ETV Bharat / science-and-technology

వాట్సాప్​ యూజర్లకు గుడ్​న్యూస్.. త్వరలోనే మెసేజ్​ ఎడిట్​ ఫీచర్​! - వాట్సాప్​ కొత్త ఫీచర్​ న్యూస్​

అప్పుడప్పుడు వాట్సాప్‌లో మెసేజ్‌ పంపేటప్పుడు అక్షర దోషాలు, టైపోలు జరుగుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఎడిట్ మెసేజ్‌ ఫీచర్‌ కావాలంటూ చాలా కాలంగా యూజర్లు వాట్సాప్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ తమ బీటా యూజర్లకు ఎడిట్​ ఫీచర్​ను అందుబాటులో ఉంచింది. తాజాగా ఈ ఫీచర్‌లో మరో కీలక అప్‌డేట్‌ చేయనుంది. అదేంటంటే?

whatsapp edit message feature
వాట్సాప్​లో మెసేజ్​ ఎడిట్​ ఫీచర్
author img

By

Published : Oct 15, 2022, 9:52 AM IST

Whatsapp Message Edit: వాట్సాప్‌లో మెసేజ్‌ పంపేటప్పుడు అక్షర దోషాలు, టైపోలు జరుగుతుంటాయి. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో మందికి ఇలాంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఎడిట్ మెసేజ్‌ ఫీచర్‌ కావాలంటూ చాలా కాలంగా యూజర్లు వాట్సాప్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ కూడా మెసేజ్‌ ఎడిట్‌ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా యూజర్లకు అందుబాటులో ఉంది.

తాజాగా ఈ ఫీచర్‌లో మరో కీలక అప్‌డేట్‌ చేయనుంది. గతంలో ప్రకటించిన విధంగా మెసేజ్‌ను ఎడిట్‌ చేస్తే అవతలి వారికి తెలియదు. కొత్త అప్‌డేట్‌ ప్రకారం మెసేజ్‌ను ఎడిట్ చేస్తే ఎడిటెడ్‌ అనే లేబుల్‌ మెసేజ్‌ పక్కనే కనిపిస్తుంది. దానితోపాటు మెసేజ్‌ ఎడిటింగ్‌ టైమ్‌ లిమిట్‌ ఉంటుందని సమాచారం. ఎంత టైమ్‌లోపు ఎడిట్ చేయొచ్చు అనే దానిపై స్పష్టతలేదు.

whatsapp edit message feature
వాట్సాప్​లో మెసేజ్​ ఎడిట్​ ఫీచర్

ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే సాధారణ యూజర్లకు పరిచయం చేయనున్నారు. వాట్సప్‌లో ఏదైనా మెసేజ్‌ పంపిన తర్వాత దాన్ని సెలక్ట్‌ చేస్తే కాపీ, ఫార్వార్డ్‌ వంటి ఆప్షన్లు కన్పిస్తాయి. ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత కాపీ, ఫార్వర్డ్‌తో పాటు ఎడిట్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేసి పంపిన మెసేజ్‌లో తప్పులు, స్పెల్లింగ్‌లు వంటివి సరిచేసుకోవచ్చు.

తాజాగా వాట్సాప్‌ మెసేజ్‌ రియాక్షన్స్‌లో మరో అప్‌డేట్‌ను యూజర్లకు పరిచయం చేసింది. గ్రూపులో ఏదైనా మెసేజ్‌కు ఎమోజీతో రియాక్షన్‌ తెలియజేశాం. అదే మెసేజ్‌కు గ్రూపులోని మిగిలిన సభ్యులు కూడా ఎమోజీతో రియాక్ట్‌ అయితే, మొత్తంగా ఎంతమంది స్పందించారనేది ఎమోజీలతోపాటు పక్కనే వాటి సంఖ్యను చూపిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.