ETV Bharat / science-and-technology

ట్రూకాలర్​లో కొత్త ఫీచర్​.. ఆటోమెటిక్​ కాల్ ఆన్సర్​.. అవతలి వ్యక్తి మాటలు మీ స్క్రీన్​పై టెక్స్ట్ రూపంలో..

Truecaller Assistant India : కాలర్​ ఐడీ యాప్​ ట్రూ కాలర్​ సరికొత్త ఫీచర్​ను భారతీయ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ట్రూకాలర్ అసిస్టెంట్​ పేరుతో ఈ ఫీచర్​ను మార్కెట్లోకి దించింది. ఈ ఫీచర్ వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందామా మరి?

truecaller assistant india
truecaller assistant india
author img

By

Published : Jul 19, 2023, 5:45 PM IST

Truecaller Assistant India : ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కాలర్​ ఐడీ యాప్..​ ట్రూ కాలర్​. దీనిని చాలా మంది వాడుతుంటారు. మన కాంటాక్ట్​ లిస్ట్​లో పేరు లేని వ్యక్తులు కాల్ చేసినప్పుడు.. వారి వివరాలను తెలియజేస్తుంది ట్రూ కాలర్. ఫోన్​ రింగ్​ అవడానికి ముందే ఎవరు కాల్​ చేస్తున్నారో చెప్పేస్తుంది​. అయితే భారత్​లో.. ట్రూకాలర్ ​యాప్​లో ఫ్రాడ్​, స్పామ్ కాల్స్​ను నిలువరించేందుకు ట్రూకాలర్ అసిస్టెంట్​ అనే కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకీ ట్రూకాలర్ అసిస్టెంట్ ఫీచర్ ప్రత్యేకతేంటో? ఈ ఫీచర్ ఎవరికి అందుబాటులోకి వచ్చిందో? ఓ సారి తెలుసుకుందాం.

ట్రూకాలర్ అసిస్టెంట్ అంటే?​..
Truecaller New Features : ట్రూకాలర్ అసిస్టెంట్.. కస్టమర్లకు డిజిటల్ రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తుంది. అపరిచిత వ్యక్తులు నుంచి, స్పామ్​ కాల్స్ వచ్చినప్పుడు ట్రూకాలర్ అసిస్టెంట్ కాల్ ఆన్సర్​ చేస్తుంది. అవతలి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో లైవ్​లో మొబైల్​ స్క్రీన్​పై టెక్స్ట్​ రూపంలో చూపిస్తుంది. అప్పుడు ఆ సంభాషణకు చూసి కాల్​ను మాట్లాడాలా, వద్దా అనేది వినియోగదారులు నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ట్రూకాలర్ కొత్త ఫీచర్​ భారతీయ ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

'ఇప్పటివరకు ఎవరు కాల్ చేస్తున్నారో ట్రూకాలర్ మీకు చూపించింది. కానీ ఇప్పుడు మీరు మీ తరఫున కాల్ చేసిన వ్యక్తితో సంభాషిస్తుంది. స్పామ్, ఫ్రాడ్ కాల్స్​ను నిలువరించడంలో కస్టమర్లకు బాగా సాయం చేస్తుంది. భారత్​లోని ట్రూకాలర్ యాప్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.' అని ట్రూకాలర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రిషిత్ జున్‌జున్‌వాలా ఈ కొత్త ఫీచర్​ గురించి వివరించారు.

14 రోజుల ఉచిత ట్రయల్‌లో భాగంగా ట్రూకాలర్ అసిస్టెంట్​ను ఆ సంస్థ భారతీయ వినియోగదారులకు పరిచయం చేసింది. ఈ ప్రారంభ వ్యవధి తర్వాత.. చందాదారులు నెలకు రూ. 149 ప్రీమియం చెల్లించి ట్రూకాలర్ అసిస్టెంట్​ను వాడుకోవచ్చు. ట్రూకాలర్ అసిస్టెంట్ ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది. భారతీయ వినియోగదారుల కోసం ఇంగ్లీష్, హిందీ భాషల్లో గూగుల్ అసిస్టెంట్ పనిచేస్తుందని ట్రూకాలర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రిషిత్ జున్​జున్​వాలా తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.