ETV Bharat / science-and-technology

వాట్సాప్ ద్వారా డబ్బుల ట్రాన్స్​ఫర్​ ఎలా?

ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​ ఇటీవలె పేమెంట్స్​ ఆప్షన్​ తీసుకొచ్చింది. ఇది యూపీఐ ఆధారంగా ప‌నిచేయనుంది. దీని సాయంతో డబ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవడం ఎలాగో ఓసారి తెలుసుకుందాం.

whatsapp money
వాట్సాప్ మనీ
author img

By

Published : Jun 10, 2020, 2:44 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

కరోనా నేపథ్యంలో డబ్బులు ప్రత్యక్షంగా తీసుకుంటే వైరస్​ సంక్రమించవచ్చని భయాలు ఉన్నందువల్ల.. దేశవ్యాప్తంగా ఆన్​లైన్​ మనీ ట్రాన్స్​ఫర్​ సేవలు వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే గూగుల్​ పే, ఫోన్​ పే వంటి ఎన్నో యాప్​లు ఈ సేవలు అందిస్తున్నాయి. అయితే ఇందుకోసం వాటిలో ఏదో ఒక యాప్​ ఇన్​స్టాల్​ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ అవసరం లేకుండానే పేమెంట్​ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్​. మెసేజింగ్​ కోసం వాడే ఈ యాప్​లోనే డబ్బు ట్రాన్స్​ఫర్​ చేసుకోవడం వల్ల కొత్త యాప్​ల వినియోగం తగ్గించవచ్చు.

యూపీఐ ఆధారితం..

ఆండ్రాయిడ్, ఐఓస్ బీటా వినియోగ‌దారుల‌కు పేమెంట్ ఫీచ‌ర్ అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్​. యూపీఐ ఆధారితంగా చెల్లింపులు జ‌రిపేందుకు వీలుగా ఈ యాప్ రూపొందించారు. డ‌బ్బు పంపడం, తీసుకోవడం వంటి సేవలు ఇందులో ఉన్నాయి. చెల్లింపుల కోసం ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగ బ్యాంకుల‌తో ఒప్పందం కుదుర్చుకుంది వాట్సాప్. ఇది యూపీఐ ఆధారంగా ప‌నిచేసిన‌ప్ప‌టికీ చెల్లింపుల స‌మ‌యంలో ఐఎఫ్ఎస్‌సీ కోడ్ అవ‌స‌రం లేదు.

డ‌బ్బు పంపించ‌డం ఎలా?

రెండు ర‌కాలుగా వాట్సాప్ పేమెంట్ ద్వారా మీ కుటుంబ స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు డ‌బ్బు పంపించ‌వ‌చ్చు. ఇందుకోసం మొదట యూపీఐ ఖాతా ఉండాలి. బ్యాంక్​ అకౌంట్​ను ఫోన్​ నంబర్​కు అనుసంధానం చేసుకోవాలి. ఇది ఒక్కసారి చేసే ప్రక్రియ కావడం వల్ల వినియోగదారుడికి ప్రతిసారి విసుగు ఉండదు.

యూపీఐ క్రియేషన్​ ఎలా..?

స్మార్ట్​ఫోన్​లో వాట్సాప్​ ఓపెన్​ చేస్తే... అందులో పై భాగం కుడివైపున మూడు చుక్కలు కనిపిస్తాయి. వాటిపై క్లిక్​ చేస్తే.. పేమెంట్స్​ ఆప్షన్​ ఉంటుంది. దానిపై క్లిక్​ చేస్తే.. 'యాడ్​ పేమెంట్​'(ఏ పద్ధతిలో పేమెంట్​ అనుసంధానం చేసుకుంటారు) అని అడుగుతుంది. అప్పుడు అక్కడ పలు బ్యాంక్​ల జాబితా కనిపిస్తుంది. అందులో మీ బ్యాంక్​ అకౌంట్​ను ఎంపిక చేసుకోవాలి. ఆ ఖాతాకు లింక్​ అయిన మొబైల్​ నంబర్​కు వెరిఫికేషన్​ పేరిట సంక్షిప్త సందేశం వస్తుంది. వెరిఫై చేశాక.. ఆ నంబర్​తో ఉన్న అన్ని బ్యాంక్​ అకౌంట్ల జాబితా కనిపిస్తుంది. అందులో మీరు ఏ బ్యాంక్​ను సెట్​అప్​ చేసుకోవాలని అనుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఓకే(డన్​) అని నొక్కితే అకౌంట్​ క్రియేట్​ అయిపోతుంది. అయితే సిస్టమ్​ ఆటోమెటిగా క్రియేట్​ చేసిన ఐడీ నచ్చకపోతే.. మనకు నచ్చిన ఐడీ పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది.

WhatsApp Payments
బ్యాంక్​ జాబితా

ఆ తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌లో, పేమెంట్స్‌-న్యూ పేమెంట్స్‌- సెల‌క్ట్ కాంటాక్ట్స్‌- ఎంట‌ర్ ఎమౌంట్‌-యూపీఐ పిన్ ఎంట‌ర్ ఏయాలి. పేమెంట్ పూర్త‌యిన త‌ర్వాత మీకు పూర్త‌యిన‌ట్లు అక్క‌డ డిస్​ప్లేపై సందేశం క‌నిపిస్తుంది. ఇలా డబ్బులు పంపేందుకు యూపీఐ ఐడీ, క్యూఆర్​ కోడ్​ కూడా వినియోగించవచ్చు.

మ‌రొక పద్ధతి...

  • వాట్సాప్ ఓపెన్ చేయాలి.
  • ఎవ‌రికి డ‌బ్బు పంపించాల‌నుకుంటున్నారో వారి కాంటాక్ట్‌ను ఎంచుకోవాలి.
  • చాట్ సెట్టింగ్స్‌లో, పేమెంట్స్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
  • ఎంత డ‌బ్బు పంపించాలనుకుంటున్నారో ఎంట‌ర్ చేయాలి.
  • త‌ర్వాత మీ యూపీఐ పిన్ ఎంట‌ర్ చేయాలి.
WhatsApp Payments
డబ్బులు పంపడం ఇలా

వాట్సాప్ పేమెంట్ ప్ర‌యోజ‌నాలు

  • వాట్సాప్ ద్వారా ఎక్క‌డ‌నుంచైనా, ఎప్పుడైనా డ‌బ్బు సుల‌భంగా పంపించుకోవ‌చ్చు. అయితే మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న‌వారికే డ‌బ్బు పంపించేందుకు వీల‌వుతుంది.
  • పేమెంట్ పూర్త‌యిన త‌ర్వాత డ‌బ్బు పంపించిన‌వారికి, తీసుకున్న‌వారికి ఇద్ద‌రికీ నోటిఫికేష‌న్ వ‌స్తుంది.
  • ఇందులో ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఎంట‌ర్ చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

వాట్సాప్ పేమెంట్స్ ఫీచ‌ర్... గూగుల్ పే, భీమ్ యాప్‌కీ గ‌ట్టి పోటీనివ్వ‌నుంది. అయితే వాట్సాప్ పేమెంట్‌లో, గూగుల్ పే తరహాలో ఎలాంటి క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ లేదు.

ఇదీ చూడండి: వాహనదారులకు శుభవార్త.. లైసెన్స్​ గడువు పెంపు

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.