Slack App: కంపెనీలు, ఉద్యోగులకు ప్రత్యేకించిన మెసేజ్ వేదిక స్లాక్ మనదేశంలో అధికారికంగా ఆరంభమైంది. ఇది మనదేశ కంపెనీలు తమ ఉద్యోగ బృందాలు, కస్టమర్లు, భాగస్వాములతో త్వరగా, తేలికగా అనుసంధానం కావటానికి తోడ్పడగలదు. ఆఫీసులోను, బయటివారితోనూ మరింత బాగా చర్చలు సాగించటానికి, ఆటోమేట్ పనులు చేయటానికి వీలు కల్పిస్తుంది. ప్రపంచంలో ఏ మూల నుంచైనా పనిచేసుకోవటానికి వీలు కల్పించగలదు. స్లాక్ ప్రస్తుతం 150కి పైగా దేశాల్లో అందుబాటులో ఉంది. దీన్ని మనదేశంలోనూ ఎంతోమంది అనుసరిస్తున్నారు.
ఉద్యోగ నిర్వహణలో భాగంగా వివిధ యాప్‌లను చూసే క్రమంలో మనదగ్గర రోజుకు సగటున 47 నిమిషాలు వృథా అవుతున్నాయని స్లాక్ అధ్యయనం పేర్కొంటోంది. ప్రతి ఐదుగురిలో ఒకరు వారానికి 10 గంటలు నష్టపోతున్నామని అభిప్రాయపడుతున్నారు. ఇది సంవత్సరానికి సుమారు 10 పని వారాలతో సమానం. 2,600కు పైగా యాప్ ఇంటిగ్రేషన్స్‌తో కూడిన స్లాక్ ఉద్దేశం ఉత్పాదకత తగ్గకుండా చూడటం. పనిలో ఉద్యోగుల సంతృప్తిని మెరుగు పరచటం. స్లాక్ నాలుగేళ్లుగా మనదేశంలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇప్పటికే జొమాటో వంటి కంపెనీలు దీనిపై ఆధారపడి పనిచేస్తున్నాయి.
ఇవీ చదవండి: వాట్సాప్లో ఇకపై 'అన్ డూ' ఆప్షన్.. మెసేజ్ ఎడిట్.. గ్రూప్ నుంచి సైలెంట్ ఎగ్జిట్!