ETV Bharat / science-and-technology

YouTube​ బోర్ కొట్టిందా?.. ఈ టాప్ వీడియో సైట్లను ట్రై చేయండి.. - వీమియో

యూట్యూబ్​ చాలా పాపులర్​ వీడియో షేరింగ్​ ప్లాట్​ఫామ్​. కానీ ఇదే కాకుండా ఇలాంటి సైట్లు చాలానే ఉన్నాయి. యూట్యూబ్​ కన్నా మెరుగైన వీడియో సైట్ల కోసం చూస్తున్న వారు వీటి గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

top youtube alternative video sharing platforms

author img

By

Published : Jan 23, 2023, 7:30 AM IST

ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా ఉత్తమమైన వీడియో వెబ్​సైట్లలో యూట్యూబ్​ ఒకటి. ఇప్పటివరకు చాలా పాపులర్​ అయిన సైట్​. మిలియన్ల సంఖ్యలో నెటిజన్లు యూట్యూబ్​ను వినియోగిస్తున్నారు. వీడియోలు క్రియేట్​ చేసుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా మందికి యూట్యూబ్​ ద్వారా ఉపాధి పొందుతున్నారు. మరి కొంత మందికి సెకండ్​ ఇన్​కమ్​ సోర్స్​గా కూడా యూట్యూబ్​ ఉపయోగపడుతుంది. ఇప్పుడు యూట్యూబ్​లో​ ఏ వీడియో కావలన్నా లభిస్తుంది. అయితే ఇలాంటి వీడియో షేరింగ్​ సైట్​ యూట్యూబ్​ ఒక్కటే లేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అందులో యూట్యూబ్​కి టాప్​ ప్రత్యమ్నాయాలు​ ఇవే..

1. వీమియో(Vimeo)
రెగ్యులర్​గా యూట్యూబ్​ వీడియోలు చూసే అలవాటు ఉంటే మీరు కచ్చితంగా దాని ప్రత్యామ్నాయం వీమియో వీడియో సైట్​ను చూడాల్సిందే. హై డెపినిషన్​ వీడియోలను సపోర్ట్ చేసిన మొట్టమొదటి వీడియో సైట్​ ఇదే. ఇందులో టీవీ సిరీస్​లు, 360 డిగ్రీ వీడియోలు కూడా చూడొచ్చు. సులభమైన యూజర్​ ఇంటర్​ఫేస్​తో ఉన్న ఈ సైట్​ను సులువుగా బ్రౌజ్​ చేయొచ్చు. వీమియో వీడియోలను కేటగిరీ, ఛానళ్లుగా విభజించింది. దీంతో మనకు కావాల్సిన వీడియోను వెతకడం కూడా తేలికే. మీకు ఏం చూడాల్సిన అత్యుత్తమ వీడియోలను వీమియో స్టాఫ్​ ఎప్పటికప్పుడు అప్​డేట్​ చేస్తారు. అది మీరు సరైన వీడియోను ఎంపిక చేసుకోవడంలో సహాయ పడుతుంది.

top youtube alternative video sharing platforms
వీమియో

2. వీడియోస్​హబ్​(VideosHub)
ఈ వీడియోస్​హబ్​ సైట్​లో వీడియోలు షార్ట్​ ఫామ్​లో ఉంటాయి. వివిధ వస్తుల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు వాటి గురించి క్విక్​ రివ్యూస్​ ఇ​చ్చే వీడియోల కోసం మనం వెతుకుతాం. అలాంటి వీడియోలే ఇందులో ఉంటాయి. సింపుల్​, యూజర్​ ఫ్రెండ్లీగా ఉండటమే ఈ సైట్​ ప్రత్యేకత. దీన్ని బ్రౌజ్​ చేయడం కూడా చాలా సులభం. ఎక్కువ మంది వీక్షించిన వీడియోలు హోమ్​ పెజీలో ఉంటాయి. ఇంకా లోతుగా వెతకాలంటే ఎడమ పక్కన ఉన్న ప్యానెల్​ వీడియో కేటగిరిలో లిస్టు ఉంటుంది. అందులో సెలెక్ట్​ చేసుకుని వీడియోలు చూడొచ్చు.

వీడియోస్​ హబ్​

3. డైలీ మోషన్(Dailymotion)
యూట్యూబ్​ లాంటి వీడియో వెబ్​సైట్లలో డైలీ మోషన్​ ఒకటి. ఈ సైట్​.. యూట్యూబ్​ ప్రారంభించిన నెల తర్వాత మార్చి 2005లో మొదలయ్యింది. యూట్యూబ్​కు ఈ కంపెనీ గట్టి పోటీ ఇస్తోంది. సీఎస్​ఐ మ్యాగజైన్​ లెక్కల ప్రకారం ఈ సైట్​ను నెలకు 300 మిలియన్ల యూజర్లు విజిట్​ చేస్తున్నారు. ఈ సైట్​లో ఇప్పటివరకు కొన్ని మిలియన్ల వీడియోలు అప్​లోడ్​ అయ్యాయి. ఈ ప్లాట్​ఫామ్​ హోమ్​ పేజీలో వీడియోస్​, న్యూస్​, స్పోర్ట్స్​, ఎంటర్​టైన్​మెంట్, మ్యూసిక్ లాంటి కేటగిరిలో ఉంటాయి. ఈ సైట్​లో అకౌంట్​ క్రియోట్​ చేసుకుంటే పర్సనలైజ్డ్​ వీడియోలు వస్తాయి.

డైలీ మోషన్

4. ఉట్రియాన్(Utreon)
ఉట్రియాన్​.. 2019లో వీడియో సైట్ల మార్కెట్​లోకి అడుగుపెట్టింది. ఇందులో యూట్యూబ్​లో ఉన్నంత నియమ నిబంధనలు ఉండవు. ఇది అందరికీ ఉచితం కాదు. మీరు వీడియో ప్రొడ్యూసర్​ అయితే మళ్లీ మీ ట్యూబ్​ వీడియోలను ఉట్రియాన్​లో అప్​లోడ్​ చేయాల్సిన అవసరం లేదు. మీరు కాలవాలనుకుంటే.. యూట్యూబ్​ వీడియోలు అన్నీ ఉట్రియాన్​ ప్రొఫైల్​లోకి వచ్చేస్తాయి.

ఉట్రియాన్​

5. ది ఇంటర్నెంట్​ అర్కైవ్స్​(The Internet Archive)
ది ఇంటర్నెంట్​ అర్కైవ్స్​ అనేది వెబ్​ ఆధారితి ఉచిత లైబ్రరీ. ఇందులో పుస్తకాలు, సంగీతం, సాఫ్ట్​వేర్​, సినిమా లాంటివన్నిటినీ ఉచితంగా బ్రౌజ్​ చేసుకోవచ్చు. మనం సాధారణ లైబ్రరీలో ఎలాగైతే పరిశోధన చేస్తామో.. ఇందులో కూడా అలాగే చేయొచ్చు. ఇందులో పాత కంటెంట్​తోపాటు టీవీ సిరీస్​లు, పాత న్యూస్​ రిపోర్టులు, సినిమాలు లాంటి విస్తృతమైన కంటెంట్​ ఉంటుంది. ఇలాంటి సమాచారం ఏ ఇతర సైట్లలో దొరకదు. అన్ని వీడియో సైట్లలాగే ఇందులో కూడా యూజర్లు కంటెంట్​ అప్​లోచ్​ చేయొచ్చు.

ఇంటర్నెట్ అర్కైవ్స్​

6. క్రాకల్​(Crackle)
క్రాకల్​ ఒక వీడియో స్ట్రీమింగ్​ ప్లాట్​ ఫాం. ఇందులో వెబ్​ షోలు, టీవీ సిరీస్​లు, సినిమాలు చూడొచ్చు.

క్రాకల్

7. ట్విచ్​(Twitch)
ట్విచ్​.. అమెజాన్​కు చెందిన కంపెనీ. డిమాండ్​ సేజ్​ అనే సేల్స్ అండ్​ మార్కెటింగ్​ కంపెనీ ప్రకారం వీడియో స్ట్రీమింగ్​కు ఇది బెస్ట్​ ప్లాట్​ఫామ్. ఇందులో 140 మిలియన్ల యూజర్లు ఉన్నారు. దేని మీదైనా ఇందులో మీరు లైవ్​ స్ట్రీమింగ్​ చేయొచ్చు. ఇందులో గేమింగ్​ మోస్ట్​ పాపులర్​ స్ట్రీమిగ్​ కేటగిరీ. ఈ ట్విచ్..​ పలు టాప్​ సింగర్ల లైవ్​ కాన్సెర్ట్​లను కూడా బ్రాడ్​కాస్ట్ చేస్తుంది. ఇందులో ఉచిత, సబ్స్​క్రిప్షన్​ ఆధారంగా స్ట్రీమింగ్​ ఛానల్స్​ ఉంటాయి.

ట్విచ్​

8. ఓపెన్​ వీడియో ప్రాజెక్ట్ మెను(open video project menu)
ఓపెన్​ వీడియో ప్రాజెక్ట్​ మెను.. ఈ ప్లాట్​ఫామ్​ను నార్త్​ కరోలినా యూనివర్సిటీలోని ఓ లాబొరేటరీలో అభివృద్ధి చేశారు. ఇది పరిశోధనలు, మల్టీమీడియా, డిజిటల్​ లైబ్రరీల లాంటి రంగాల్లో పని చేసే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో చాలా వరకు ఎడ్యుకేషన్​కు సంబంధించిన వీడియోలే ఉంటాయి. హిస్టారికల్ వీడియో కంటెంట్​ మీద పరిశోధన చేసేవాళ్లకు.. ఈ సైట్​ ఉపయోగకరంగా ఉంటుంది.

9. 9గ్యాగ్​ టీవీ (9gag tv)
9గ్యాగ్​ టీవీ వీడియో సైట్​లో ఫన్నీ ఫొటోలు, జీఐఎఫ్​, గేమింగ్​ వీడియోలు, మీమ్స్​ లాంటివి అన్నీ ఉంటాయి. ఈ సైట్​లో వీడియో కంపైలేషన్స్​ చాలా పాపులర్ అయ్యాయి. ఇలాంటివి చాలా వీడియోలు ఇందులో ఉంటాయి.

9 గ్యాగ్​ టీవీ

10. టెడ్​ టాక్స్ (ted talks)
టెడ్​ టాక్స్​.. చాలా మందికి తెలిసిన పాపులర్​ సైట్లలో ఒకటి. ఇందులో 3,500ల నిపుణులు.. సాంకేతికం, వ్యాపారం, డిజైన్​, సైన్స్​, ప్రపంచ సమస్యలు మొదలైన విషయాలపై ఉపన్యాసాలు ఉంటాయి. ఈ సైట్​ ప్రతి వారం 5 నుంచి 7 కొత్త వీడియోలను అప్​లోడ్​ చేస్తుంది. ఇందులో కొన్ని ఫన్నీగా, మరి కొన్ని ఎమోషనల్​గా ఉంటాయి. ఇందులో 6 నిమిషాలకన్నా తక్కువ నిడివి ఉన్న వీడియోలక రెడ్​ సర్కిల్​ మార్కు ఉంటుంది. దీంతో మన సమయం సేవ్​ అవుతుంది.

టెడ్​ టాక్స్

11. డీ ట్యూబ్​(DTube)

డీ ట్యూబ్​ చాలా ప్రత్యేకమైన వీడియో షేరింగ్​ ప్లాట్​ ఫామ్​. ఇది యూట్యూబ్​లా పనిచేస్తుంది. యూట్యూబ్​లో ప్రతి వీడియోకు ఎన్ని వీక్షణలు వచ్చాయో లెక్క ఉంటుంది. కానీ ఇందులో ఆ వీడియోకు ఇప్పటివరకు ఎన్ని డబ్బులు వచ్చాయో అనే లెక్క ఉంటుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. మనం సంపాదించిన డబ్బులను స్టీమ్​(STEEM) అనే క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకోవచ్చు. వాటిని క్రిప్టో ఎక్స్​చేంజ్​ల ద్వారా నగదుగా మార్చుకోవచ్చు.

డీ ట్యూబ్​

12. ఫేస్​బుక్​ వాచ్​(facebook watch)
ఫేస్​బుక్​.. దాదాపు మనందరికీ తెలిసిన సోషల్​ మీడియా సైట్​. ఇందులో మొదట వీడియో ఆప్షన్​ లేదు. ఆ తర్వాత వీడియో స్ట్రీమింగ్​ ఫీచర్​ను యాడ్​ చేశారు. అదే ఫేస్​బుక్​ వాచ్. ఇందులో చాలా వరకు గుర్తింపు పొందిన ఛానళ్ల వీడియోలు ఉంటాయి. హై డెఫినిషన్​ వీడియో కంటెంట్​ ఉంటుంది.

ఫేస్​బుక్​ వాచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.