ETV Bharat / science-and-technology

మీరు మాట్లాడినా, నవ్వినా చెప్పే స్మార్ట్ మాస్క్​ ఇది... - Coronavirus digital mask

కరోనా నుంచి రక్షణ పొందాలంటే మాస్క్​ తప్పనిసరి. అయితే మాస్క్​ పెట్టుకొని మాట్లాడితే ఎదుటివారికి మన పెదవుల కదలిక తెలియదు. ఈ సమస్యను అధిగమించడానికే ఓ ప్రోగ్రామర్​ అధునాత మాస్క్​ తయారు చేశారు.

This Programmer Made a Mask that Shows Face Movements When You Speak
ఆ మాస్క్​తో మీ ముఖ భావాలు తెలిసిపోతాయ్​!
author img

By

Published : Jun 11, 2020, 9:20 AM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్​ లేకుండా ఇంటి బయట కాలు పెట్టడం ప్రమాదకరం. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో మాస్కే శ్రీరామ రక్ష. అయితే మాస్క్​ వల్ల మట్లాడినా, నవ్వినా పెదవుల కదలిక ఇతరలకు కనిపించదు. ఈ సమస్యను అధిగమించడానికి.. ముఖంలోని భావోద్వేగాలు తెలిసేలా ఓ స్మార్ట్ మాస్క్​ను తయారు చేశారు టెక్ నిపుణుడు టైలర్​ గ్లయేల్​.

ఇలా పని చేస్తుంది!

మాస్క్​ ధరించి, అది పని చేసే తీరను వివరిస్తూ ఓ వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేశారు గ్లయేల్​. మాట్లాడినా, నవ్వినా పెదవుల కదలికను అనుకరించి ఎల్​ఈడీ లైట్లు ముఖంలోని భావాలను ప్రదర్శిస్తాయి. లైట్స్​కు కావాల్సిన విద్యుత్​ను అందించడానికి మాస్క్​లోనే బ్యాటరీ అమర్చి ఉంటుంది.

ఎవరైనా తయారు చేసుకోవచ్చు!

ఆసక్తి ఉన్నట్లయితే ఆ మాస్క్​ను 15ఏళ్లు పైబడిన వారెవరైనా సులభంగా తయారు చేసుకోవచ్చన్నారు టైలర్​. ఎల్​ఈడీల నియంత్రణ గురించి 'మీడియం ఫోస్ట్​'లో వివరాలు పొందుపరిచినట్లు తెలిపారు. ఆయన 'గిట్​హబ్' పేజీలో కూడా మాస్క్​ తయారీ వివరాలు ఉంచినట్లు ప్రోగ్రామర్​ తెలిపారు.

This Programmer Made a Mask that Shows Face Movements When You Speak
స్మార్ట్ మాస్క్​ లోపల ఉండే పరికరాలు

స్మార్ట్ మాస్క్ తయారీకి కావాల్సినవి...

ఇదీ చూడండి: జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.