ETV Bharat / science-and-technology

వాట్సాప్​ పర్సనల్​ చాట్​కు 'లాక్​'.. కొత్త ఫీచర్​ వాడడం ఇలా...

సాధారణంగా చాలా మంది వాట్సాప్​లో కొన్ని పర్సనల్ చాట్స్​ను హైడ్ చెయ్యడానికి మొత్తం యాప్​కే లాక్ వేస్తారు. అయితే ఇక నుంచి ఆ అవసరం లేదు. ఎందుకంటే సెలెక్టెడ్ చాట్స్​కు మాత్రమే లాక్ వేసుకునే ఫీచర్​ త్వరలోనే అందుబాటులోకి రానుంది!

whatsapp new feature
whatsapp new feature
author img

By

Published : Apr 27, 2023, 4:03 PM IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వాడే సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​లలో వాట్సాప్ ఒకటి. దాదాపు ప్రతి ఒక్కరి స్మార్ట్​ఫోన్​లో ఈ యాప్​ కచ్చితంగా ఉంటుంది! 2009లో ప్రారంభమైన ఈ ఆన్​లైన్​ ఇన్​స్టంట్ మెసేజింగ్ యాప్.. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొందింది. తర్వాత ఈ యాప్​ను ఫేస్​బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్​బర్గ్​ కొనుగోలు చేశారు.

అయితే వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంటుంది. మొదటగా వాట్సాప్​ ప్రవేశపెట్టిన స్టేటస్ అనే ఫీచర్ బాగా ప్రాచుర్యం పొందింది. తర్వాత వివిధ సంస్థలు సైతం ఆ దిశగా అడుగులు వేశాయి. ఇన్​స్టాగ్రామ్​.. స్టేటస్​ ఫీచర్​ను స్టోరీ రూపంలో వాడుతోంది. ఆయా న్యూస్ వెబ్సైట్లు వెబ్ స్టోరీస్​గా ఉపయోగించుకుంటున్నాయి.

ఇటీవలే వాట్సాప్​.. డిలీట్, అండూ, బహుళ ఫోన్లలో ఒకే అకౌంట్​ వినియోగం వంటి ఫీచర్లను తీసుకువచ్చింది​. తాజాగా మరో కొత్త ఫీచర్​ను ప్రవేశపెట్టింది. వినియోగదారులు తమ చాట్స్ విషయాల్లో భద్రత కల్పించడానికి, కొన్ని పర్సనల్ చాట్స్​ను దాచి పెట్టుకునేందుకు లాక్ సిస్టమ్​ను తెచ్చింది. ఇప్పటి దాకా వాట్సాప్ మొత్తానికి కలిపి లాక్ సిస్టమ్​ ఉండేది. అయితే కొత్తగా తీసుకువచ్చిన ఫీచర్​ వల్ల.. మనకు కావాల్సిన చాట్​కు మాత్రమే లాక్ వేసుకునే సౌకర్యం తెచ్చింది.
అయితే WaBeta ఇన్ఫో ప్రకారం.. బీటా యూజర్లకు మాత్రమే ప్రస్తుతం ఈ ఫీచర్​ అందుబాటులో ఉంది. వారు ఈ కొత్త ఫీచర్​ను చక్కగా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్​ విజయవంతమైతే.. అందరికీ అందుబాటులోకి రానుంది.

చాట్ లాక్​ను ఎలా ఎనేబుల్ చెయ్యాలి?
ముందుగా బీటా యూజర్లు వాట్సాప్​ను అప్డేట్ చేసుకోవాలి. లాక్ చేయాలనుకున్న వారి అకౌంట్ ఓపెన్ చేసి ప్రొఫైల్ సెక్షన్​లోకి వెళ్లాలి. స్క్రోల్ చేస్తే అక్కడ 'చాట్ లాక్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్​ చేస్తే 'లాక్ దిస్ చాట్ విత్ ఫింగర్ ప్రింట్' అని వస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి.

బీటా వెర్షన్​ను ఎలా పొందాలి?
బీటా వెర్షన్ కావాలనుకునే వినియోగదారులు.. ముందుగా వారి ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్​ను ఓపెన్ చెయ్యాలి. తర్వాత వాట్సాప్ అని టైప్ చేయాలి. అనంతరం దానిపై క్లిక్​ చేసి కిందకు స్క్రోల్ చేస్తే డెవలపర్ సమాచారం వస్తుంది. అక్కడ బీటా ప్రోగ్రాం అనే ఆప్షన్ ఉంటుంది. అది ఫుల్ అని చూపిస్తే మీరు బీటా వెర్షన్​ను ఉపయోగించలేరు. సాధారణంగా ఇది ఎప్పటికీ ఫుల్ గానే ఉంటుంది. అందువల్ల కొత్త వాళ్లు ఆ సౌకర్యాన్ని సులువుగా పొందలేరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.