విండోస్ 11తో సరికొత్త ఫీచర్స్‌ను యూజర్స్‌కు అందించిన మైక్రోసాఫ్ట్ మరో యూజర్ ఫ్రెండ్లీ యాప్‌ను కొత్త ఓఎస్‌లో ప్రవేశపెట్టనుంది. మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లోని చాట్ యాప్‌ను విండోస్ 11 ద్వారా టాస్క్‌బార్‌లో చేర్చనున్నట్లు తెలిపింది. దీని సాయంతో యూజర్స్ టాస్క్‌బార్ నుంచే చాట్, కాల్స్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను విండోస్ ఇన్‌సైడర్స్‌కి మాత్రమే ఇస్తున్నారు. త్వరలోనే యూజర్స్ అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
చాట్ యాప్‌ను ప్రతి యూజర్‌కి అందించడం కోసం మైక్రోసాఫ్ట్ కొత్త గ్రూప్ పాలసీని తీసుకొచ్చింది. యాప్ అందుబాటులోకి వచ్చాక సదరు పాలసీని యూజర్స్ ఎనేబుల్ చేసుకుంటే కంప్యూటర్‌లో టాస్క్‌బార్‌పై చాట్ ఐకాన్ కనిపిస్తుంది. ఒకవేళ టాస్క్‌బార్‌పై యాప్ వద్దనుకుంటే సెట్టింగ్స్ లేదా గ్రూప్ పాలసీ ఎడిటర్ ద్వారా డిజేబుల్ చేసుకోవచ్చు.
ఈ యాప్ సాయంతో యూజర్స్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, బిజినెస్ కాంటాక్ట్స్‌ను ఆన్‌లైన్‌లో సులువుగా కలుసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అలానే ఈ యాప్‌ను విండోస్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
ఇదీ చదవండి : శాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ.. ఫీచర్స్ లీక్!