Moto 200MP Phone: 2MP.. 5MP.. 8MP.. స్మార్ట్‌ఫోన్ వచ్చిన తొలినాళ్లలో కెమెరాల పరిస్థితి ఇదీ. ఒకప్పుడు పది మెగాపిక్సల్ దాటితే అబ్బురపడేవారు. కానీ, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లలో 50 ఎంపీ కెమెరా సర్వసాధారణమైపోయింది. ఈ తరుణంలో ఏకంగా 200 మెగాపిక్సల్ సెన్సర్‌తో ఓ ఫోన్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది మోటోరోలా. మోటో X30 Pro పేరిట దీన్ని తీసుకురానుంది. 200 మెగాపిక్సల్‌తో ప్రపంచంలో వస్తున్న తొలి ఫోన్ ఇదే. ఆగస్టు 2న చైనాలో ఈ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు మోటో ఏర్పాట్లు చేస్తోంది.
ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలను మోటోరోలా అధికారికంగా వెల్లడించగా.. మరికొన్ని స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. స్నాప్‌డ్రాగన్ 8+ జన్1 ప్రాసెసర్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. 125W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఇస్తున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఆండ్రాయిడ్ 12తో వచ్చే ఈ ఫోన్‌లో 12జీబీ ర్యామ్ ఉంటుందని, ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తారని సమాచారం. మరి ఈ ఫోన్ ధర ఎంత ఉంటుంది? పూర్తి స్పెసిఫికేషన్స్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. భారత్‌కు సైతం ఈ ఫోన్ తీసుకొస్తారని సమాచారం. మొత్తానికి ఈ కెమెరా ఫోన్‌తో టెక్ ప్రపంచం చూపును మరోసారి మోటోరోలా తనవైపు తిప్పుకుంది.
ఇవీ చదవండి: భారత్‌లో మళ్లీ 'గూగుల్ స్ట్రీట్ వ్యూ'.. ముందుగా ఆ నగరాల్లోనే!
80 సెకన్లలో దుస్తులుతికే మిషిన్.. సర్ఫ్, నీరు అవసరం లేకుండానే..