ETV Bharat / science-and-technology

టెక్ సంస్థలపై ఇంత వ్యతిరేకత ఎందుకు? - టెక్ కంపెనీల గుత్తాధిపత్యంపై నిపుణుల వివరణ

గూగుల్, ఫేస్​బుక్, ట్విట్టర్​, అమెజాన్ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక అనిశ్చితి, వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. ఆయా సంస్థల వేగవంతమైన వృద్ధి, వ్యాపారాల్లో గుత్తాధిపత్యంపై ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చించడం మొదలుపెట్టిందని నిపుణులు అంటున్నారు. మరి ఆ ఆనిశ్చితులేమిటి? వీటిపై విశ్లేషకులు ఏమంటున్నారు?

Why are tech giants facing mounting backlash
టెక్​ సంస్థల గుత్తాధిపత్యంపై ప్రపంచం గుర్రు
author img

By

Published : Nov 1, 2020, 8:35 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

ఏ వ్యాపార నిపుణుడిని కదిలించినా.. ఇప్పుడు అందరిది ఒకే మాట... గత దశాబ్దకాలం.. టెక్​ దిగ్గజాలు, సామాజిక మాధ్యమాలదేనని. గూగుల్, ఫేస్​బుక్, అమెజాన్, ట్విట్టర్​ సహా అనేక టెక్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార స్థితిగతులను పూర్తిగా మార్చాయని చెబుతారు. అంతే కాకుండా వాటితో మానవాళి జీవన విధానంలోనూ మార్పులు వచ్చాయనే సమాధానాలు వినిపిస్తుంటాయి.

అయితే ఇలాంటి సమూల మార్పులను తీసుకురాగలిగిన సంస్థలు.. ఏదో ఒక రోజు ఎదురుదెబ్బలను ఎదుర్కోక తప్పదనే మాటలూ వినపడుతున్నాయి. ప్రస్తుతం టెక్ సంస్థలకు జరుగుతున్నది కూడా అదే. డేటా ప్రైవసీ నుంచి యాంటి ట్రస్ట్ రాజకీయ పరిణామాల వరకు కొన్నేళ్లుగా టెక్ సంస్థలు అనేక అనిశ్చితులను ఎదుర్కొంటున్నాయి.

టెక్ సంస్థలను సమస్యల సుడిగుండలోకి నెట్టిన పరిణామాలను ఇప్పుడు చూద్దాం.

వ్యాపార గుత్తాధిపత్యం..

ప్రస్తుతం అమెరికా కేంద్రంగా పని చేస్తున్న టెక్​ కంపెనీలు అనుభవిస్తున్న వ్యాపార గుత్తాధిపత్యం అక్కడి చట్టసభల్లో పరిశీలనకు వచ్చింది. ఈ విషయానికి సంబంధించి జ్యుడీషియరీ కమిటీ.. 449 పేజీల నివేదికను విడుదల చేసింది. అందులో ఈ టెక్ కంపెనీలు 'అత్యంత శక్తిసామర్థ్యాలను' కలిగి ఉన్నాయని పేర్కొంది.

'ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పటి చమురు బారాన్లు, రైల్​రోడ్ టైకూన్లలాంటి గుత్తాధిపత్యాన్ని చూస్తున్నాం,' అని నివేదిక వివరించింది.

ఈ నివేదిక ప్రకారం ఫేస్​బుక్.. సామాజిక మాధ్యమ మార్కెట్​లో గుత్తాధిపత్యానికి నిదర్శనం. దీని డేటా అడ్వాన్​టేజ్​తో.. ఇతర వ్యాపారాలను స్వాధీనం చేసుకోవడం, కాపీ చేయడం, లేదా నాశనం చేయడం సహా కొత్త రకం బెదురింపులకు దిగొచ్చని పేర్కొంది.

పోటీ వ్యతిరేక వ్యూహాలతో ఆన్​లైన్ సెర్చ్​లో గూగుల్ గుత్తాధిపత్యం సాధించింది. ఇతర వెబ్​సైట్లతో పోలిస్తే.. దాని సొంత కంటెంట్​కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వంటివి కూడా ఇందుకు ఊపయోగగపడ్డాయి.

ఆన్​లైన్ షాపింగ్​లో అమెజాన్​ 'ముఖ్యమైన, మన్నికైన రిటైల్ మార్కెట్ శక్తిలో' గుత్తాధిపత్యం కలిగి ఉందని నివేదిక ఆరోపించింది. ఇది థర్డ్ పార్టీ విక్రేతల విషయంలో పోటీ వ్యతిరేక ప్రవర్తనతో.. అమెజాన్ వినియోగదారుల కొనుగోలు విధానాన్ని అధ్యయనం చేసి.. హట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ వెర్షన్​ను ఆవిష్కరించిందని పేర్కొంది.

యాపిల్.. యాప్​ స్టోర్​ ద్వారా గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. క్రియేషన్ విషయంలో అడ్డంకులు సృష్టించి.. ప్రత్యర్థి సంస్థలపై వివక్ష చూపడం, సొంత యాప్​లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేస్తుందని నివేదిక పేర్కొంది.

గూగుల్ సీఈఓ సుందర్​పిచాయ్ నుంచి అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్ వరకు కంపెనీల ఉన్నతాధికారులు తమ ఉత్పత్తులు చిన్న వ్యాపారులకు బాగా ఉపయోగపడుతున్నాయని.. మరోవైపు కొత్త వ్యాపారుల నుంచి పోటీని కూడా ఎదుర్కొంటున్నట్లు చెబుతూ తమ కంపెనీలను సమర్థించుకునే ప్రకటనలు చేస్తుండటం గమనార్హం.

పబ్లిక్ పాలసీ, రాజకీయ పరిణామాలు..

సామాజిక మాధ్యమ వేదిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. పక్షపాతంతో వ్యవహరిస్తోందని.. పార్టీ సభ్యులు పోస్ట్ చేసిన విషయాలను అణచివేస్తోందని కేంద్ర సమాచార మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించడం తీవ్ర చర్చకు దారి తీసింది.

భౌగోళిక రాజకీయ అనిశ్చితులు..

ట్విట్టర్​ కూడా భారత్ ఆగ్రహానికి గురైంది. లేహ్, జమ్ముకశ్మీర్​​ ప్రాంతాలు చైనాలో ఉన్నాయని చూపించి భారత్​కు క్షమాపణలు చెపపుకోవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. భారత సార్వభౌమత్వం, సమగ్రత పట్ల ఎలాంటి అగౌరవ ప్రధమైన చర్యలు ఆమోద యోగ్యం కాదని హెచ్చరించింది కేంద్రం.

ఎన్నికల సమస్యలు..

ఎన్నికల్లో నకిలీ వార్తలు, తప్పుడు సమాచార వ్యాప్తి ఆరోపణలతో.. ఫేస్​బుక్ వంటి సామాజిక మాధ్యమాలు 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత స్కానర్ పరిధిలోకి వచ్చాయి.

ఇప్పటికీ ఈ విషయంపై టెక్ సంస్థలు ఎన్నికల విషయంలో కఠినమైన నిబంధనలు ఎదుర్కొంటున్నాయి. కఠిన కంటెంట్ మాడ్రేషన్ విషయంలో విమర్శకుల నుంచి డిమాండ్ వస్తోంది. 2020 అమెరికా ఎన్నికల నేపథ్యంలో పారదర్శకతను పెంచాలనే డిమాండ్ కూడా పెరిగింది.

నిజానికి గత వారం అమెరికాలో జరిగిన సెనెట్ విచారణలో.. గూగుల్, ఫేస్​బుక్, ట్విట్టర్​ల సీఈఓలు ఎన్నికల్లో గందరగోళానికి తావివ్వకుండా.. తమ ప్లాట్​ఫామ్​లను రక్షించుకుంటామని హమీ ఇచ్చారు. ఎన్నికల ఫలితాల విషయంలో విదేశీయుల ప్రమేయం లేకుండా జాగ్రత్తపడతామని కూడా వెల్లడించారు.

ఇదీ చూడండి:వైద్య ఖర్చులకు ప్రభుత్వ సాయం అంతంతే!

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.