ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో కొత్త ఫీచర్స్​.. రిపోర్ట్ స్టేటస్.. అన్​డూ​ డిలీట్ మెసేజ్​ - వాట్సాప్ స్టేటస్ రిపోర్ట్

వాట్సాప్​లో అదిరిపోయే కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. డిలీట్ చేసిన మెసేజ్​లను తిరిగి పొందేందుకు 'అన్​డూ' ఆప్షన్ సహా.. స్టేటస్ రిపోర్ట్, వైట్​లిస్ట్ వంటి మరికొన్ని అప్డేట్లపై కసరత్తు చేస్తోంది. అవేంటి? వాటి ఉపయోగాలు ఏంటని పరిశీలిస్తే...

whatsapp-new-features
whatsapp-new-features
author img

By

Published : Dec 26, 2022, 4:27 PM IST

పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్​లో త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లతో పాటు డెస్క్​టాప్ వెర్షన్​కూ కొత్త అప్డేట్లు రాబోతున్నాయి. డిలీట్ చేసిన మెసేజ్​లను 'అన్​డూ' చేయడం సహా నచ్చని స్టేటస్​లపై ఫిర్యాదు చేసేలా ఆప్షన్లను వాట్సాప్ తీసుకురానున్నట్లు సమాచారం.

వాట్సాప్ స్టేటస్ రిపోర్ట్
వాట్సాప్​లో మన కాంటాక్టుల్లో అనేక మంది రోజుకు ఎన్నో స్టేటస్​లు పెడుతుంటారు. ఫన్నీ వీడియోలు, సినిమా పాటలు, కొటేషన్ల సంగతి ఎలా ఉన్నా.. కొన్ని స్టేటస్​లు మనకు నచ్చకపోవచ్చు. అనుచితంగా అనిపించే స్టేటస్​లపై మనం ఏం చేయలేము. కానీ, ఇకపై అలా కాదు. ఇందుకోసం వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకురాబోతోంది. ఈ ఆప్షన్ ద్వారా అనుచిత స్టేటస్​ గురించి వాట్సాప్ మోడరేషన్ టీమ్​కు రిపోర్ట్ చేయవచ్చు. అయితే, ఇది తొలుత వాట్సాప్ డెస్క్​టాప్ బీటా వెర్షన్​కే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్​మెంట్ దశలో ఉంది.

కొత్త వెరిఫికేషన్..
ఆండ్రాయిడ్​ వాట్సాప్ యూజర్లకు మరో సెక్యూరిటీ ఫీచర్​ పరిచయం కాబోతోంది. ఆండ్రాయిడ్ యూజర్లు.. మరో డివైజ్​లో తమ వాట్సాప్ లాగిన్ అవ్వాలంటే ఆరు డిజిట్​ల కోడ్ ఎంటర్ చేయడం తప్పనిసరి కానుంది. మరో డివైజ్​లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించిన సమయంలో వాట్సాప్.. ఆరు డిజిట్​ల కోడ్​ను మొబైల్ నెంబర్​కు పంపిస్తుంది. ఈ వెరిఫికేషన్ కోడ్​ను ఎంటర్ చేస్తేనే లాగిన్ అయ్యేలా ఫీచర్ డెవలప్ చేస్తోంది. అయితే, ఇది వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్​ వాడేవారికే ముందుగా అందుబాటులోకి రానుంది.

అందరూ మెచ్చే ఫీచర్ ఇదే..
వాట్సాప్​లో మెసేజ్ డిలీట్ ఫీచర్ చాలా మందికి ఇష్టమైన ఫీచర్. మెసేజ్​లో ఏదైనా తప్పులు దొర్లితే వెంటనే సందేశాన్ని డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, డిలీట్ ఫీచర్​లో 'డిలీట్ ఫర్ ఎవ్రివన్', 'డిలీట్ ఫర్ మీ' రెండు ఆప్షన్స్ ఉంటాయి. డిలీట్ ఫర్ ఎవ్రివన్ అంటే.. అందరికీ మెసేజ్ డిలీట్ అయిపోతుంది. అదే డిలీట్ ఫర్ మీ అంటే.. సందేశం పంపినవారికి మాత్రమే అది కనిపించకుండా పోతుంది. అయితే, కొన్నిసార్లు పొరపాటున డిలీట్ ఫర్ మీ కొట్టేస్తాం. ఆ తర్వాత 'డిలీట్ ఫర్ ఎవ్రివన్' ఆప్షన్ ఉపయోగించే అవకాశం పోయినట్టే! ఈ సమస్యను పరిష్కరించేలా వాట్సాప్.. నూతన ఆప్షన్ తీసుకొస్తోంది. 'డిలీట్ ఫర్ మీ'కి అనుబంధంగా 'అన్​డూ' ఫీచర్ ప్రవేశపెట్టనుంది. దీని వల్ల.. పొరపాటున డిలీట్ ఫర్ మీ ద్వారా తొలగించిన సందేశాలను మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. ఇది చాలా మంది యూజర్లకు ఉపయోగపడుతుందని డెవలపర్లు భావిస్తున్నారు.

స్టేటస్ లిస్ట్​లు
వాట్సాప్ స్టేటస్​లకు సంబంధించే మరో ఫీచర్​పై సంస్థ కసరత్తు చేస్తోంది. వాట్సాప్​లో మనం ఎన్నో స్టేటస్​లు పెడుతూ ఉంటాం. కొన్ని స్టేటస్​లను కొందరికి కనిపించకుండా పెడుతుంటాం. ఉదాహరణకు, కాలేజీకి బంక్ కొట్టి సినిమాకు వెళ్లిన విషయం ఇంట్లో తెలియకుండా.. ఫ్రెండ్స్​కు మాత్రమే తెలియాలని అనుకుంటాం. కానీ, ప్రతిసారి స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్స్​ను మార్చుకోవడం కష్టమే. ఇలాంటి వారికోసమే కొత్త ఫీచర్​ను వాట్సాప్ తీసుకురాబోతోంది. దీన్నిబట్టి.. వాట్సాప్​లో ముందుగానే జాబితాలను తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆఫీస్ అంటూ రకరకాల లిస్ట్​లు ముందుగా సిద్ధం చేసుకోవచ్చు. స్టేటస్ పెట్టే సమయంలో ఏ లిస్ట్​ను ఎంపిక చేసుకుంటే.. వారికే ఆ స్టోరీ వెళ్లిపోతుంది. మిగిలినవారు చూడలేరు.

ప్రైవసీని పెంచే వైట్​లిస్ట్!
ప్రస్తుతం వాట్సాప్​లో బ్లాక్ లిస్ట్ ఆప్షన్ ఉంది. బ్లాక్​లిస్ట్​లో ఉన్న కాంటాక్టులు మన ప్రొఫైల్ ఫొటోలు, స్టేటస్ అప్డేట్లను చూడలేరు. అయితే, దీనికి భిన్నంగా వాట్సాప్ ఇప్పుడు.. వైట్​లిస్ట్ ఆప్షన్ తీసుకురాబోతోంది. వైట్​లిస్ట్ జాబితాలో ఉన్న కాంటాక్టులు మాత్రమే స్టేటస్ అప్డేట్లు, డీపీలు చూడగలిగేలా ఈ ఆప్షన్​ను రూపొందిస్తోంది. ఇది యూజర్ల ప్రైవసీని మరింత పెంచుతుందని వాట్సాప్ భావిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.