పెట్టుకున్నారు: తమన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.