ETV Bharat / sitara

2019: సరికొత్త కథకే ప్రేక్షకుల నీరాజనం

కథ నచ్చితే చాలు ఆ సినిమా చిన్నదైనా, పెద్దదైనా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధిస్తుంది. ప్రేమ, యాక్షన్​, వినోదం ఇలా ప్రతి కథకు చిన్న కాన్సెప్టు జోడించి తెలుగు తెరపై ప్రేక్షకులను మెప్పించారు మన దర్శకులు. అలా 2019లో వచ్చి విజయాలు అందుకున్న చిన్న సినిమాల గురించి ఓ లుక్కేద్దాం.

2019 small budget movies hit at box office
సరికొత్త కథకే ప్రేక్షకుల నీరాజనం
author img

By

Published : Dec 14, 2019, 7:53 AM IST

చిన్నదని తక్కువ చేసి చూడకూడదు. అది సినిమా అయినా, ఐడియా అయినా. చిన్న చిన్న ఐడియాలతో తెరకెక్కిన చిత్రాలు ఈ ఏడాది ఘన విజయాలు సాధించాయి. కాన్సెప్ట్‌ కథల సత్తా తెలియడానికి అది చాలు. ప్రేమ, యాక్షన్‌, వినోదం.. కథ ఏదైనా - దానికి చిన్న కాన్సెప్టు జోడించి, సినిమాని మరింత రక్తికట్టించే ప్రయత్నాలు చేశారు మన దర్శకులు. ఈ ఏడాది విజయవంతమైన ఏ సినిమా తీసుకున్నా - ఏదో ఓ అంశం కొత్తగా చూపించాలన్న తపన కనిపించింది. అదే ప్రేక్షకులకు నచ్చింది.

'చిత్రలహరి'తో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలైందని చెప్పాడు సాయిధరమ్‌తేజ్‌. అన్నట్టు ఈ సినిమాతో తేజూ పేరు 'సాయితేజ్‌'గా కుదించారు. అది సెంటిమెంట్‌గా కలిసొచ్చింది. 'చిత్రలహరి' చక్కటి విజయాన్ని అందుకుంది. పరాజయాల ఊబిలో కూరుకుపోయిన ఓ దురదృష్టవంతుడి కథ ఇది. చిన్న అంశాన్ని వినోదాత్మకంగా చూపించడంలో దర్శకుడు కిషోర్‌ తిరుమల విజయం సాధించారు. పాటలూ తన వంతు పాత్ర పోషించాయి.

2019 small budget movies hit at box office
సరికొత్త కథకే ప్రేక్షకుల నీరాజనం

'మజిలి' ఓ మధ్యతరగతి కుర్రాడి కథ. ఇష్టం లేని పెళ్లి చేసుకుని భార్యని దూరంగా పెట్టి, ప్రియురాలి జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీసే ఓ వీర ప్రేమికుడి కథ. దానికి క్రికెట్‌ నేపథ్యం జోడించడం కొత్తగా అనిపించింది. భర్తని దారిలోకి తెచ్చుకోవడానికి భార్య చేసే ప్రయత్నాలు కుటుంబ ప్రేక్షకులకు నచ్చాయి. పైగా సమంత, నాగచైతన్య భార్యాభర్తలుగా నటించడం ఈ చిత్రానికి కలిసొచ్చింది. తెరపై కూడా నిజ జీవిత పాత్రలు పోషించడం మరింత బాగా నచ్చింది.

నాని చిత్రం 'జెర్సీ' కూడా క్రికెట్‌ నేపథ్యంలో సాగిందే. క్రికెట్‌ చుట్టూ తిరిగే సినిమా అంటే యువతరం సినిమా అయిపోతుంది. ఇక్కడ ఆట కంటే ఎమోషన్లు ఎక్కువ కట్టిపడేశాయి. ఓ వెటరన్‌ క్రికెటర్‌ మళ్లీ బ్యాట్‌ పట్టుకుని మైదానంలోకి దిగాలనుకోవడం, అదీ తన తనయుడి కోసం కావడంతో ఫ్యామిలీ టచ్‌ ఇచ్చినట్టైంది. ఫలితం... నాని కెరీర్‌లో మరో హిట్టు.

థ్రిల్లరూ... విన్నర్లూ!

తెలుగులో క్రైమ్‌ కామెడీలు చాలా వచ్చాయి. వెళ్లాయి. వాటిలో 'బ్రోచేవారెవరురా', 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రెండింటి జోనర్లు ఒక్కటే. కానీ ఎంచుకున్న కథాంశాలు, చూపించిన విధానాలు కొత్తగా ఉన్నాయి. ఒంగోలు జేమ్స్‌బాండ్‌ కథ 'ఏజెంట్‌ సాయిశ్రీనివాస.. 'చంటబ్బాయి'ని పోలిన పాత్ర చిత్రణ ప్రేక్షకుల్ని నవ్విస్తే.. కథలో ట్విస్టులు ఆసక్తిని పెంచాయి. చిన్న సినిమా దమ్ము చూపించేలా వసూళ్లు వచ్చాయి. 'బ్రోచేవారెవరురా' కూడా అంతే. ఓ మామూలు కిడ్నాప్‌ డ్రామా. అయితే ఆ కథని నడిపించిన విధానం కొత్తగా అనిపించింది. అడవిశేష్‌ - 'ఎవరు' ఓ సరికొత్త థ్రిల్లర్‌. ఓ హత్యోదంతం చుట్టూ తిరుగుతుంది. పతాక సన్నివేశాల్లో మలుపులు ఈ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాయి. పరిమిత వనరులతో తెరకెక్కించిన ఈ ముడు చిత్రాలూ విమర్శకుల ప్రశంసలు పొందాయి. స్టార్‌ హీరోలు, దర్శకులు సైతం సోషల్‌ మీడియా వేదికగా ఈ చిత్రాల్ని ప్రోత్సహించారు.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ 'రాక్షసుడు' కూడా ఓ థ్రిల్లరే. 'రాచ్చసన్‌' చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం మనవాళ్లకూ నచ్చింది. ఓ సైకో కిల్లర్‌ని పట్టుకోవడానికి పోలీస్‌ అధికారి చేసే ప్రయత్నాలు ఉత్కంఠతని రేకెత్తించేలా సాగాయి. ఇదే ఏడాది విడుదలైన తాప్సి 'గేమ్‌ ఓవర్‌' కూడా ప్రేక్షకుల్ని మెప్పించింది. కల్యాణ్‌ రామ్‌ కథల ఎంపిక ఎప్పుడూ కొత్తగానే ఉంటుందన్న విషయం '118'తో మరోసారి రుజువైంది. ఓ అంకె చుట్టూ నడిచే కథని ఎక్కడా పట్టుసడలకుండా తెరకెక్కించారు దర్శకుడు కె.వి.గుహన్‌. కల్యాణ్‌ రామ్‌ ఇమేజ్‌కి తగ్గట్టు యాక్షన్‌ సన్నివేశాలు డిజైన్‌ చేసుకుని, అవి కూడా కథలో భాగంగా వచ్చేలా జాగ్రత్త పడ్డారు. 'అర్జున్‌ సురవరం'ది మరోదారి. ఇది నిజాయతీగల పాత్రికేయుడి కథ. ఓ స్కామ్‌లో ఇరుక్కున్న కథానాయకుడు అందులోంచి ఎలా బయటపడ్డాడు? దోషుల్ని చట్టానికి ఎలా అప్పగించాడన్నది కథనం. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం మెరుగైన ఫలితం అందుకోవడం నిఖిల్‌ కెరీర్‌కి పెద్ద ఉపశమనం.

కథానాయకుడు సందీప్‌ కిషన్‌ ఈ ఏడాది నిర్మాతగా అవతారం ఎత్తాడు. 'నిను వీడని నీడను నేనే'తో. హారర్‌కు, థ్రిల్‌ జోడించిన చిత్రమిది. ఈ సినిమాలో భయం కంటే ఉత్కంఠతకు చోటివ్వడం వల్ల మరింత మందికి చేరువైంది.

కథ ఎక్కడిదైతేనేం..?

కదిలితే కాలునొప్పి, మాట్లాడితే మెడ నొప్పి అని కాళ్లు చాపుకుని కూర్చునే బామ్మ ఒక్కసారిగా భామలా మారిపోయి, సీతాకోక చిలుకలా రెక్కలు విప్పుకుని ఎగురుతుంటే ఎంత విచిత్రం? ఆ విచిత్రమే 'ఓ బేబీ'లో కనిపించింది. లక్ష్మి.. సమంతలా మారిపోవడం ఈ సినిమాలో మ్యాజిక్‌. ఇది మన కథేం కాదు. ఓ విదేశీ చిత్రానికి రీమేక్‌. అయితే మన తెలుగు వాళ్లకు కావల్సిన దినుసులన్నీ చక్కగా వేసి, ఓ విందు భోజనం తయారు చేశారు దర్శకురాలు నందినిరెడ్డి. వరుణ్‌తేజ్‌ పూర్తిగా మాస్‌ బాట పట్టిన 'గద్దలకొండ గణేష్‌' కూడా రీమేక్‌ కథే. అయితే పరాయి కథల్ని తనదైన శైలిలో ఎలా పండించాలో తెలిసిన హరీష్‌ శంకర్‌ తన బాధ్యతని చక్కగా నిర్వహించాడు. 'ఎల్లువొచ్చె గోదారమ్మా' పాట ఓ ప్రత్యేక ఆకర్షణగా మారింది.

విజయం బ్రహ్మపదార్థం ఏమీ కాదన్న విషయాన్ని ఈ చిత్రాలు నిరూపించాయి. సరైన ప్రణాళిక, కొత్త ఆలోచనలుంటే.. తప్పకుండా ‘హిట్టు’ అందుకోవొచ్చు. కాకపోతే ఆ చిత్రాల సంఖ్య మరింతగా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నూటికి 80 చిత్రాలు చిన్న బడ్జెట్‌తోనే రూపొందుతున్నాయి. వాటిపైనే పరిశ్రమ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కథల ఎంపికలో కొత్తదనం చూపించడం, కొత్త తరహా ప్రయత్నాలు, ప్రయోగాలు చేయడం నేర్చుకుంటే చిన్న సినిమాలకు మరింత ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది.

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Saturday, 14 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2314: Cuba Ballet AP Clients Only 4244766
New Cuban ballet head pledges artistic quality
AP-APTN-2311: Brazil Scuba Santa AP Clients Only 4244765
Scuba diving Santa feeds sharks at Rio aquarium
AP-APTN-2255: ARCHIVE Christina Hendricks AP Clients Only 4244763
'Mad Men' actress Christina Hendricks files for divorce
AP-APTN-2008: ARCHIVE Colin Firth AP Clients Only 4244749
Colin Firth and wife Livia Giuggioli separate after 22 years of marriage
AP-APTN-1926: US Schitt's Creek Pop Up AP Clients Only 4244743
Schitt's Creek pop-up opens in New York to celebrate the comedy's upcoming sixth and final season
AP-APTN-1833: France Little Women AP Clients Only 4244563
Gerwig, Ronan, Pugh, Chalamet premiere 'Little Women' in Paris
AP-APTN-1804: ARCHIVE Olivia Wilde Content has significant restrictions, see script for details 4244732
Olivia Wilde defends her real 'Richard Jewell' character over sex-for-tips claims
AP-APTN-1630: OBIT Danny Aiello Content has significant restrictions, see script for details 4244712
Blue-collar character actor Danny Aiello has died at age 86
AP-APTN-1548: UK Cats photocall Content has significant restrictions, see script for details 4244705
Ian McKellen and 'Cats' co-stars arrive in London for photocall
AP-APTN-1505: US Billboard's Women in Music Content has significant restrictions, see script for details 4244690
Taylor Swift calls out Scooter Braun during Billboard speech
AP-APTN-1417: UK CE Servant Fears Content has significant restrictions, see script for details 4244688
Rats, aging, choral music: The cast of M. Night Shyamalan's creepy new chiller 'Servant' reveal their real-life fears
AP-APTN-1240: UK Miss World Rehearsals AP Clients Only 4244656
Miss World contestants rehearse dance routines ahead of competition finale
AP-APTN-1209: ARCHIVE Taylor Swift Content has significant restrictions, see script for details 4244661
Taylor Swift turns 30 on December 13
AP-APTN-1150: US CE Truth Be Known Content has significant restrictions, see script for details 4244659
'Truth Be Told' stars Lizzy Caplan and Elizabeth Perkins talk media and journalism
AP-APTN-1133: ARCHIVE Decade End Wrap Part 2 AP Clients Only 4244655
Biggest entertainment news stories of the decade, part two: 2015-2019
AP-APTN-1119: US CE Star Wars Masks Content has significant restrictions, see script for details 4244652
'Star Wars' star Adam Driver on Kylo Ren's mask: 'He's not hiding anymore'
AP-APTN-1100: UK Fashion Sustainability 5 The Future Content has significant restrictions, see script for details 4244648
Fashion Sustainability 5: Experts look to the future for sustainability in the fashion industry
AP-APTN-1100: UK John Cena Content has significant restrictions, see script for details 4244647
Patience is a virtue for 'Playing With Fire' star John Cena
AP-APTN-1049: US Kristin Chenoweth Content has significant restrictions, see script for details 4244641
Kristin Chenoweth guest stars in this year's 'Christmas with the Tabernacle Choir' concert
AP-APTN-1005: US Golden Globe Reax AP Clients Only 4243909
Golden Globe nominations snubs: No female directors, Robert DeNiro and Adam Sandler shut out of best actor category
AP-APTN-0835: US Women in Music AP Clients Only 4244589
Taylor Swift, Alicia Keys, Billie Eilish among honorees at women in music awards
AP-APTN-0137: US JK Rowling AP Clients Only 4244562
JK Rowling is honored at charity gala in New York
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.