ETV Bharat / science-and-technology

మస్క్​ ఎఫెక్ట్​: వాట్సాప్​కు బై- సిగ్నల్​కు జై!

టెస్లా సీఈఓ, అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్​ చేసిన ఒక్క ట్వీట్​తో మెసెంజర్ యాప్​ 'సిగ్నల్' డౌన్​లోడ్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వాట్సాప్​కు ప్రత్యామ్నాయంగా తన ఫాలోవర్లు ఈ యాప్​ను వినియోగించాలని ఆయన సూచించారు. అమెరికా రాజధానిలో జరిగిన హింసాత్మక ఘటనలను సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కాకుండా వాట్సాప్​ యాజమాన్య సంస్థ ఫేస్​బుక్​ అడ్డుకోలేక పోయిందని మస్క్​ అన్నారు.

Signal sees surge in new users after Elon Musk vouches for it
ఎలన్​ మస్క్​ ట్వీట్​తో 'సిగ్నల్​'కు పోటెత్తిన వినియోగదారులు
author img

By

Published : Jan 8, 2021, 4:59 PM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

మెసెంజర్ యాప్ 'సిగ్నల్'​కు కొత్త వినియోగదారులు పోటెత్తుతున్నారు. వాట్సాప్​కు ప్రత్యామ్నాయంగా ఈ యాప్​ను వినియోగించాలని ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ ట్వీట్​ చేసిన తర్వాత 'సిగ్నల్'​ డౌన్​లోడ్లు భారీగా పెరుగుతున్నాయి.

మస్క్​కు ట్విట్టర్​లో 41.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

అమెరికా రాజధాని వాషింగ్టన్​ డీసీలో జరిగిన హింసాత్మక ఘటనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కాకుండా వాట్సాప్ యాజమాన్య సంస్థ ఫేస్​బుక్ నిలువరించలేకపోయిందని మస్క్​ గురువారం రాత్రి ట్వీట్​ చేశారు. ఫేస్​బుక్​ను విమర్శిస్తూ ఓ ఫొటోను షేర్​ చేశారు. హార్వర్డ్​ యూనివర్సిటీలో ప్రస్థానం మొదలుపెట్టి దేశ రాజధానిలో ఘర్షణలు జరగడానికి కారణమయ్యే స్థాయికి ఫేస్​బుక్ ఎదిగిందన్నారు. డోమినో ఎఫెక్ట్​ అంటే ఇదే అని వ్యాఖ్యానించారు.

తన ఫాలోవర్లు అందరూ సిగ్నల్​ను వినియోగించాలని వాట్సాప్​ను ఎప్పుడూ విమర్శించే మస్క్​ ట్వీట్​ చేశారు. దీనికి తోడు... తాజాగా యూజర్ల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించేలా ప్రైవసీ పాలసీని వాట్సాప్​ అప్​డేట్​ చేయడమూ ప్రతికూల ప్రభావం చూపింది.

భారీ డిమాండ్..

మస్క్ ట్వీట్​ చేసిన వెంటనే సిగ్నల్​ యాప్ డౌన్లోడ్లు విపరీతంగా పెరిగాయి. రద్దీ పెరిగినందు వల్ల కొత్త వినియోగదారులు రిజిస్టర్ చేసుకునే సమయంలో కాసేపు ఆటంకం ఏర్పడింది. దీంతో సిగ్నల్​ సంస్థ స్పందించింది. సమస్యను పరిష్కరించినట్లు ట్వీట్​ చేసింది. వినియోగదారులు తమ మెసెంజర్​ను ఎంచుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలిపింది.

యూజర్ల గోప్యత విధానాలను వాట్సాప్ పదే పదే ఉల్లంఘిస్తోందని గతేడాది కూడా విమర్శలు గుప్పించారు మస్క్​. ఫోన్లను వాట్సాప్ ఉచితంగా హ్యాక్​ చేస్తుందని​ మీమ్​లను షేర్​ చేశారు.

అమెజాన్ వ్యవస్థాపకుడు జెప్ బెజోస్​ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా గురువారం అవతరించారు మస్క్​. పేలవ ఫలితాల కారణంగా ఒకప్పుడు టెస్లాను విక్రయిద్దామనుకున్న ఆయన.. ఇప్పుడు ఎవరూ ఊహించని స్థాయికి చేరుకున్నారు.

ఇదీ చూడండి: బీఎస్​ఈ కంపెనీల ఎం-క్యాప్ ఆల్​టైం రికార్డ్

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.