వాట్సాప్(whatsapp app).. మన దైనందిన జీవితంలో ముఖ్యభాగమైపోయింది. ఎంతలా అంటే నిద్రలేచింది మొదలు నిద్రపోయేదాకా ఈ యాప్‌తో గడిపేంతలా! మెసేజ్‌లతో ఫొటోలు, వీడియోలు సెండ్ చేస్తూ ఆనందాన్ని పొందుతున్న మనకు.. ఈ మధ్య పేమెంట్స్ ఆప్షన్ తీసుకొచ్చింది వాట్సాప్. త్వరలో క్యాష్‌బ్యాక్(whatsapp cashback) కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతుంది.
ప్రస్తుతం టెస్టింగ్ ప్రొసెస్‌లో ఉన్న ఈ సదుపాయాన్ని త్వరలో యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని వాట్సాప్(whatsapp app) బీటా ఇన్ఫో సంస్థ తెలిపింది.
![WhatsApp working on feature to reward](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13156403_whastapp.jpg)
ఇందులో భాగంగా వాట్సాప్(whatsapp app) పేమెంట్ ఆప్షన్ ఉపయోగించి, యూపీఐ ద్వారా డబ్బులు పంపితే వారికి క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఒక్కో పేమెంట్‌కు కనీసం రూ.10 క్యాష్‌బ్యాక్ జమచేయనుంది. క్యాష్‌బ్యాక్ ఆప్షన్ పూర్తిస్థాయిలో వచ్చే సమయానికి ఈ మొత్తం పెరిగే అవకాశం కూడా ఉంది!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NCCI)తో కలిసి పేమెంట్ సదుపాయాన్ని వాట్సాప్(whatsapp app) ఇటీవల తమ యూజర్స్ కోసం తీసుకొచ్చింది. దీని ద్వారా సుమారు 227 రకాల బ్యాంక్ అకౌంట్లకు డబ్బు పంపిచుకోవచ్చు.
ఇవీ చదవండి: