పాస్‌వర్డ్‌లను తరుచూ మర్చిపోయే వారికి ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఓ శుభవార్త చెప్పింది. ఇప్పటికివరకూ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీలతో ట్విట్టర్లోకి లాగిన్ అవుతుండగా.. ఇకపై గూగుల్ అకౌంట్‌తో కూడా లాగిన్ అయ్యే అవకాశాన్ని కల్పించనున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. యూజర్లు చాలా మంది ముందుగానే గూగుల్ అకౌంట్‌తో సైన్ఇన్ అయ్యి ఉంటారని.. దీంతో ట్విట్టర్ లాగిన్‌కు చాలా తక్కువ సమయం పడుతుందని పేర్కొంది.
అయితే ఇప్పటికే ట్విట్టర్‌కు సంబంధించిన ఆండ్రాయిడ్ బీటా వర్షెన్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉందని తెలుస్తోంది. దీనిలో గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యేందుకు ఆప్షన్స్ చూపిస్తోందని సమాచారం. కానీ ఐఓఎస్‌కు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. వీటిపై దీనిపై ట్విట్టర్ ఇంకా స్పందించలేదు. కొత్తలాగిన్ ఆప్షన్ ఎప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది అనే దానిపై స్పష్టతలేదు.
సరికొత్త హంగులతో...
మారుతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకుని ట్విట్టర్ మరిన్ని హంగులను యాప్‌కు జోడించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలో రానున్న అప్డేట్స్లో కీలకమైన అప్‌ఓట్, డౌన్ఓట్ బటన్లతో పాటు వాయిస్ ట్రాన్స్ఫార్మర్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఇప్పటికే ధ్రువీకరించింది. ఈ వాయిస్ ట్రాస్స్ ఫార్మర్ ద్వారా లైవ్‌లో పాల్గొనేటప్పుడు వివిధ వాయిస్ ఎఫెక్ట్స్‌తో స్వరాన్ని మార్చుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని ట్విట్టర్ సపోర్ట్ ట్వీట్ చేసింది. అయితే ఈ సదుపాయం ఐఓఎస్ యూజర్లకు యాప్‌లో తొలుత అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు పేర్కొంది.
-
Some of you on iOS may see different options to up or down vote on replies. We're testing this to understand the types of replies you find relevant in a convo, so we can work on ways to show more of them.
— Twitter Support (@TwitterSupport) July 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Your downvotes aren’t public, while your upvotes will be shown as likes. pic.twitter.com/hrBfrKQdcY
">Some of you on iOS may see different options to up or down vote on replies. We're testing this to understand the types of replies you find relevant in a convo, so we can work on ways to show more of them.
— Twitter Support (@TwitterSupport) July 21, 2021
Your downvotes aren’t public, while your upvotes will be shown as likes. pic.twitter.com/hrBfrKQdcYSome of you on iOS may see different options to up or down vote on replies. We're testing this to understand the types of replies you find relevant in a convo, so we can work on ways to show more of them.
— Twitter Support (@TwitterSupport) July 21, 2021
Your downvotes aren’t public, while your upvotes will be shown as likes. pic.twitter.com/hrBfrKQdcY
వాయిస్ ట్రాస్స్ఫార్మర్ ఏంటి? ఎలా పని చేస్తుంది?
ట్విట్టర్ తీసుకువస్తున్న ఈ వాయిస్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనం యాప్‌లో లైవ్‌కు వెళ్లేముందు మన గొంతును సరి చేసుకోవచ్చు. మార్చుకోవచ్చు. అంతేగాకుండా మనం స్వరంలోని పిచ్‌ను, ఎకోను కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది.
అప్‌ఓట్, డౌన్ఓట్ ఉపయోగం..
అప్‌ఓట్, డౌన్ఓట్ అనేవి రియాక్షన్స్ లాంటివి. అప్‌ఓట్ అనేది అందరికీ పబ్లిక్‌గా కనిపిస్తుంది. డౌన్ఓట్ మాత్రం కనిపించదు. ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ను అయిష్టతను వ్యక్తం చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు. అందుకే దీనిని ట్విట్టర్ పబ్లిక్‌గా ఉంచేందుకు ఇష్టపడడం లేదు.
ఇదీ చూడండి: వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్.. కొత్త ఫీచర్లు ఇవే..