ETV Bharat / science-and-technology

విమెన్స్​ డే స్పెషల్: వనితలు పరిశోధనలోకి వస్తే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరుగులే...

author img

By

Published : Mar 8, 2021, 10:02 AM IST

ఓరోజు పున్నమి చంద్రుడిని చూపిస్తూ కొడుక్కి అన్నం తినిపిస్తోంది కౌసల్య. చిన్నారి రాముడికి ఆ అందాల జాబిల్లి తెగ నచ్చేసింది. దాన్ని తెచ్చివ్వమంటూ మారాం మొదలెట్టాడు. పిల్లవాడి ఏడుపు విని దశరథుడు తట్టుకోలేకపోయాడు. ఆ మాటా ఈ మాటా చెప్పి అబ్బాయి దృష్టి మళ్లించబోయాడు. కానీ రాముడు పట్టు వదలనేలేదు. అప్పుడొచ్చింది కైకేయి ఓ అద్దం పట్టుకుని. ఇంకేముంది... చేతికందిన చందమామని చూసి అబ్బాయి నవ్వాడు. అందరూ... అమ్మయ్య అనుకున్నారు. కథే కావచ్చు కానీ, సందర్భానికి తగిన యుక్తిని ప్రదర్శించడంలో ఆడవాళ్లకు తిరుగులేదనడానికి ఈ ఉదాహరణ చాలదూ! యుక్తిలోనే కాదు, శాస్త్రీయ దృష్టిలోనూ పరిశోధనాసక్తిలోనూ వారిది పైచేయే- అంటున్నారు నిపుణులు. సైన్సు సబ్జెక్టులు చదువుకున్న వనితలందరూ పరిశోధనలోకి వస్తే ప్రస్తుతం 84 ట్రిలియన్‌ డాలర్లున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏకంగా మరో పాతిక, ముప్ఫై ట్రిలియన్‌ డాలర్లు పెరుగుతుందని లెక్కలేసి మరీ చెబుతున్నారు.

వనితలంతా పరిశోధనలోకి వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరుగులే...

కమలా భాగవత్‌

దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితం సంగతి...

ముంబయిలో బి.ఎస్సీ. పూర్తిచేసిన కమలా భాగవత్‌ బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సి)లో రీసెర్చ్‌ ఫెలోషిప్‌ కోసం దరఖాస్తు చేసింది. కానీ ఆమెకు ప్రవేశం లభించలేదు. మార్కులు తక్కువ వచ్చినందుకో మరొకందుకో కాదు, ఆడవాళ్లు సైన్సు పరిశోధన ఏం చేయగలరూ అన్న చిన్నచూపు. అప్పుడా సంస్థకి అధిపతిగా ఉన్నది ఆషామాషీ వ్యక్తి కాదు, నోబెల్‌ గ్రహీత సీవీ రామన్‌. ఆయన్ని ఒప్పించడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయే సరికి, తనకి అవకాశం ఇవ్వకపోవడానికి కారణం చెప్పమంటూ కమల ఆయన ఆఫీసు ముందు సత్యాగ్రహం చేసింది. దాంతో మూడు షరతులతో ఆమెకు ప్రవేశం కల్పించారు. ఏడాదిపాటు ఆమె పనితీరు చూశాకే సీటు ఖరారు చేస్తామనీ, రాత్రి ఆలస్యమైనా పని చేయాల్సివస్తే అభ్యంతరం చెప్పకూడదనీ, పురుష శాస్త్రవేత్తల ఏకాగ్రతకు భంగం కలగకుండా నడచుకోవాలనీ... ఆయన పెట్టిన షరతులు చూసిన కమల- అవి తన ఆత్మాభిమానానికి అవమానంగా భావించింది. కానీ, తన లక్ష్యం నెరవేరాలంటే సర్దుకుపోక తప్పదు కాబట్టి వాటికి అంగీకరించి చేరింది. అలా ఐఐఎస్‌సిలో ప్రవేశం పొందిన తొలి మహిళగానూ, ఆ తర్వాత సైన్సులో పీహెచ్‌డీ చేసిన తొలి భారతీయ వనితగానూ చరిత్ర సృష్టించింది కమల.

నాలుగున్నర దశాబ్దాల క్రితం...

ఇంజినీరింగ్‌లో పోస్టుగ్రాడ్యుయేట్‌ పట్టా అందుకున్న ఓ యువతి పత్రికల్లో ఉద్యోగావకాశాల ప్రకటనలు వెతుకుతోంది. పెద్ద కంపెనీ ప్రకటన ఒకటి ఆమెను ఆకట్టుకుంది. మంచి అవకాశమే కానీ, పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలంటూ చివర్న ఉన్న షరతు చూసేసరికి ఆమెకి చాలా కోపం వచ్చింది. ఇదేం వివక్ష... పురుషులతో సమానంగా చదువుకుని పట్టా పొందిన మహిళలు ఉద్యోగం చేయడానికి మాత్రం పనికిరారా... అనుకుంది. వెంటనే ఆవేశంగా ఆ కంపెనీ యజమానికి ఓ పోస్టు కార్డు రాసిపడేసింది. తిరుగుటపాలోనే ఆయన క్షమాపణలతో పాటు ప్రత్యేక ఇంటర్వ్యూకి రమ్మంటూ ఆహ్వానం కూడా వచ్చింది. ఆ యువతి నేటి ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధామూర్తి అయితే ఆమెకి క్షమాపణలు చెప్పి మరీ ఉద్యోగమిచ్చిన ఆ నాటి సంస్థ టాటా వారి ‘టెల్కో’.

మరి ఇప్పుడో...

చంద్రిమా సాహా...భారత జాతీయ సైన్సు అకాడమీకి తొలి మహిళా అధ్యక్షురాలు.
ప్రియా అబ్రహాం... నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి డైరెక్టరు.
గగన్‌దీప్‌ కంగ్‌... ప్రతిష్ఠాత్మక రాయల్‌ సొసైటీ సభ్యత్వం పొందిన తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్త.
ప్రియా బాలసుబ్రమణ్యం...
ఆపిల్‌లో ఐఫోన్‌ ఆపరేషన్స్‌ విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌.
నందినీ రమణి... ట్విటర్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి ఉపాధ్యక్షురాలిగా చేసింది ఇప్పుడు అవుట్‌కమ్‌ హెల్త్‌ అనే సంస్థకి సీఓఓ.
అంజలీ జోషి... గూగుల్‌ ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేసి ఇప్పుడు మెక్‌ క్లాచీస్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో ఒకరు.
అపర్ణా రమణి... ఫేస్‌బుక్‌లో ఇంజినీరింగ్‌ విభాగానికి డైరెక్టర్‌.
ఇలా ఇంకా ఎందరో..! స్వదేశంలో జాతీయ స్థాయి సంస్థలకీ, విదేశాల్లో మల్టీనేషనల్‌ కంపెనీలకీ సేవలందిస్తున్న వీరంతా- సైన్సు, ఇంజినీరింగ్‌ రంగాల్లో పెద్ద పెద్ద చదువులు చదివిన భారతీయ వనితలే. ఇదంతా ఎలా సాధ్యమైందీ అంటే- తొలి తరం నడచిన పోరుబాట మలితరానికి రాచబాట వేసింది కాబట్టి..!

మొదటి స్థానం మనదే

సైన్సు, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం... ఈ నాలుగు రంగాలనీ కలిపి ‘స్టెమ్‌’ అని వ్యవహరిస్తారు. ప్రస్తుతం మనదేశంలో ఈ రంగాల్లో పట్టాలు పుచ్చుకుంటున్నవారిలో 43 శాతం మహిళలే. యూజీసీ లెక్కల ప్రకారం ఈ మధ్యకాలంలో ఉన్నత విద్యాసంస్థల్లో చేరుతున్నవారిలో 48శాతం స్త్రీలే. 2015లో పీహెచ్‌డీ పట్టా పొందినవారిలో 38 శాతం వారే. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంతమంది మహిళలు సైన్సు టెక్నాలజీ రంగాల్లో ఈ స్థాయి చదువులు చదువుకోవడం లేదు. అయితే ఉద్యోగం విషయానికి వచ్చేసరికి ఈ ఆనందం ఆవిరైపోతోంది. పద్నాలుగు శాతం మాత్రమే తాము చదివిన సబ్జెక్టుల్లో పరిశోధన, బోధన సంబంధ ఉద్యోగాలు చేస్తున్నారు. ఫలితంగా చదువుల్లో మొదటి ర్యాంకులో ఉన్న మన దేశం పరిశోధన విషయంలో 19వ ర్యాంకులో ఉంది. అదే ఈ విషయంలో ప్రపంచ సగటు చూస్తే 30 శాతం మహిళలు పరిశోధనారంగంలో ఉన్నారు.

మూడోవంతు మహిళలు పరిశోధకులైతేనే ఎన్నో విజయాలను తమ పేరున రాసుకున్నారు కదా, అలాంటిది చదువు కున్నవారంతా పనిచేస్తే ఇంకెన్ని సాధించ గలరో, అప్పుడు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇంకెంత బాగా అభివృద్ధి చెందుతాయో- అన్న సందేహం వచ్చింది ఆర్థిక నిపుణులకి. అనుకున్నదే తడవు లెక్కలేసి మరీ చూశారు. ఈ స్టెమ్‌ విభాగాల్లో చదువుకున్న మహిళలంతా అవే విభాగాల్లో పరిశోధన చేస్తే ప్రస్తుతం 84 ట్రిలియన్‌ డాలర్లున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువ ఏకంగా మరో ముప్ఫై ట్రిలియన్‌ డాలర్ల వరకూ పెరిగే అవకాశం ఉందని మెకిన్సే నివేదిక ఇచ్చింది. యూరోపియన్‌ యూనియన్‌ కమిషన్‌ మరో అడుగు ముందుకేసి, స్టెమ్‌ విభాగాల్లో స్త్రీ పురుషులకు సమానావకాశాలు కానీ ఇవ్వదలచుకుంటే- యూరప్‌లోనే కోటికి పైగా కొత్త ఉద్యోగాలు వస్తాయనీ, అందులో 70 శాతాన్ని మహిళలే అందిపుచ్చుకుంటారనీ చెప్పింది.

ఐక్యరాజ్యసమితి కూడా పరిశోధనా రంగంలో సమానత్వం సాధించడాన్ని- 2030 అజెండాలోని స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటిగా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ స్త్రీలు ‘స్టెమ్‌’ సబ్జెక్టుల్లో పైచదువులు చదివేలా, ఆ తర్వాత పరిశోధనా రంగంలో కొనసాగేలా ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసు కుంటున్నాయి. చదువుల విషయంలో ఇప్పటికే ఒకడుగు ముందున్న మన దేశం పట్టా పుచ్చుకోడానికీ పరిశోధనకీ మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి చర్యలు మొదలెట్టింది. ఈ నేపథ్యంలో- అసలీ అంతరానికి ప్రధాన కారణాలేమిటో, అందులో అపోహలేమిటో, స్టెమ్‌ విభాగాల్లో పైకి ఎదగాలంటే ఏం చేయాలో, అందుకు ప్రముఖుల స్వానుభవం ఏం చెబుతోందో చూస్తే...

జూన్‌ అల్మైడా

తపన చాలు...

శాస్త్రవేత్తలు కావాలంటే చిన్నప్పటినుంచీ అదే ధ్యాసతో చదువుకోవాలనీ, మేధావులకే అది సాధ్యమనీ అనుకుంటారు చాలామంది. సమస్య మూలాల్ని తరచి చూసే గుణం, కారణాల్ని శోధించే తత్వం, పరిష్కారం దొరికేదాకా విశ్రమించని నైజం ఉండాలే కానీ అసలు చదువే లేకున్నా శాస్త్రవేత్తలు కాగల రనడానికి నిలువెత్తు ఉదాహరణ జూన్‌ అల్మైడా... అని చెబుతారు మనదేశంలో ‘వ్యాక్సిన్‌ గాడ్‌ మదర్‌’గా పేరుతెచ్చుకున్న గగన్‌దీప్‌ కంగ్‌. స్కాట్లాండ్‌కి చెందిన జూన్‌ పేదరికం వల్ల పదహారేళ్లకే చదువుమానేసి ల్యాబ్‌ టెక్నీషియన్‌గా ఉద్యోగంలో చేరింది. బాగా చదువుకోవాలనీ పరిశోధనలు చేయాలనీ కలలు కన్న ఆ అమ్మాయికి రోగులకు సంబంధించిన నమూనాలను పరిశీలించే ఆ ల్యాబే ప్రయోగశాల అయింది. ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపే దారిచూపే ‘గైడ్‌’ అయింది. సైన్సు పట్ల తన ఇష్టాన్నంతా ఆ పరిశీలనలో పెట్టి నమూనాలో వైరస్‌ల ఆచూకీకోసం గంటల తరబడి ఓపిగ్గా వెతికేది. వైరస్‌ ఉందో లేదో తెలుసుకోవడమే ఆమె ఉద్యోగం. కానీ ఆసక్తి ఆ వైరస్‌ల రూపురేఖల్ని గుర్తించేలా చేసింది. అలా జూన్‌ కరోనా వైరస్‌ రూపాన్ని కనిపెట్టడం ఆరోజుల్లో పెద్ద సంచలనం. తాజాగా కొవిడ్‌-19 ఆ కోవకు చెందిన వైరసే కాబట్టి జూన్‌ పేరు ఇప్పుడు అందరికీ తెలిసిందనీ, ఆ తర్వాత ఆమె హెపటైటిస్‌ బి, హెచ్‌ఐవీ, రుబెల్లా వైరస్‌లనీ గుర్తించిందనీ, లండన్‌లోని ఒక వైద్య కళాశాల పిలిచి మరీ సీటిచ్చి జూన్‌ని చదివించిందనీ గగన్‌దీప్‌ చెబుతారు. పరిశోధనలకు చదువు కన్నా ముందు కావలసింది తపన- అనే గగన్‌దీప్‌ మెడిసిన్‌ చదివి ప్రజారోగ్యాన్ని పరిశోధనాంశంగా ఎంచుకుని ఏటా లక్షల ప్రాణాలు తీస్తున్న టైఫాయిడ్‌, రోటావైరస్‌లకు వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేశారు.

రీతూ కరిధాల్

వ్యక్తిగత జీవితానికి ఢోకా లేదు...

పరిశోధకులు ఇరవైనాలుగ్గంటలూ ప్రయోగశాలలోనే ఉంటారు, వారికి వ్యక్తిగత జీవితం ఉండదు... అన్న అభిప్రాయం పూర్తిగా అపోహేనంటారు డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు. అందుకు తమ జీవితాలనే ఉదాహరణలుగా చూపుతారు. ‘రాకెట్‌ ఉమన్‌ ఆఫ్‌ ఇండియా’ అన్న పేరు తెచ్చుకున్న రీతూ కరిధాల్‌ చిన్నప్పుడు లఖ్‌నవూలోని తమ ఇంటి వాకిట్లో కూర్చుని రోజురోజుకీ మారిపోయే చంద్రుడిని అబ్బురంగా చూసేదట. చదువవ్వగానే ఆమె ఇస్రోలో సైంటిస్టుగా చేరడమే కాదు, ప్రతిష్ఠాత్మక మంగళ్‌యాన్‌ ప్రాజెక్టుకి డిప్యూటీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ అయ్యారు. ఇద్దరు పిల్లల తల్లయిన రీతూ ఆ తర్వాత చంద్రయాన్‌-2కి మిషన్‌ డైరెక్టరుగానూ బాధ్యతలు నిర్వహించారు. నందినీ హరినాథ్‌ ఇస్రోలో పనిచేసిన ఇరవయ్యేళ్ల సర్వీసులోనే 14 ప్రాజెక్టుల్ని విజయ వంతంగా పూర్తిచేశారు. ఆమెకీ ఇద్దరు అబ్బాయిలు. ఇక, ‘మిస్సైల్‌ ఉమన్‌ ఆఫ్‌ ఇండియా’ అగ్ని ప్రాజెక్టు డైరెక్టర్‌ టెస్సీ థామస్‌ సంగతి తెలిసిందే. ఆమెకీ ఒక కొడుకు ఉన్నాడు. ఇస్రోలో దాదాపు 1200 మంది మహిళలు సైంటిఫిక్‌, టెక్నికల్‌ విభాగాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘అన్ని ఉద్యోగాల్లాగే ఇది కూడా. వ్యక్తిగత జీవితానికి ఏ నష్టమూ ఉండదు. దేశ ప్రతిష్ఠతో ముడిపడి ఉన్న విషయం కాబట్టి పెద్ద ప్రాజెక్టులు ఉన్నప్పుడు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది. కొంచెం ఒత్తిడి ఉంటుంది. అంతకు మించి ఇంకే తేడా ఉండదు. మహిళలు ఏ ఉద్యోగం చేస్తున్నా పిల్లల్ని పెంచే క్రమంలో పెద్దల అవసరమూ, భాగస్వామి సహాయమూ ఎలాగూ తప్పవు కాబట్టి అనవసర భయాలతో కలలు కన్న ఉద్యోగాలను వదులుకోవద్దు’ అని నవతరానికి సలహా ఇస్తున్నారు ఈ శాస్త్రవేత్తలు.

గుర్తింపు మనచేతుల్లోనే...

‘సమాజంలో మంచీ చెడూ ఎక్కడైనా ఉంటుంది. ఒక వృత్తిలో అందరూ మంచివాళ్లే ఉండటమూ మరో వృత్తిలో అందరూ చెడ్డవాళ్లే ఉండటమూ జరగదు. వివక్ష లేదనను కానీ దాన్ని అధిగమించడం కష్టం కాదంటాను’ అంటారు న్యూరో సైంటిస్టు శుభా తోలె. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌లో ప్రొఫెసరుగా పనిచేస్తున్న శుభ తన బృందంతో కలిసి గొప్ప పరిశోధనలే చేశారు. బిడ్డ పిండదశలో ఉన్నప్పుడే మెదడు ఎలా అభివృద్ధి చెందుతుందో చూపించి ప్రతిష్ఠాత్మక ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌ అందుకున్నారామె. ‘అందరిలోనూ మెదడు నిర్మాణం ఒకేలా ఉంటుంది. అందులో ఉండే సర్క్యూట్స్‌ ఒకేలా ఉంటాయి. కానీ ఎక్కడో ఏదో ఒక సర్క్యూట్‌లో ఒక చిన్న మెలిక- ఆ వ్యక్తిని ప్రత్యేకంగా నిలుపుతుంది. అందుకే మెదడు గురించి పరిశోధించడం నాకిష్టం’ అనే శుభ మెదడులో సంక్లిష్టంగా ఉండే హిపోకాంపస్‌ సరిగ్గా అభివృద్ధి చెందడానికి తోడ్పడే జన్యువునీ గుర్తించారు. ఆ పరిశోధనను ఇంకా ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నారు. మంచి పని వాతావరణం ఉండే సంస్థను ఎంచుకుంటే శాస్త్రీయ పరిశోధనారంగాన్ని మించిన తృప్తినిచ్చే వృత్తి మరొకటి ఉండదనీ, ఇదివరకటికన్నా పరిస్థితులు చాలా మారాయి కాబట్టి నిరభ్యంతరంగా దీన్ని ఎంచుకోవచ్చనీ చెబుతారు శుభ. ‘ప్రతి మహిళా శాస్త్రవేత్తా మరికొంతమందిని ప్రోత్సహిస్తే వివక్ష దానంతటదే పోతుందనే’ శుభ, చేసిన పనికి గుర్తింపు తెచ్చుకోవడం కూడా వ్యక్తుల మీదే ఆధారపడి ఉంటుందంటారు. మొహమాటాన్ని వదిలి అవకాశాలను అందిపుచ్చుకుంటే ఆటోమేటిక్‌గా గుర్తింపు వస్తుందనేది ఆమె చెప్పే సలహా.

అదితి

అవకాశాలున్నాయి...

సముద్రంలో ఉండే ఒకరకం నాచు మీద పరిశోధనతో పీహెచ్‌డీ పట్టా అందుకున్నాక అదితి పంత్‌ ముందున్న పెద్ద ప్రశ్న- అమెరికాలోనే ఉండి పరిశోధన కొనసాగించాలా, స్వదేశానికి తిరిగి రావాలా అన్నది. తిరిగొస్తే పనిచేసేందుకు ఇక్కడ ఎలాంటి సంస్థలున్నాయో కూడా అదితికి తెలియదు. ఒక సందర్భంలో ప్రొఫెసర్‌ ఎన్‌కె పణిక్కర్‌ని కలిసినప్పుడు ఆమెకు గోవాలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ అనే సంస్థ ఉందని తెలిసింది. వెంటనే భారత్‌ వచ్చేసిన అదితి పదిహేడేళ్లపాటు ఆ సంస్థలో పనిచేసింది. అక్కడ ఉన్నప్పుడే అంటార్కిటికా యాత్రకు వెళ్లి ఆ అవకాశం పొందిన తొలి భారతీయ మహిళ అయింది. అక్కడ ఏడాదికి పైగా ఉండి ఎన్నో పరిశోధనలు చేసింది. ‘ఇండియా తిరిగి వచ్చినందుకు చాలామంది నన్ను విచిత్రంగా చూశారు కానీ, నేను మాత్రం ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు. అమెరికాలో ఉంటే నాకు అంటార్కిటికా అవకాశం వచ్చేది కాదు. అసాధారణమైన వాతావరణంలో అద్భుతమైన ప్రయోగాలు చేసిన అనుభవం దొరికేది కాదు’ అనే అదితి ఆ అనుభవాలతో ఓ పుస్తకం కూడా రాసింది. తన పేరున ఐదు పేటెంట్లు, అంతర్జాతీయ పత్రికల్లో డెబ్భైదాకా ప్రచురణలూ కలిగి ఉన్న అదితికి అసలు డిగ్రీ చదివేవరకూ తన కెరీర్‌ గురించి ఒక ఆలోచనే లేదట. ‘ద ఓపెన్‌ సీ’ అన్న పుస్తకం చదివాక సముద్రం మీద ఆసక్తి పెరిగింది. విదేశాల్లో చదివించే స్తోమత లేదన్నారు తల్లిదండ్రులు. అదృష్టవశాత్తూ స్కాలర్‌షిప్‌ కూడా లభించడంతో ఆమెకి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు.

నిధులూ వస్తాయిక...

మహిళా శాస్త్రవేత్తల పరిశోధనలకు కొన్ని రంగాల్లో అసలు నిధులు రావన్నది నిజమేనంటారు వ్యవసాయ శాస్త్రవేత్త పరంజీత్‌ ఖురానా. తాను చేస్తున్న పరిశోధన ఎంత విలువైనదో చెప్పి అందుకు అవసరమైన నిధులు పొందడం ప్రతి శాస్త్రవేత్తకీ కత్తి మీద సామేనంటారామె. వ్యాపారానికి అనువైన రంగాల్లో పరిశోధనలకు నిధులు ఇచ్చినట్లుగా మిగతా రంగాల్లో ఇవ్వరనీ అయితే ఇప్పుడిప్పుడు పరిస్థితి మారు తోందనీ భవిష్యత్తులో ఆ ఇబ్బంది ఉండకపోవచ్చనీ అంటారామె. పరంజీత్‌ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుని అక్కడే ప్రొఫెసరుగా ఉద్యోగం చేస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో విద్యార్థులు పరిశోధనలు చేసి పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. ప్లాంట్‌ మాలిక్యులార్‌ బయాలజీలో నిపుణురాలైన పరంజీత్‌ అన్నిరకాల వాతావరణాల్నీ తట్టుకుని పండే వరి, గోధుమ విత్తనాల్ని అభివృద్ధిపరిచారు. వీటి వల్ల ధాన్యం ఉత్పత్తి ఎన్నో రెట్లు పెరిగింది. బంజరు భూమిలో సైతం పెరిగే మల్బరీ రకాన్నీ ఆమె రూపొందించారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదలా సమస్యకి మూలాల్ని శోధించే ఓర్పూ పరిష్కారాన్ని కనిపెట్టగల నేర్పూ...
పరిశోధకులకు ఉండాల్సిన లక్షణాలు. అవి స్త్రీల సహజగుణాలు. అలాంటప్పుడు మహిళలు ఈ రంగంలోకి వస్తే శాస్త్ర సాంకేతిక ప్రగతి పరుగులు తీయదా..! సమానత్వం దానికి బోనస్‌ అవదా..!

‘మెటిల్డా ఎఫెక్ట్‌’ పోవాలి!

మార్గరెట్‌ రోజిటర్

సైన్సు చదువుల్లోనే కాదు, పరిశోధనా పత్రాల సమర్పణలోనూ మన మహిళలు మొదటి స్థానంలోనే ఉన్నారు. ‘జర్నల్‌ ఆఫ్‌ ఇన్ఫర్‌మెట్రిక్స్‌’ నివేదిక ప్రకారం మనదేశంలో ప్రచురితమవుతున్న పరిశోధనా పత్రాల్లో మూడింట ఒక వంతు మహిళలవేనట. ప్రపంచ సగటు కన్నా ఇది ఎక్కువే. అయితే అంతర్జాతీయ స్థాయి పత్రికల్లో ఆ పత్రాలు ప్రచురిత మవుతున్నా వారికి దక్కాల్సిన గౌరవమూ గుర్తింపూ దక్కడం లేదన్నది వాస్తవం. తరతరాలుగా ఉన్న వివక్షే వారి సామర్థ్యాల్ని గుర్తించడానికి అడ్డొస్తోంది. మహిళల కృషిని పురుషుల ఖాతాల్లో జమచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ తరహా పక్షపాతాన్ని మొట్టమొదట ఎత్తి చూపిన అమెరికా మహిళా హక్కుల ఉద్యమకారిణి మెటిల్డా జోస్లిన్‌ గేజ్‌ పేరిట ‘మెటిల్డా ఎఫెక్ట్‌’ అని పేరు పెట్టారు సైన్సు చరిత్రకారిణి మార్గరెట్‌ రోజిటర్‌. చాలామంది మహిళా శాస్త్రవేత్తల కృషిని వారు చనిపోయాక మగవారి పేరుతో ప్రచురించడాన్ని ఆమె ఉదాహరణలుగా చూపారు. పదవులూ అవార్డుల విషయంలో మహిళలకు న్యాయం జరగాలంటే సంస్థల్లో ఈ మెటిల్డా ఎఫెక్ట్‌ పోవాలనీ, పరిశోధకులను శాస్త్రవేత్తలుగా చూడాలి తప్ప స్త్రీలుగానో పురుషులుగానో చూడకూడదనీ అంటారామె.

ఇదీ చూడండి: రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్ల మార్కు చేరే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.