స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫిలిప్స్ కంపెనీ కొత్తగా రెండు ట్రూలీ వైర్‌లెస్ హెడ్‌ఫోన్లను విడుదల చేసింది. వీటి పేర్లు ఫిలిప్స్ ఎస్‌బీహెచ్2515బీకే/10, ఫిలిప్స్ టీఏటీ3225బీకే. పూర్తిగా ఛార్జింగ్ అయ్యాక ఎస్‌బీహెచ్2515బీకే/10 నిర్విరామంగా 110 గంటల పాటు పనిచేయగలదు. దీంతో యూఎస్‌బీ ఛార్జింగ్ కేసు కూడా వస్తుంది.
ఇది హెడ్‌ఫోన్లనే కాదు.. కావాలంటే ఫోన్ కూడా ఛార్జ్ చేయగలదు! అంటే అవసరమైనప్పుడు పవర్ బ్యాంకు మాదిరిగానూ ఉపయోగపడుతుందన్నమాట. ఇది ఇన్‌బిల్ట్‌గా 3350 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగుంటుంది మరి. హెడ్‌ఫోన్‌లో మోనోమోడ్ సదుపాయమూ ఉంటుంది. చుట్టుపక్కల శబ్దాలు వినిపించటానికి వీలుగా ఒక చెవిలోనే హెడ్‌ఫోన్ పెట్టుకున్నా పాటలు స్పష్టంగా వినిపిస్తాయి. పాటలను స్కిప్ చేయటానికి, కాల్స్ మాట్లాడటానికి లేదా తిరస్కరించటానికి.. ఇలా వివిధ అవసరాలకు తోడ్పడే ఎన్నో బటన్లు కూడా ఉన్నాయి. టీఏటీ3225బీకే అయితే 13 ఎంఎం స్పీకర్ డ్రైవర్, బ్లూటూత్ 5.2, ఐపీఎక్స్4 రేటింగ్‌తో కూడుకొని ఉంటుంది.
ఇదీ చూడండి: ఈ మొబైల్స్ ధర 15వేల లోపే.. ఫీచర్లు మాత్రం అదరహో!