ETV Bharat / science-and-technology

వాట్సాప్​ మెసేజ్​లు ఇక 24 గంటల్లో మాయం! - వాట్సాప్ కొత్త ఆప్​డేట్స్

వాట్సాప్​.. రోజువారీ జీవితంలో ఇదో భాగమైపోయింది. అయితే ఇందులో అవసరమైన మెసేజ్​లతో పాటు.. మీరు కనీసం పట్టించుకోని సందేశాలు ఎన్నో వస్తుంటాయి. వాటన్నింటిని రోజూ డిలీట్ చేయడం కుదరకపోవచ్చ. ఈ ఇబ్బంది లేకుండా 24 గంటల్లో మొత్తం అన్ని రకాల పోస్టులు డిలీట్‌ చేసే ఆప్షన్ తెేనుందట వాట్సాప్​. ఆ ఫీచర్​ వివరాలేమిటో మీరూ చూసేయండి.

WhatsApp new feature to Delete daily massages
వాట్సాప్​లో రోజువారి మెసేజ్​ల డిలీట్​ ఆప్షన్​
author img

By

Published : Apr 27, 2021, 2:19 PM IST

మీ వాట్సాప్‌లోని గ్రూపులు, వ్యక్తిగత ఖాతాల్లో మెసేజ్‌లు వారం రోజులకు ఒకసారి మాయం అయిపోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసుగా.. సింపుల్‌ ఆ ఖాతా ఇన్ఫో పేజీలో డిస్‌అపియరింగ్ మెసేజెస్‌ ఫీచర్‌ను యాక్టివ్‌ చేసుకోవడమే. అయితే ఈ ఫీచర్‌లో వారం రోజులు కాకుండా ఒక్క రోజే ఉంటే బాగుండు అని అనుకున్నారా..? అయితే మీ ఆలోచన నిజం కాబోతోంది.. అవును 24 గంటల్లో మొత్తం అన్ని రకాల పోస్టులు డిలీట్‌ అయ్యే ఆప్షన్‌ త్వరలో రాబోతోందట.

కొత్త ఆప్షన్‌ను ఇలా తీసుకొస్తూనే, బ్యాగ్రౌండ్‌లో దానికి అదనపు మెరుగులు దిద్దడం వాట్సాప్‌కు అలవాటు. అలా డిస్‌అపియరింగ్‌ మెసేజెస్‌కు ఇప్పుడు టైమ్‌ సెలక్షన్‌ ఆప్షన్‌ను తీసుకొస్తున్నారట. అంటే డిస్‌అపియరింగ్‌ ఆప్షన్‌ను ఆన్‌ చేసిన వెంటనే ఎన్ని రోజులకు డిలీట్‌ అవ్వాలి అని అడుగుతుందట. అందులో 24 గంటలు, ఏడు రోజులు అని రెండు ఆప్షన్లు ఉంటాయి. వాటిలో మీకు కావాల్సింది ఎంచుకుంటే సరి. అక్కడ 24 గంటలు ఎంచుకుంటే, ఒక రోజులో మెసేజ్‌లు మాయమవుతాయి. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ప్రయోగ దశలో ఉంది. కొంతమందికి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో అందరికీ యాక్సెస్‌లోకి వస్తుంది.

డిస్‌అపియరింగ్‌ ఆన్‌ చేయడం ఇలా..

New Option to disappearing messages
డిస్‌అపియరింగ్‌ కొత్త ఆప్షన్‌

డిస్‌అపియరింగ్‌ ఆప్షన్‌ను ఆన్‌ చేయడానికి.. ఏదైనా గ్రూపు, పర్సనల్‌ ఛాట్‌లోకి వెళ్లండి. పైన గ్రూపు/వ్యక్తి పేరు మీద క్లిక్‌ చేస్తే ప్రొఫైల్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో డిస్‌అపియరింగ్‌ మెసేజెస్‌ అని కనిపిస్తుంది. పక్కన చిన్న టైమర్‌ ఐకాన్‌ కూడా ఉంటుంది. దానిని క్లిక్‌ చేస్తే ఆన్‌/ఆఫ్‌ అని ఆప్షన్స్‌ కనిపిస్తాయి. ఫీచర్‌ ఆన్‌ చేయాలంటే అక్కడ ఆన్‌ క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఆ గ్రూప్‌/ వ్యక్తి ఖాతాలో మెసేజ్‌ వచ్చిన ఏడు రోజులకు డిలీట్‌ అయిపోతుంది. త్వరలో ఇదే పేజీలో 24 గంటలు, ఏడు రోజులు అని ఆప్షన్‌ రాబోతోంది.

ఇదీ చదవండి:కూల్ ఆఫర్లతో ఫ్లిప్​కార్ట్ సమ్మర్​ స్పెషల్ సేల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.