ETV Bharat / science-and-technology

విండోస్ 11 వచ్చేసింది.. కొత్త ఫీచర్లు తెచ్చేసింది! - విండోస్ 11 అప్​గ్రేడ్

విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్​ భారత్​లో అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ అప్డేటెడ్ వెర్షన్​ ఇకపై విండోస్ 11 లోడ్​ చేసిన పీసీలు సహా అర్హత కలిగిన విండోస్​-10 పీసీల్లోనూ​ అందుబాటులో ఉండనుంది.

విండోస్ 11
Windows 11
author img

By

Published : Oct 5, 2021, 2:30 PM IST

Updated : Oct 5, 2021, 3:55 PM IST

టెక్ ప్రియులు ఎప్పడుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ భారత్​లో అందుబాటులోకి వచ్చింది. ఇకపై విండోస్ 11 లోడ్​ చేసిన పీసీలు సహా అర్హత కలిగిన విండోస్​-10 పీసీల్లోనూ ఈ కొత్త ఓఎస్​ అందుబాటులో ఉండనుంది. అధునాతన ఫీచర్లు, డిజైన్​తో వస్తున్న ఈ ఓఎస్​ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

"మునుపెన్నడూ లేని విధంగా పీసీలు మన జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే విండోస్​ 11ను మీ ఉత్పాదకత పెంచి, సృజనాత్మకతకు రెక్కలు తొడిగేలా తీర్చిదిద్దాం." అని మైక్రోసాఫ్ట్​ పేర్కొంది.

ఇలా అప్​గ్రేడ్ చేసుకోండి

విండోస్​ 11తో (ప్రీలోడెడ్​) వచ్చే ఆకర్షణీయ కొత్త డివైజ్​ల్లో ఈ అప్​గ్రేడ్ నేటి (అక్టోబర్ 5) నుంచి అందుబాటులో ఉండనుంది . అయితే విండోస్​ 10తో వచ్చే కొత్త డివైజ్​లు ఈ ఓఎస్​ కోసం అప్​గ్రేడ్​ సదుపాయం కల్పించనున్నారు.

విండోస్​ 10 వాడుతున్నారా?

మీరు ప్రస్తుతం విండోస్ 10 వాడుతున్నట్లు అయితే మీ పీసీ అప్​గ్రేడ్​ చేసుకోవడానికి అర్హత (ఎలిజిబిలిటీ) ఉందో లేదో చూడాలి. పీసీ హెల్త్ చెక్ యాప్​ ద్వారా అది తెలుసుకోవచ్చు.

ఆ తర్వాత విండోస్​ 11 అప్​గ్రేడ్​ సిద్ధంగా ఉందో లేదో సెట్టింగ్స్​లో చెక్ చేయాలి. అందుకోసం.. విండోస్ అప్​డేట్​ సెట్టింగ్స్​ ఓపెన్​ చేసి.. (Settings > Update & Security > Windows Update) చెక్​ ఫర్​ అప్​డేట్స్​లో (Check for updates) చూడాలి.

మీ డివైజ్​కు ఎలిజిబిలిటీ ఉండి, అప్​గ్రేడ్​ సిద్ధంగా ఉంటే డౌన్​లోడ్​, ఇన్​స్టాల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు విండోస్ 11 కావాలనుకుంటే డౌన్​లోడ్​ చేసుకుని, ఇన్​స్టాల్​ చేసుకుంటే సరిపోతుంది.

విండోస్​ 11 పొందాలనుకుంటే..

విండోస్​.కామ్​ లేదా స్థానిక స్టోర్​లో నేరుగా విండోస్​ 11తో వచ్చే కొత్త పీసీలను కొనుగోలు చేయండి.

విండోస్​.కామ్​ లేదా స్థానిక స్టోర్​లో ఉచితంగా అప్​గ్రేడ్​ చేసుకోవడానికి అర్హత ఉన్న విండోస్ 10 పీసీని కొనండి.

పీసీ హెల్త్​ చెక్​ యాప్​ ద్వారా మీ ప్రస్తుత విండోస్​ 10 పీసీ.. ఉచితంగా విండోస్​ 11కి అప్​గ్రేడ్​ అవ్వగలదో లేదో చెక్​ చేయండి.

ఫీచర్లు ఇవే

  • అధునిక డిజైన్, సౌండ్ సిస్టమ్​తో వచ్చే ఓఎస్​ వాడటానికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది
  • రీసెంట్​ ఫైల్స్​ను చూసుకోవడానికి డివైజ్​ ఏదైనా క్లౌడ్​, మైక్రోసాఫ్ట్​ 365 వినియోగించుకునేలా రూపకల్పన
  • మల్టీ టాస్కింగ్, స్నాప్​ లేఅవుట్, స్నాప్ గ్రూప్స్​ ఫీచర్
  • ప్రజలు త్వరగా అనుసంధానం కావడానికి టాస్క్​బార్​లో మైక్రోసాఫ్ట్​ టిీమ్స్​ సదుపాయం
  • సమాచారాన్ని త్వరితగతిన అందుకోవడానికి ఏఐతో కూడిన విడ్జెట్స్
  • హై క్వాలిటీ గేమ్స్​ ఆడటానికి అందుబాటులోకి డైరెక్ట్​ఎక్స్​12 అల్టిమేట్​, డైరెక్ట్​సోరేజీ వంటి సాంకేతికతలు
  • కావాల్సిన యాప్స్​ కోసం విశ్వనీయ, సరికొత్త మైక్రోసాఫ్ట్ స్టోర్
  • దివ్యాంగులు సులువుగా వాడుకునేలా ప్రత్యేకమైన డిజైన్
  • స్టోర్​లో కొత్త యాప్స్​ ఉంచేందుకు డెవలపర్లు, క్రియేటర్లకు అవకాశం
  • టచ్​, డిజిటల్ పెన్, వాయిస్ ఇన్​పుట్​లతో వేగంగా, సమర్థవంతమైన పనితీరుతో ఓఎస్
  • హైబ్రిడ్​ పనుల కోసం రూపొందించిన విండోస్ 11లో పీసీ భద్రత కోసం పటిష్ట సాంకేతిక ఏర్పాటు

ఇవీ చూడండి: వాట్సాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ చదివేయొచ్చు!

Last Updated : Oct 5, 2021, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.