Winter Solstice 2021: డిసెంబర్ 21.. ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత ఎంటో తెలుసా? ఇది సంవత్సరంలో అత్యంత చిన్న రోజు. సూర్యుడు ఉదయం 7.10 గంటల నుంచి సాయంత్రం 5.29 గంటల మధ్యే ఉంటాడు. వింటర్ సోల్స్టీస్గా పిలిచే ఈ రోజు గురించి గూగుల్ కూడా తన సెర్చ్ ఇంజిన్‌లో ప్రత్యేక డూడుల్‌ని చేసింది. ఇంతకీ ఈ సోల్స్టీస్ అంటే ఏంటో.. వాటి వివరాలు ఎంటో తెలుసుకుందాం.
సోల్స్టీస్ అంటే..
సుదీర్ఘ రాత్రి లేదా పగలు ఉన్న రోజులను సోల్స్టీస్ అంటారు. ఏటా జూన్ 21న, డిసెంబరు 21న.. రెండు సందర్భాల్లో ఈ సోల్స్టీస్ ఏర్పడుతుంది. లాటిన్ భాషలోని సోల్, సిస్టెరీ అనే పదాల నుంచి ఈ సోల్స్టీస్ వచ్చింది. జూన్‌లో వచ్చే దానిని సమ్మర్ సోల్ట్స్టిస్, డిసెంబర్లో ఏర్పడే దానిని వింటర్ సోల్ట్స్టీస్గా పేర్కొంటారు.
భూమి ఉత్తరధ్రువం సూర్యుడికి దూరంగా వెళ్లడం సహా సూర్యుడు మకర రేఖపైకి రావడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. యూకే, అమెరికా, భారత్, రష్యా, చైనా సహా కెనడా దేశాల్లో ఈ సోల్స్టీస్ ప్రభావం ఉంటుంది.
భారత కాలమానం ప్రకారం రాత్రి 9.29 గంటలకు ఈ వింటర్ సోల్స్టీస్ ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి అక్షరేఖ 23.5 డిగ్రీలు వంపు తిరుగుతుంది.
ఈ రోజు మరో ప్రత్యేకత ఏంటంటే ఇక నుంచి క్రమంగా రాత్రి సమయం తగ్గి పగలు పెరుగుతుంది. అదే విధంగా సమ్మర్ సోల్స్టిస్ తర్వాత క్రమంగా పగటి సమయం తగ్గి రాత్రి సమయం పెరుగుతుంటుంది.
ఇదీ చూడండి : 52 స్టార్‌లింక్ ఉపగ్రహాలతో కక్ష్యలోకి స్పేస్ ఎక్స్ రాకెట్