ETV Bharat / science-and-technology

'వాట్సాప్‌' భద్రతకు సప్త సూత్రాలు

author img

By

Published : Aug 31, 2020, 2:29 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

సోషల్​ మీడియాలో మనమేం చేసినా ఇట్టే పసిగట్టేస్తున్నారు సైబర్​ నేరగాళ్లు. మన వ్యక్తిగత వివరాలను ఎంత గోప్యంగా ఉంచాలనుకున్నా.. అడ్డగోలు మార్గాలను అన్వేషిస్తున్నారు. సైబర్​ కేటుగాళ్ల నుంచి మన వాట్సాప్​ అకౌంట్​ను మరింత భద్రపరచుకునేందుకు సప్త సూత్రాలను సూచిస్తున్నారు టెక్​ నిపుణులు. అవేంటో తెలుసుకోండి..

SEVEN SECURITY TIPS FOR PRIVACY SETTINGS IN WHATSAPP
వాట్సాప్‌: భద్రతకు సప్త సూత్రాలు

సౌకర్యం మాటున.. ప్రమాదమూ ఉంటుందంటారు పెద్దలు. వాట్సాప్‌ కూడా అలాంటి సౌకర్యమే. మెసేజ్‌లు, కాల్స్‌, వీడియో కాల్స్‌ అంటూ వాట్సాప్‌ రకరకాల సదుపాయాలు అందిస్తోంది. అయితే అందులో మీ సమాచార భద్రతకు కొన్ని మార్పులు అవసరమని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి మార్పులు చేసుకుంటే టెక్‌ మోసాలకు కూడా అడ్డుకట్ట వేయొచ్చంటున్నారు. అవేంటో, ఎలా చేయాలో చదివేయండి.. ఆ తర్వాత మీకు అవసరమైతే చేసుకోండి.

మీ అంగీకారంతోనే...

SEVEN SECURITY TIPS FOR PRIVACY SETTINGS IN WHATSAPP
మీ అంగీకారంతోనే...

మిమ్మల్ని ఎవరైనా వేరే గ్రూప్‌లో యాడ్‌ చేయాలంటే మీ అనుమతి తీసుకొనేలా ఉంటే మంచిది కదా. దాని కోసం వాట్సాప్‌లో ఓ ఆప్షన్‌ ఉంది. దానిని యాక్టివేట్‌ చేసుకుంటే మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవరూ గ్రూప్‌లో యాడ్‌ చేయలేరు. దీని కోసం వాట్సాప్‌లో పైన సెర్చ్‌ పక్కన మూడు చుక్కల ఐకాన్‌ను క్లిక్‌ చేయండి. అందులోని సెట్టింగ్స్‌కి వెళ్తే... అకౌంట్‌కు సంబంధించిన ఆప్షన్‌ ఉంటుంది. అందులో ప్రైవసీ ఆప్షన్ క్లిక్‌ చేయండి. అందులోని గ్రూప్స్‌లోకి వెళ్తే.. మూడు రకాల ఆప్షన్లు ఉంటాయి. ఎవ్రీవన్‌ సెలక్ట్‌ చేసుకుంటే ఎవరైనా యాడ్‌ చేయొచ్చు. మీ మొబైల్‌లో ఉన్న కాంటాక్ట్స్‌ (సేవ్‌ చేసిన ఫోన్‌ నెంబర్లు) మాత్రమే మిమ్మల్ని గ్రూపులో యాడ్‌ చేయాలంటే ‘మై కాంటాక్ట్స్‌’ ఎంచుకోండి. మీ మొబైల్‌లోని కాంటాక్ట్సే కానీ.. అందులో కొందరు వద్దు అనుకుంటే... 'మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌...' ఎంచుకోండి.

ఆన్‌లైన్‌లో ఉన్నారా...

'వాడు రాత్రి 12 వరకు నిద్రపోలేదు రా... లాస్ట్‌ సీన్‌ 12:02 అని చూపిస్తోంది'... చాలామంది స్నేహితుల ముచ్చట్లలో ఇదే మాట. మీరూ ఇలాంటి ఇబ్బందే పడుంటారు. మీరు ఎప్పటివరకు వాట్సాప్‌ వాడారో అందరికీ తెలియడం మీకు ఇష్టం లేదా... అయితే దానిని కూడా ఆపేయొచ్చు. దీని కోసం వాట్సాప్‌లో పైన సెర్చ్‌ పక్కన మూడు చుక్కల ఐకాన్‌ను క్లిక్‌ చేయండి. అందులోని సెట్టింగ్స్‌కి వెళ్తే... అకౌంట్‌కు సంబంధించిన ఆప్షన్‌ ఉంటుంది. అందులో ప్రైవసీ‌ ఆప్షన్ క్లిక్ చేస్తే లాస్ట్‌ సీన్‌ అని ఉంటుంది. అందులో 'నో బడీ' ఆప్షన్‌ ఎంచుకుంటే... మీ లాస్ట్‌ సీన్‌ టైమ్‌ ఎవరికీ కనిపించదు. ఇక ఎవ్రీవన్‌ సంగతి మీకు తెలిసిందే. అందరికీ కనిపిస్తుంది. 'మై కాంటాక్ట్స్‌' అంటే మీ మొబైల్‌లో సేవ్‌ అయిన నంబర్లకే కనిపిస్తుంది.

స్టేటస్‌ అందరూ చూడాలా...

మనసులోని భావాలను, నచ్చిన కొటేషన్లు, ఫ్రస్టేషన్లను వాట్సాప్‌ స్టేటస్‌లుగా పెడుతుంటారు. అయితే వాటిని అందరూ చూడాలని లేదు కదా. దీని కూడా వాట్సాప్‌లో కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. వాట్సాప్‌లో పైన సెర్చ్‌ పక్కన మూడు చుక్కల ఐకాన్‌ను క్లిక్‌ చేయండి. అందులోని సెట్టింగ్స్‌కి వెళ్తే... అకౌంట్‌కు సంబంధించిన ఆప్షన్‌ ఉంటుంది. అందులో ప్రైవసీ ఆప్షన్ క్లిక్‌ చేయండి. అందులోని 'స్టేటస్‌' ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే మూడు ఆప్షన్లు ఉంటాయి. 'మై కాంటాక్ట్స్‌' క్లిక్‌ చేస్తే... మీ మొబైల్‌లో సేవ్‌ చేసుకున్న కాంటాక్ట్స్‌ అందరికీ మీ స్టేటస్‌ కనిపిస్తుంది. 'ఓన్లీ షేర్‌ విత్...'‌ ఎంచుకుంటే... మీరు సెలక్ట్‌ చేసుకున్న కొంతమందికే కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌లో మీకు నచ్చినవారిని ఎంచుకోవచ్చు. 'మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌...' ఆప్షన్‌ ఎంచుకుంటే... మీరు ఎంచుకున్నవారు కాకుండా... మిగిలిన మీ కాంటాక్ట్స్‌ అందరికీ మీ స్టేటస్‌ అందుబాటులో ఉంటుంది.

మీ గురించి మీరు... ‌

తమ మనసులోని భావాన్ని వ్యక్తపరచడానికి, తమ గురించి తాము చెప్పకుకోవడానికి వాట్సాప్‌లో స్టేటస్‌ అని ఉండేది. యూజర్‌ పేరు కింద ఆ టెక్స్ట్‌ కనిపించేది. ఆ తర్వాత దాన్ని 'అబౌట్‌'గా మార్చారు. అందులో మీరు రాసుకున్న అంశం అందరికీ కనిపించకుండా చేయడానికీ ఆప్షన్‌ ఉంది. దీని కోసం వాట్సాప్‌లో పైన సెర్చ్‌ పక్కన మూడు చుక్కల ఐకాన్‌ను క్లిక్‌ చేయండి. అందులోని సెట్టింగ్స్‌కి వెళ్తే... అకౌంట్‌కు సంబంధించిన ఆప్షన్‌ ఉంటుంది. అందులో ప్రైవసీ ఆప్షన్ క్లిక్‌ చేసి 'అబౌట్‌' ఆప్షన్‌లో ఎంటర్‌ అవ్వండి. ఇక అక్కడి ఎవ్రీవన్‌, మై కాంటాక్ట్స్‌, నోబడీ ఆప్షన్లలో మీకు నచ్చింది ఎంచుకోండి.

మీ డిస్‌ప్లే ఫొటో మీ ఇష్టం

ఏదో అవసరం కోసం ఓ వ్యక్తి నంబరును మీ మొబైల్‌లో సేవ్‌ చేసుకున్నారు. మీ నంబరు వాళ్ల దగ్గర కూడా వాళ్ల దగ్గర ఉంది. ఇంకేముంది... మీ వాట్సాప్‌ డీపీ వాళ్లు చూడొచ్చు. ఇలా జరగడం మీకు ఇష్టం లేదా. దీని కోసం వాట్సాప్‌లో పైన సెర్చ్‌ పక్కన మూడు చుక్కల ఐకాన్‌ను క్లిక్‌ చేయండి. అందులోని సెట్టింగ్స్‌కి వెళ్తే... అకౌంట్‌కు సంబంధించిన ఆప్షన్‌ ఉంటుంది. అందులోని ప్రైవసీ లోకి వెళ్లి ప్రొఫైల్‌ ఫొటో ఆప్షన్ క్లిక్‌ చేయండి. ప్రొఫైల్‌ పిక్చర్‌ను కేవలం మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ మాత్రమే చూసేలా చేయాలంటే మై కాంటాక్ట్స్‌ పెట్టుకోవచ్చు. లేకపోతే ఎవరూ చూడకుండా కూడా పెట్టుకునే ఆప్షన్‌ ఉంది అదే 'నోబడీ'.

బ్లాక్‌ చేసేయండి...

వాట్సాప్‌కు తెలిసిన, తెలియని వారు సందేశాలు, ఫొటోలు, వీడియోలు పెడుతుంటారు. ఏదో విధంగా మీ మొబైల్‌ నెంబరు సంపాదించి మీకు కాంటాక్ట్‌ అవుతుంటారు. అలాంటివారిని బ్లాక్‌ చేయడమూ సులభమే. దీని కోసం... వాట్సాప్‌లో పైన సెర్చ్‌ పక్కన మూడు చుక్కల ఐకాన్‌ను క్లిక్‌ చేయండి. అందులోని సెట్టింగ్స్‌కి వెళ్తే... అకౌంట్‌కు సంబంధించిన ఆప్షన్‌ ఉంటుంది. అందులో ప్రైవసీ ఆప్షన్ క్లిక్‌ చేసి... బ్లాక్‌డ్‌ కాంటాక్ట్స్‌ ఆప్షన్‌ ఎంచుకోండి. అందులోకి వెళ్లాక మీకు కావాల్సిన కాంటాక్ట్స్‌ను బ్లాక్‌ చేసుకోవచ్చు.

లాక్‌ చేస్తారా...

వాట్సాప్‌లో కీలకమైన సమాచారం ఉండి వేరొకరు చూస్తే ప్రమాదమని భావిస్తే తప్పకుండా ఫింగర్‌ప్రింట్‌ లాక్‌ను పెట్టుకోవచ్చు. దీని కోసం వాట్సాప్‌లో పైన సెర్చ్‌ పక్కన మూడు చుక్కల ఐకాన్‌ను క్లిక్‌ చేయండి. అందులోని సెట్టింగ్స్‌కి వెళ్తే... అకౌంట్‌కు సంబంధించిన ఆప్షన్‌ ఉంటుంది. అందులో ప్రైవసీ ఆప్షన్ క్లిక్‌ చేయండి. అక్కడ ఆఖరును 'ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌' అనే ఆప్షన్‌ ఉంటుంది. అక్కడి నుంచి ఈ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసేకోవచ్చు. ఈ లాక్‌ అనేది మూడు విధాలుగా పడుతుంది. వెంటనే, ఒక నిమిషం తర్వాత, 30 నిమిషాల తర్వాత అనే ఆప్షన్లు ఉంటాయి. వాటిలో మీకు కావాల్సింది ఎంచుకోవచ్చు.

ఇదీ చదవండి: చైనా ఒప్పుకుంటేనే టిక్‌టాక్‌ విక్రయం?

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.