మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఇట్టే చెప్పేస్తాయి ఎమోజీలు. పది పదాలు అవసరమైన చోట ఒక్క ఎమోజీతో(Emoji Images) మన మూడ్‌ని చెప్పేయొచ్చు. నిత్యం మనం ఉపయోగిస్తున్న వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్.. ఇలా ప్రతి సోషల్ మీడియా యాప్‌లోనూ(Emojis In Symbols) వీటిది ప్రత్యేక స్థానం. అందుకే సోషల్ మీడియా యాప్‌లు కొత్త కొత్త ఎమోజీలను తీసుకొస్తూ యూజర్స్‌ను అలరిస్తున్నాయి. తాజాగా యూనికోడ్(Emoji Unicode Table) కన్సార్టియమ్ అనే సంస్థ 37 కొత్త ఎమోజీలను విడుదల చేసింది.
యూనికోడ్ కన్సార్టియమ్(Unicode Consortium) నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ కొత్త ఎమోజీ జాబితాను రూపొందించినట్లు యూనికోడ్(Unicode) తెలిపింది. వీటిని ఎమోజీ సబ్‌కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కు అందుబాటులోకి వస్తాయని యూనికోడ్ వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలోనే యూనికోడ్ 14.0 విడుదల చేయాలనుకున్నప్పటికీ కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడినట్లు తెలిపింది.
ఏమున్నాయంటే?
యూనికోడ్ 14.0(Unicode 14.0 Emoji) పేరుతో తీసుకొచ్చిన ఈ ఎమోజీల జాబితాలో సెల్యూట్ చేస్తున్నట్లు ఉండే ఫేస్, ట్రోల్, హార్ట్ హ్యాండ్స్, లోబ్యాటరీ ఇండికేటర్, వికలాంగులు ఉపయోగించే చేతికర్ర, ఎక్స్‌రే, నట్స్, బైటింగ్ లిప్స్, కళ్లు తెరిచినట్లుగా ఉండే ముఖం, చేత్తో నోరు మూసుకోవడం, చేతి వేళ్ల మధ్య నుంచి చూస్తున్నట్లు ఉండే ముఖం, పిల్లలు ఆడుకునే జారుడు బండ, జాడీ, తామర పువ్వు, ఖాళీగా ఉన్న పక్షి గూడు, గుడ్లతో ఉన్న పక్షి గూడు, బీన్స్ గింజలు, సముద్రంలో పెరిగే కోరల్స్, మిర్రర్ బాల్, వీల్, నీటిలో పడిన వారిని రక్షించేందకు ఉపయోగించే లైఫ్‌బాయ్ రింగ్, గ్లాస్ లోంచి నీరు కిందకు పోవడం, గర్భిణితో ఉన్నవారు, కిరీటం ధరించిన వారు, గణితంలో ఉపయోగించే ఈక్వెల్‌టు సింబల్ వంటివి ఉన్నాయి.
ఇదీ చూడండి.. iPhone 13 Series: ఐఫోన్ 13 సిరీస్ టాప్ 10 హైలైట్స్ ఇవే..