Whatsapp File Sharing: వాట్సాప్‌లో టెక్ట్స్ మెసేజ్‌లు, డాక్యుమెంట్స్‌తోపాటు మీడియా ఫైల్స్‌నూ షేర్ చేసుకోవచ్చు. అయితే మీడియా ఫైల్స్ షేరింగ్‌పై వాట్సాప్ పరిమితులు విధించింది. 100 ఎంబీ కన్నా ఎక్కువ సైజు ఉన్న ఫైల్స్‌ను వాట్సాప్ ద్వారా షేర్ చేయలేం. దీంతో పెద్ద సైజు ఉన్న ఫైల్స్‌ను షేర్ చేయలేకపోతున్నామంటూ చాలా రోజులుగా యూజర్లు వాట్సాప్ దృష్టికి తీసుకొస్తున్నారు. దీంతో ఈ ఇబ్బందిని తొలగించడానికి వాట్సాప్ సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో దీని కోసం కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుందని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) వెల్లడించింది.
వాట్సాప్ కొత్తగా పరిచయం చేయనున్న ఈ ఫీచర్‌తో 2 జీబీ సైజు ఉన్న మీడియా ఫైల్స్‌ను సైతం షేర్ చేయొచ్చని సమాచారం. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. గతంలో వాట్సాప్‌లో కేవలం 16 ఎంబీ సైజు ఉన్న ఫైల్స్‌ను మాత్రమే షేర్ చేసేందుకు సాధ్యమయ్యేది. తర్వాత ఆ సైజును 100 ఎంబీకి పెంచారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మొబైల్ కెమెరాలు అధిక సామర్థ్యం కలిగి ఉంటున్నాయి. దీంతో వాటితో చిత్రీకరించే ఫొటో/వీడియో ఉత్తమమైన క్వాలిటీతో స్టోర్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆ ఫైల్ సైజు ఎక్కువగా ఉంటోంది. కొన్ని ఫోన్లలో ఈ ఫైల్ 100 ఎంబీకి మించి ఉంటోందట. దీంతో యూజర్లు వాట్సాప్‌లో షేర్ చేయలేకపోతున్నారు. అందుకే ఫైల్ షేరింగ్ సైజును పెంచాలని కోరుతున్నారు. వాట్సాప్ కొత్త ఫీచర్‌తో షేరింగ్ ఫైల్ సైజు లిమిట్ పెరగనుంది.
ఇదీ చదవండి: ఐదు డివైజ్‌లలో వాట్సాప్.. ఫోన్లో నెట్ లేకపోయినా డెస్క్‌టాప్‌లో...