ETV Bharat / science-and-technology

YouTube New Update Monetization : యూట్యూబర్లకు గుడ్​ న్యూస్​.. నయా ఫ్యాన్​ ఫండింగ్​ రూల్స్​తో.. రెవెన్యూ జంప్ షురూ​! - YouTube Dream Feature App

YouTube New Update Monetization : క్రియేటర్లు అందరికీ యూట్యూబ్​ శుభవార్త అందించింది. యూట్యూబ్ షార్ట్​ వీడియోలు చేసేవారికి మానిటైజేషన్​ విధానంలో మార్పులు తీసుకువచ్చింది. అలాగే వీడియోలను సులువుగా రూపొందించుకునేందుకు.. ఓ అద్భుతమైన యాప్​ను అందుబాటులోకి తెచ్చింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

youtube-new-update-monetization-and-youtube-new-features-2023
యూట్యూబ్ షార్ట్ వీడియో మానిటైజేషన్ రూల్స్​
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 1:47 PM IST

YouTube New Update Monetization : కొత్తగా యూట్యూబ్ షార్ట్​ వీడియోలు చేస్తున్నారా? మీ ఛానల్ ఇంకా మానిటైజేషన్​ కాలేదా? మీకు తక్కువ సంఖ్యలోనే సబ్​స్క్రైబర్స్​​ ఉన్నారా? అయినా ఫర్వాలేదు!.. మీరు యూట్యూబ్​ మానిటైజేషన్ పొందొచ్చు. అందుకోసం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది యూట్యూబ్​.

ఫ్యాన్​ ఫండింగ్​ యాక్సిస్​​

  1. కనీసం 500 మంది సబ్​స్క్రైబర్స్​​ ఉండాలి.
  2. గత 90 రోజుల్లో 3​ వీడియోలు అప్​లోడ్​ చేసి ఉండాలి. అవి కూడా పబ్లిక్ వ్యూయర్​షిప్​ను కలిగి ఉండాలి.
  3. ఏడాది కాలంలో 3 వేల పబ్లిక్​ వాచింగ్​ అవర్స్​ ఉండాలి. లేదంటే గత 90 రోజుల్లో మూడు మిలియన్ల పబ్లిక్​ షార్ట్స్​ వ్యూస్​ అయినా ఉండాలి.

తాజా మోనటైజేషన్​ అప్​డేట్​తో.. క్రియేటర్లు నేరుగా.. తమ ఫ్యాన్స్ నుంచి ఫండింగ్ పొందడానికి అవకాశం ఏర్పడింది.

యూట్యూబ్​ నుంచి యాడ్​ రెవెన్యూ, ఫ్యాన్​ ఫండింగ్​ కోసం..

  1. 1000 మంది సబ్​స్క్రైబర్స్​​ ఉండాలి.
  2. లాంగ్ టర్మ్​ వీడియోలకు ఏడాది కాలంలో 4 వేల పబ్లిక్​ వాచింగ్​ అవర్స్​ ఉండాలి. లేదంటే పబ్లిక్​ షార్ట్​ వీడియోలకు గత 90 రోజుల్లో 10 మిలియన్​ వ్యూస్ వచ్చి ఉండాలి.

యూట్యూబ్‌లో వీడియో ఎడిటింగ్‌కు ఉచిత యాప్‌..
YouTube Create App : వీడియో క్రియేటర్లకు మరో శుభవార్త అందించింది యూట్యూబ్​. వీడియోలను సులువుగా ఎడిట్​ చేసుకునేందుకు వీలుగా "యూట్యూబ్‌ క్రియేట్‌" పేరిట కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. దాంతోపాటు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా రూపొందించిన 'డ్రీమ్‌ సీన్‌ ఫీచర్‌'ను కూడా టెస్ట్‌ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఫీచర్​ సాయంతో మీ షార్ట్‌ వీడియోలకు.. ఏఐ ఆధారంగా రూపొందించిన వీడియోలు, బ్యాక్‌గ్రౌండ్‌ ఇమేజ్‌లను జోడించవచ్చు. ఎడిటింగ్‌ ఫీచర్స్​.. ట్రిమ్మింగ్‌, ఆటోమేటిక్‌ క్యాప్షనింగ్‌, వాయిస్‌ ఓవర్‌, ట్రాన్సిషన్స్‌ లాంటి ఫీచర్లు.. ఈ కొత్త జనరేటివ్‌ ఏఐ ఆధారిత యాప్‌లో ఉంటాయి. అలాగే టిక్‌టాక్​ తరహాలో బీట్‌-మ్యాచింగ్‌ టెక్నాలజీతో ఉండే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్‌ను కూడా యూజర్లు వినియోగించుకోవచ్చు.

YouTube Dream Feature : వీడియోలను క్రియేట్‌ చేయాలన్నా, షేర్‌ చేయాలన్నా సులువుగా ఉండేందుకే ఈ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసినట్లు యూట్యూబ్ తెలిపింది. షార్ట్‌, లాంగ్‌ వీడియోలను రూపొందించడానికి దీన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఇదో ఉచిత యాప్‌ అని పేర్కొంది. ప్రస్తుతం భారత్​తో సహా మరి కొన్ని దేశాల్లో ఆండ్రాయిడ్‌లో బీటా యూజర్లకు ఈ ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది. కాకపోతే ఇప్పుడిది కేవలం ఆండ్రాయిడ్​ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది ఐఫోన్‌ యూజర్ల కోసం కూడా ఈ యాప్‌ను అందుబాటులోకి తెస్తామని యూట్యూబ్‌ వెల్లడించింది.

Apple iPhone 15 Series Sale : అదిరిపోయే ఆఫర్స్​, డిస్కౌంట్స్​తో.. ఐఫోన్ 15 సిరీస్​ సేల్​ ప్రారంభం

WhatsApp New Features : లేటెస్ట్​ వాట్సాప్​ బిజినెస్​ ఫీచర్స్​.. ఇకపై మరింత ఈజీగా బుకింగ్స్, పేమెంట్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.