ETV Bharat / science-and-technology

వినియోగదారుల ఖాతా భద్రతకు కొత్త ఫీచర్లు: ఫేస్​బుక్​ - హార్డ్​వేర్ సెక్యూరిటీ కీ ఫేస్​బుక్

అదనపు భద్రత కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది ఫేస్​బుక్​. రెండంచెల భద్రత కోసం హార్డ్​వేర్ సెక్యూరిటీ కీని ఉపయోగించుకునేందుకు అనుమతించనున్నట్లు సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది నుంచి ఈ వెసులుబాటు కల్పించనున్నట్లు వెల్లడించింది.

Facebook to offer more security features in 2021
ఫేస్​బుక్ ఖాతాకు కొత్త భద్రతా ఫీచర్లు
author img

By

Published : Dec 24, 2020, 12:38 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

వినియోగదారుల డేటా భద్రత కోసం ఫేస్​బుక్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. అదనపు రక్షణ కోసం వచ్చే ఏడాది నుంచి ఫేస్​బుక్ మొబైల్ యాప్​లో 'హార్డ్​వేర్ సెక్యూరిటీ కీ'ని ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. వినియోగదారులు.. రిటైలర్ల నుంచి ఈ హార్డ్​వేర్ 'కీ'ని కొనుగోలు చేసి ఫేస్​బుక్​తో రిజిస్టర్ చేసుకోవచ్చని పేర్కొంది. లాగిన్ అయ్యే ముందు పాస్​వర్డ్​తో పాటు ఈ కీని ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది.

దీంతో పాటు సొంత సెక్యురిటీ ప్రోగ్రామ్ అయిన 'ఫేస్​బుక్ ప్రొటెక్ట్​'ను మరింత విస్తరించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. హై ప్రొఫైల్ ఖాతాలకు అందుబాటులో ఉన్న ఈ వెసులుబాటును మరిన్ని అకౌంట్లకు వర్తింపజేయనున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికాలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఏజెన్సీలు, ఎన్నికల సిబ్బందికి అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ఉన్న ఖాతాలోకి లాగిన్ అయ్యేందుకు రెండంచెల భద్రత(టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్)ను దాటాల్సి ఉంటుంది. ఈ ఖాతాలకు ఉన్న హ్యాకింగ్ ముప్పును వేగంగా గుర్తించే అవకాశమూ ఉంటుంది.

ఇదీ చదవండి: 43 శాతం పెరిగిన ఫేస్​బుక్​ ఇండియా ఆదాయం

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.