కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో కోట్లాది మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు. అలాంటి వారికి అనువుగా ఉండేలా సాంకేతిక దిగ్గజం గూగుల్ సరికొత్తగా 'ది ఎనీవేర్ స్కూల్' అనే సదుపాయాన్ని ఆవిష్కరించింది.
గూగుల్ మీట్, క్లాస్ రూమ్, జీ సూట్ వంటి అప్లికేషన్లలో 50 కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో గూగుల్ వినియోగదారుల కోసం దీన్ని ప్రవేశపెట్టింది. సెప్టెంబర్‌లో గూగుల్ మీట్‌లో కొత్త అప్డేట్స్ రానున్నాయి. 49 మంది వరకు ఒకేసారి కనిపించేలా 'ఇంటిగ్రేటెడ్ జామ్ బోర్డు- వైట్ బోర్డు' ఫీచర్‌ను కూడా తీసుకురానుంది.
-
Driven by your feedback, we’ve created over 50 new features across Meet, Classroom, @GSuite and other products to help educators everywhere deliver meaningful learning experiences. Take a look at all the recent @GoogleForEdu announcements → https://t.co/1k4aAljsEM pic.twitter.com/b3NkSrCUt4
— Google (@Google) August 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Driven by your feedback, we’ve created over 50 new features across Meet, Classroom, @GSuite and other products to help educators everywhere deliver meaningful learning experiences. Take a look at all the recent @GoogleForEdu announcements → https://t.co/1k4aAljsEM pic.twitter.com/b3NkSrCUt4
— Google (@Google) August 12, 2020Driven by your feedback, we’ve created over 50 new features across Meet, Classroom, @GSuite and other products to help educators everywhere deliver meaningful learning experiences. Take a look at all the recent @GoogleForEdu announcements → https://t.co/1k4aAljsEM pic.twitter.com/b3NkSrCUt4
— Google (@Google) August 12, 2020
మరిన్ని ఫీచర్లతో..
అక్టోబర్ నాటికి కొత్త కంట్రోల్స్‌ను కూడా వినియోగదారులకు అందించనుంది.
- వినియోగదారులు ముందే జాయిన్ కావచ్చు. అందరికీ ఒకేసారి తరగతులను నిర్వహించవచ్చు. ఒకేసారి కట్ చేయవచ్చు. ఇన్ మీటింగ్ చాట్‌ను డిసేబుల్ చేయవచ్చు.
- గూగుల్ మీట్‌లో కస్టమ్, బ్లర్డ్ బ్యాక్ గ్రౌండ్స్ సదుపాయాన్ని కల్పించనుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రైవసీ కోసం ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది.
- బ్రేక్ ఔట్ రూమ్స్, అటెండెన్స్ ట్రాకింగ్ లాంటి ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.
- తరగతులను తాత్కాలికంగా రికార్డు చేసుకునే ఫీచర్‌ను కూడా ప్రవేశపెడుతోంది.
వచ్చే ఏడాది 'జీ- సూట్ ఎంటర్‌ప్రైజ్ ఎడ్యుకేషన్ కస్టమర్స్' కోసం సరికొత్త ఫీచర్స్ తేనుంది. హోంవర్క్, వాటి తప్పొప్పులను వెంటనే విద్యార్థులకు తెలిసే సౌలభ్యం కల్పించనుంది.
విద్యార్థుల స్పష్టత కోసం..
గూగుల్ క్లాస్ రూమ్ ప్లాట్ ఫాంను వినియోగదారుల కోసం 'చేయాల్సిన పనులు' పేరిట క్లాసెస్ పేజీకి అదనంగా జోడించింది. దీని వల్ల విద్యార్థులకు తర్వాత ఏం వస్తుంది, మనం ఏ విషయాలు మిస్ అయ్యాం అనే అంశాలపై స్పష్టత కోసం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు.
టీచర్లు.. విద్యార్థులను తన క్లాస్‌లో జాయిన్ కావడానికి లింక్ ద్వారా ఆహ్వానించవచ్చు. గూగుల్ క్లాస్ రూమ్‌లో మరో 10 భాషలను జోడించనున్నారు. ఫలితంగా మొత్తం 54 భాషల్లో అందుబాటులో ఉండనుంది.
ఇదీ చూడండి: సామాన్యులకు గూగుల్ 'డిజిటల్ విజిటింగ్ కార్డులు'