పండుగ సీజన్ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ల మార్కెట్లో సందడి చేసేందుకు సిద్ధమైంది టెక్ దిగ్గజం గూగుల్. ఇందులో భాగంగా పిక్సెల్ 4ఏ 5జీ వేరియంట్, పిక్సెల్ 5 స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది. అక్టోబర్ 17న దేశీయ మార్కెట్లోకి రానుంది 4ఏ 5జీ. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మోడళ్లు కొనుగోలుకు అందుబాటులో ఉండనున్నట్లు గూగుల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ రెండు ఫోన్లలో డ్యుయల్ సిమ్ (నానో-ఈసిమ్) సదుపాయం ఉంది.
తమ వ్యాపారాలను స్మార్ట్ఫోన్ మార్కెట్ నుంచి టీవీలకు విస్తరించించనున్నట్లు గూగుల్ తాజా ఈవెంట్లో ప్రకటించింది.
పిక్సెల్ 4ఏ 5జీ ఫీచర్లు..
- 6.2 అంగుళాల ఫుల్ హెచ్డీ+ఓఎల్ఈడీ డిస్ప్లే
- క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765జీ ప్రాసెసర్
- 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజి
- వెనుకవైపు రెండు కెమెరాలు (12.2 ఎంపీ+16ఎంపీ)
- 8 మెగా పిక్సెళ్ల పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా- 4కే వీడియో రికార్డింగ్ సదుపాయం.
- 3,885ఎంఏహెచ్ బ్యాటరీ.. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్
- ఈ మోడల్ ప్రారంభ ధర దాదాపు రూ.37,000గా ఉండొచ్చని అంచనా
పిక్సెల్ 5 ఫీచర్లు..
- 6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ఓఎల్ఈడీ డిస్ప్లే
- గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్
- క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765జీ ప్రాసెసర్
- వెనుకవైపు రెండు కెమెరాలు (12.2 ఎంపీ+16 ఎంపీ)
- 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
- రియర్, సెల్ఫీ కెమెరాతో 4కే వీడియో రికార్డింగ్ సదుపాయం
- 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజీ
- 4,080 ఎంఏహెచ్ బ్యాటరీ..18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- వైర్లెస్, రివర్స్ ఛార్జింగ్ సదుపాయం
- ఈ మోడల్ ధర దాదాపు రూ.51,400గా ఉండొచ్చని అంచనా
ఇదీ చూడండి:డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలకు అదనపు భద్రత