ETV Bharat / science-and-technology

'వర్క్ ఫ్రమ్​ హోమ్'కు సైబర్ భద్రత ఎలా?​

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 'వర్క్​ ఫ్రమ్​ హోమ్'​ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే సంస్థలు, కంపెనీలకు మాత్రం సైబర్​ దాడులు, రాన్సమ్​వేర్​ నుంచి బాధలు తప్పడం లేదు. ఆ ముప్పును తప్పించేందుకు పలు టూల్స్​ ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఫిషింగ్​ ఈ-మెయిల్​తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

How to deal with cyber security issues as the world shifts to remote working?
సైబర్​ దాడులు
author img

By

Published : Jul 31, 2020, 9:31 AM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సిబ్బంది ఒకేచోట కలిసి పనిచేసే అవకాశాలు తగ్గిపోయాయి. సంస్థలన్నీ రిమోట్ పద్ధతిలోనే పని కల్పిస్తున్నాయి. అయితే అందరూ అంతర్జాల వాడకంపై దృష్టి సారించడం వల్ల.. ఆయా సంస్థలు, కంపెనీలు కొత్త చిక్కుల్ని ఎదుర్కొంటున్నాయి. సైబర్​ కేటుగాళ్లు.. ప్రైవసీని బ్రేక్​ చేయడం, డేటాను తస్కరించడం, రాన్సమ్​వేర్​లను పంపించి సిస్టమ్​ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం వంటి పనులు చేస్తున్నారు.

సైబర్​ దాడుల్లోని రకాలు, వాటి నుంచి రక్షించుకునే మార్గాల విషయంలో సైబర్​ సెక్యూరిటీ నిపుణులు ఇంద్రజిత్​ సింగ్​ కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటి గురించి ఓసారి తెలుసుకుందాం.

రిమోట్​ వర్కింగ్​కు మారిన సంస్థలు...

కొవిడ్​-19 దెబ్బకు వ్యాపార కార్యకలాపాలన్నీ​ కార్యాలయాల నుంచి కాకుండా ఇళ్ల వద్ద నుంచే జరుగుతున్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో రిమోట్​ వర్కింగ్​కు కొన్ని సంస్థలు మొగ్గు చూపినా.. ఈ తరహా విధానంతో చాలా చిక్కులు ఎదుర్కొంటున్నాయి. సిబ్బంది అటెండెన్స్​ నుంచి కార్పొరేట్​ డేటా లీక్​, డేటా ప్రొటక్షన్​ వంటి విషయాల్లో కొన్ని లోటుపాట్లు ఉండటమే ఇందుకు కారణం.

సైబర్​ దాడులు పెరిగాయి...

కరోనా మహమ్మారి ఓ వైపు ఇబ్బందులు పెడుతుంటే.. మరోవైపు సైబర్​ దాడుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వైరస్​ పరిస్థితులను ఆసరాగా తీసుకున్న హ్యాకర్లు.. దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వైద్యరంగానికి ప్రాముఖ్యం పెరగ్గా... ఐటీ సర్వీసులపై ఆధారపడటం మరింత విస్తృతమైంది. అయితే ఇదే సమయంలో వైద్య రంగంపై సైబర్​ దాడులు పెరిగాయి. దీనికి కారణం చాలా ఫార్మా సంస్థలు కరోనా వ్యాక్సిన్​ కనిపెట్టే పనిలో ఉండటమే. హ్యాకర్లు, కొంతమంది కేటుగాళ్లు వ్యాక్సిన్​ సమాచారం తస్కరించాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఫిషింగ్​ ఎటాక్​లు సహా మాల్​వేర్​, ర్యాన్సమ్​వేర్​లతో దాడులు చేస్తున్నారు. హెల్త్​కేర్​, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్​లో డేటాను కాపాడుకోవడం, సైబర్​ దాడుల నుంచి రక్షించుకోవడం కీలకంగా మారింది.

బ్యాంకింగ్​ రంగంలోనూ...

సైబర్​ దాడులకు పాల్పడే అవకాశమున్న మరో సెక్టార్​ బ్యాంకింగ్. ఈ విపత్తు సమయంలో బ్యాంకింగ్​ రంగంలోనూ సైబర్​ దాడులు పెరిగాయి. మాల్​వేర్​ సాయంతో ఆర్థిక​ సంస్థలను టార్గెట్​ చేస్తారు. వాటిని తమ పరిధిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఒక్కో దేశంలో ఒక్కో పద్ధతి అమలు చేస్తుంటారు. ప్రతి ఒక్కరు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని తెరవెనుక నుంచి ప్రయత్నాలు చేస్తారు కేటుగాళ్లు.

అత్యవసర సేవల్లోనూ...

పవర్​ గ్రిడ్​, వాటర్​ ప్లాంట్​లు, ఆయిల్​ అండ్ గ్లాస్​ ప్లాంట్​లు, టెలికాం నెట్​వర్క్​ల వంటి అత్యవసర సేవలపైనా సైబర్​ నేరగాళ్ల కన్ను పడింది. అందుకే ఆయా విభాగాల్లోనూ సైబర్​ సెక్యూరిటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది సిబ్బంది అత్యవసర సేవల విషయంలో అన్ని వేళలా పర్యవేక్షణ ఉంచలేకపోతున్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు వర్క్​ఫ్రమ్​ హోం చేయడాన్ని ఆసరగా తీసుకుని హ్యాకర్లు దాడికి పాల్పడుతున్నారు.

ఫిషింగ్​ ఈ-మెయిల్​ అంటే?

హ్యాకర్లు మాల్​వేర్​లను పంపేందుకు ఎక్కువగా వినియోగిస్తున్న పద్ధతుల్లో ఫిషింగ్​ ఈ-మెయిల్​ ఒకటి. మెయిళ్లకు వైరస్​తో కూడిన​ సందేశాలు పంపి.. వాటి ఉచ్చులో పడేసే ప్రయత్నాలు చేస్తారు. గత కొన్ని నెలల వ్యవధిలోనే 600 శాతం ఇటువంటి కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచమంతా కరోనా భయంలో కొట్టుమిట్టాడుతుంటే.. ఈ సమయంలో సైబర్‌ నేరగాళ్లు మాత్రం ప్రభుత్వ ఏజెన్సీలు, శాఖలు పంపినట్టుగా ఇలాంటి ఫిషింగ్‌ మెయిల్స్‌ను పంపిస్తూ.. అమాయకుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

డబ్లూహెచ్​ఓ పంపినట్లు కరోనా సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి అంటూ సమాచారం పంపుతున్నారు. ఒక్కసారి వారు పంపిన ఫైల్​ను డౌన్​లోడ్​ చేసి ఓపెన్​ చేస్తే.. అప్పుడు సమస్య మొదలవుతుంది. ఎవరైనా ఆ లింక్​లు లేదా ఎటాచ్​మెంట్లపై క్లిక్​ చేస్తే... అది ఆటోమేటిక్​గా ఆయా ల్యాప్​టాప్​ లేదా పీసీలో చేరి వ్యక్తిగత, సున్నితమైన సమచారం సేకరిస్తుంది. ఫిబ్రవరి-మార్చి సమయంలో దాదాపు 20 లక్షల ఈ మెయిల్‌ ఖాతాలకు ఇలాంటి హానికరమైన మెయిల్స్‌ వెళ్లినట్టు సమాచారం.

నకిలీ ఈ- మెయిల్స్‌ మిమ్మల్ని నకిలీ వెబ్‌సైట్ల వైపు తీసుకెళ్తాయి. దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లో ప్రజలందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తాం అంటూ ఈ-మెయిల్స్‌ వస్తున్నాయని.. వాటికి స్పందించవద్దని ద ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం ప్రజలను అప్రమత్తం చేసింది.

cyber security

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.