లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన సినిమా, టీవీ షూటింగ్స్ ఇతర కార్యకలాపాలు త్వరలో పునఃప్రారంభమయ్యే నేపథ్యంలో వాటికి సంబంధించి 16పేజీల మార్గదర్శకాలను జారీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. షూటింగ్ స్పాట్‌లో ఈ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరు మాస్కులు, శానిటైజరు, గ్లౌజులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అందులోని ముఖ్యమైన మార్గదర్శకాలపై ఓ లుక్కేద్దాం.
- చేతులు కడుక్కోవడం, శానిటైజేషన్ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరూ మాస్క్, గ్లోవ్స్ షూటింగ్ స్పాట్‌లో ఉన్నంత సేపూ విధిగా ధరించాలి.
- సెట్‌లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలి. అధిక శరీర ఉష్ణోగ్రత ఉన్న వ్యక్తుల్ని సెట్‌లోకి రానివ్వకూడదు.
- ఇండోర్ లొకేషన్స్‌లో గాలి ప్రసరణ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డిస్పోసబుల్ గ్లాసులు, ప్లేట్లు, కప్స్ ఉపయోగించాలి. ముఖ్యంగా ప్రింటర్ స్టేషన్స్‌లోని కరెంట్‌తో సహా ఇతరత్రా మీటాలను కూడా శానిటైజింగ్ చేయాలి.
- సెట్లోని ప్రతి ఒక్కరు తమ ఫోన్లలో 'ఆరోగ్య సేతు' యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. వైద్య సిబ్బంది, సెట్స్ బయట అన్ని వేళలా ఆంబులెన్స్ అందుబాటలో ఉండటం తప్పనిసరి.
- ప్రతిరోజూ షూటింగ్ ప్రారంభించే ముందు స్టూడియో మొత్తాన్ని శానిటైజ్ చేయాలి.
- గర్భవతి, 65 ఏళ్లు పైబడిన వారు షూటింగ్ స్పాట్‌లో లేకుండా చూసుకుంటే మంచిది. ఒకవేళ ఉంటే వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. షూటింగ్ సమయాల్లో అభిమానులను మాత్రం అస్సలు అనుమతించకూడదు.
- ఆడిషన్స్ వీలైనంత వరకు ఫేస్ టైమ్, జూమ్, స్కైప్ వంటి సామాజిక మాధ్యమాల యాప్ ద్వారా జరిగేలా చూసుకోవాలి.
- నటీనటులను తమ కాస్ట్యూమ్ వారే తెచ్చుకునే విధంగా ప్రోత్సహించాలి.
- 24 గంటలపాటు షూటింగ్ స్పాట్, స్టూడియోల్లో సెక్యూరిటీ గార్డ్స్ విధుల్లో ఉండేలా చూసుకోవాలి. తద్వారా అతడు మాత్రమే గ్లౌజులు ధరించి తలుపులను తెరవడం, మూసివేయడం చేయడం ద్వారా ఎవరు తలపుల హ్యాండిల్స్‌ను తాకకుండా ఉండే అవకాశం ఉంటుంది.
- మధ్యాహ్న భోజన సమయంలోనూ భౌతిక దూరం తప్పనిసరి. ముఖ్యంగా పెళ్లి, మార్కెట్లు, ఫైట్ వంటి భారీ సన్నివేశాలను కరోనా తగ్గేవరకు చిత్రీకరించకుండా ఉండటం మంచిది.
- మేకప్ సిబ్బంది, హెయిర్ డ్రెస్సర్స్ పీపీఈ సెట్స్ ధరించాలి. ప్రతి ఒక్కరికీ మేకప్ చేసే ముందు, చేసిన తర్వాత శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి. మేకప్ చేసే సమయంలో మూడో వ్యక్తిని దగ్గరకు రానివ్వకూడదు.
- 10ఏళ్ల లోపు పిల్లలను సెట్‌లోకి అనుమతించకూడదు. ఒకవేళ అనుమతిస్తే ఆ పిల్లల బాగోగులు చూసుకోవడానికి ఒక్కరిని మాత్రమే నియమించాలి.
- నాన్ ఫిక్షన్ షోల్లో భౌతిక దూరం ఉండేలా సీట్లను కేటాయించాలి.
- షూటింగ్లో ఉన్న నటీనటులకు, మిగతా సిబ్బందికి వసతి కల్పించడం, ముఖ్యంగా వారి ప్రయాణాల కోసం ప్రత్యేక వాహనాలను కేటాయించడం వంటివి చేయాలి. వారు ప్రజారవాణాను ఉపయోగించకుండా చూసుకోవాలి.
- సెట్స్ లేదా స్టూడియోల్లో ప్రొడక్షన్ బృందాలకు ప్రత్యేక విభాగాలను కేటాయించాలి. తద్వారా పనిచేసే సబ్బంది గుమిగూడకుండా ఉండటానికి దోహదపడతుంంది.
- సెట్స్‌లో ఉన్నవారు ఒకరి ఫోన్లను ఒకరు తాకకూడదు. ముఖ్యంగా భోజనాలను ప్రత్యేకంగా ఇంటి వద్ద నుంచే తెచ్చుకునేలా వారిని ప్రోత్సాహించాలి.
- సెట్స్‌లో ఉన్నవారు.. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు లేదా ఇంకెవరికైనా కరోనా లక్షణాలు కనబడితే వారు స్వచ్ఛందంగా క్వారంటైన్లోకి వెళ్లిపోవాలి.
- టీవీ కార్యక్రమాలు లేదా సినిమాల షూటింగ్ కోసం ఆ సదరు నిర్మాత అక్కడి స్థానిక కలెక్టర్ దగ్గర నుంచి అనుమతి పత్రం పొందాలి.
ఇదీ చూడండి : 'సోనూ.. నా భర్త నుంచి దూరం చేయవా'