ETV Bharat / science-and-technology

ఫొటో ఫిల్టర్స్‌లో సమస్య... వాట్సాప్​ ఏం చెబుతోందంటే? - malware in whatsapp in iphone

మెసేజింగ్ యాప్‌ వాట్సాసప్‌లోని ఇమేజ్‌ ఫిల్టర్‌ (WhatsApp image filter) ఫీచర్‌లోని లోపాలపై సైబర్​ సంస్థలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఈ సమస్యను పరిష్కరించడంపై వాట్సాప్ దృష్టి సారించింది. వాట్సాప్ ఇమేజ్‌ ఫిల్టర్‌లో ఆర్‌జీబీఏ పిక్సెల్ కలర్ ఫార్మాట్‌లో ఈ సమస్య ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. యూజర్స్ దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది.

WhatsApp image filter
వాట్సాప్​ ఫొటో ఫిల్టర్స్‌
author img

By

Published : Sep 6, 2021, 10:24 AM IST

Updated : Sep 6, 2021, 11:50 AM IST

సాంకేతికత సహకారంతో రోజువారీ పనులు ఎంతో సులువుగా చేస్తున్నాం. అయితే టెక్నాలజీతో ఎన్ని లాభాలున్నాయో.. అదే స్థాయిలో లోపాలున్నాయి. అందుకే టెక్ సంస్థలు ఎప్పటికప్పుడు లోపాలను సరిచేస్తూ యూజర్స్‌కు (WhatsApp users) మెరుగైన సేవలందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌లోని ఇమేజ్‌ ఫిల్టర్‌ (WhatsApp image filter) ఫీచర్‌లో లోపాలున్నాయని, దాని కారణంగా ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్స్‌ డేటాకు ప్రమాదమని సైబర్‌ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇమేజ్‌ ఫిల్టర్‌లోని బగ్ ద్వారా సైబర్ నేరగాళ్లు మాల్‌వేర్‌ను(malware in whatsapp) యూజర్‌ డివైజ్‌లలోకి పంపి అందులోని సమాచారాన్ని (whatsapp user data) సులువుగా యాక్సెస్ చేయగలరని వెల్లడించాయి. దీంతో ఈ సమస్యను పరిష్కరించడంపై వాట్సాప్ దృష్టి సారించింది.

ఇప్పటి వరకు ఈ బగ్‌ ద్వారా ఎలాంటి సమాచారం యాక్సెస్ చేయలేదని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. అలానే వాట్సాప్ ఇమేజ్‌ ఫిల్టర్‌లో ఆర్‌జీబీఏ పిక్సెల్ కలర్ ఫార్మాట్‌లో ఈ సమస్య ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. దీన్ని సరిచేసేందుకు వాట్సాప్ ఇమేజ్‌ ఫిల్టర్స్‌లో (WhatsApp image filter problems) రెండు చెక్‌ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇది యూజర్‌ ఇమేజ్‌ ఫిల్టర్ ఉపయోగించినప్పుడు 4 బైట్స్‌ ఫర్‌ పిక్సెల్ సామర్థ్యంతో చెక్ చేస్తుందని తెలిపింది. దీనివల్ల అనధికారిక యాక్సెస్‌లను నిరోధించగలమని పేర్కొంది. గతంలో ఈ పరిమితి కేవలం ఒక బైట్ ఫర్ పిక్సెల్‌గా ఉండేదని తెలిపింది. యూజర్స్ ఎవరు ఈ బగ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, సమస్యను పరిష్కరించినట్లు వాట్సాప్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చూడండి: Amazon Alexa: ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ అలెక్సా

Last Updated : Sep 6, 2021, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.