ETV Bharat / science-and-technology

WhatsApp New Feature : వాట్సాప్​ యూజర్లకు గుడ్​​ న్యూస్​.. ఇకపై నేరుగా​ వీడియో మెసేజ్​లు పంపొచ్చు! - వాట్సాప్​ న్యూ ఫీచర్​

WhatsApp short video message : ప్రముఖ మెసేజింగ్​ యాప్​​ వాట్సాప్​ మరో సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దీనితో యూజర్లు ఇకపై తమ సందేశాలను టెక్ట్స్​ రూపంలో మాత్రమే కాకుండా షార్ట్ వీడియో రూపంలో కూడా పంపించవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..

Latest WhatsApp Feature
WhatsApp short video messages feature
author img

By

Published : Jul 28, 2023, 12:40 PM IST

Latest WhatsApp Feature : మెటా నేతృత్వంలోని వాట్సాప్​ మరో నయా ఫీచర్​ను తీసుకొచ్చింది. దీనితో వాట్సాప్​ వినియోగదారులు ఇకపై తమ మెసేజ్​లను షార్ట్ వీడియో రూపంలో కూడా పంపించడానికి వీలవుతుంది. ఇప్పటి వరకు కేవలం టెక్ట్స్​ రూపంలో మాత్రమే సందేశాలు పంపించే వీలు ఉండగా.. ఇకపై 60 సెకెన్ల నిడివితో షార్ట్ వీడియో రూపంలోనూ మెసేజ్​లు పంపించేందుకు అవకాశం ఉంటుంది.

ఈ షార్ట్ వీడియో మెసేజ్​ ఫెసిలిటీ ఇప్పటికే ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. మెటా సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్​ తన ఫేస్​బుక్​ పోస్టులో ఈ వాట్సాప్​ అప్​డేట్ గురించి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్​ యూజర్లు అందరికీ దీనిని క్రమంగా అందుబాటులోకి తేనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

60 సెకెన్ల నిడివితో వీడియో మెసేజ్​
WhatsApp video message feature : తాజాగా తీసుకొచ్చిన ఈ షార్ట్ వీడియో ఫీచర్​.. రియల్​టైమ్​ వాయిస్​ మెసేజ్ ఫీచర్​లానే పనిచేస్తుంది. టెక్ట్స్​ బాక్స్​ పక్కనే వీడియో రికార్డింగ్ ఐకాన్ ఉంటుంది. దీనిని ఉపయోగించి 60 సెకెన్ల నిడివితో వీడియో మెసేజ్​ను రికార్డ్​ చేసి, తరువాత వాటిని మెసేజ్ రూపంలో ఇతరులకు పంపించవచ్చు.

వాట్సాప్​ ఈ లేటెస్ట్ అప్​డేట్ గురించి తన అధికారిక బ్లాగ్​ పోస్ట్​లోనూ వివరించింది. ఈ నయా ఫీచర్​ సాయంతో యూజర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పవచ్చు. మంచి న్యూస్​ను షేర్​ చేయవచ్చు. అలాగే అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని తమ బంధువులు, స్నేహితులకు చేరవేయవచ్చు అని పేర్కొంది. ​మరీ ముఖ్యంగా ఈ మెసేజ్​లు ఎండ్​-టు-ఎండ్​ ఎన్​క్రిప్షన్​తో ఉంటాయి కనుక భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు అని వాట్సాప్​ చెబుతోంది. వాట్సాప్​ యూజర్లు ఈ షార్ట్ వీడియో మెసేజ్ ఫీచర్​ను ఉపయోగించుకోవాలంటే.. వెంటనే యాప్​ను అప్​డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం గూగుల్ ప్లేస్టోర్​ లేదా యాపిల్​ స్టోర్​లోకి వెళ్లి వాట్సాప్​ను అప్​డేట్ చేసుకోవాలి.

ఆకర్షణీయమైన సెర్చ్​ బార్​
WhatsApp new search bar feature : వాట్సాప్​ తన వినియోగదారుల కోసం లేటెస్ట్​గా ఆకర్షణీయమైన సెర్చ్​ బార్​ ఫీచర్​ను తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఇది కేవలం ఆండ్రాయిడ్​ బీటా వెర్షన్​ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ అప్​డేట్​లో ఉన్న మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. యాప్​ తెరవగానే అన్​రెడ్ మెసేజ్​లు​, ఫొటోలు, వీడియోలు, లింక్​ ఆప్షన్​లు కొత్తగా తెలుపు రంగులో కనిపిస్తున్నాయి. ఇది యాప్​ విజువలైజేషన్​ను మరింతగా మెరుగుపరుస్తుందని బీటా టెస్టర్లు చెబుతున్నారు.

గ్రూప్​ క్రియేషన్ ఈజీ
WhatsApp group create : వాట్సాప్​ వినియోగదారులు మరింత సులువుగా గ్రూప్​లను క్రియేట్​ చేసుకునే విధంగా సరికొత్త అప్​డేట్ వచ్చింది. మెసేజ్ ఫార్వార్డ్​ చేసే సమయంలో క్రియేట్ గ్రూప్​ అనే గుర్తును యూజర్లకు చూపిస్తుంది. దీని ద్వారా చాలా సులువుగా యూజర్లు కొత్త గ్రూప్​ను ​క్రియేట్ చేసుకోవడానికి వీలవుతుంది. దీనిలోకి మీ స్నేహితులను కూడా చాలా సులువుగా యాడ్​ చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.