ETV Bharat / science-and-technology

శాంసంగ్ నుంచి 'వాటర్​ ప్రూఫ్'​ ఫోన్.. ప్రైవసీకి కొత్త ఆప్షన్! - SAMSUNG A53 5G release date

SAMSUNG A53 5G: శాంసంగ్​ నుంచి అదిరిపోయే 5జీ ఫోన్ విడుదలైంది. వాటర్ రెసిస్టెంట్​ ఫీచర్​తో, భారీ బ్యాటరీతో గెలాక్సీ ఏ53 ఫోన్.. ఆకట్టుకుంటోంది. ఈ స్మార్ట్​ఫోన్ పూర్తి ఫీచర్లు, ధర, ఎక్కడ కొనుగోలు చేయవచ్చనే వివరాలు మీకోసం..

SAMSUNG A53 5G features
SAMSUNG A53 5G features
author img

By

Published : Mar 21, 2022, 5:08 PM IST

SAMSUNG A53 5G: దిగ్గజ స్మార్ట్​ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నుంచి సరికొత్త మిడ్​రేంజ్ ఫోన్ భారత మార్కెట్​లో అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే ఈ స్మార్ట్​ఫోన్ గురించి ఓ కార్యక్రమంలో ప్రకటించిన ఆ సంస్థ.. ప్రస్తుతం ఇండియాలోకి అందుబాటులోకి తెచ్చింది.

SAMSUNG A53 5G features:

గెలాక్సీ ఏ53 5జీ పేరుతో వస్తున్న ఈ స్మార్ట్​ఫోన్ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. మంచి కెమెరా, అదిరిపోయే డిస్​ప్లే, భారీ బ్యాటరీతో ఫోన్​.. పవర్ ప్యాక్డ్​గా కనిపిస్తోంది. రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్​ఫోన్​ను ప్రవేశపెట్టింది. బ్లాక్, వైట్, పీచ్, లైట్ బ్లూ కలర్లలో ఫోన్ లభించనుంది.

SAMSUNG A53 5G features
.

ఫీచర్లు

  • ఆక్టాకోర్ ఎక్సీనొస్ 1280 ప్రాసెసర్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • వెనుకవైపు నాలుగు కెమెరాలు(64ఎంపీ కెమెరా, 12 అల్ట్రా వైడ్, 5ఎంపీ డెప్త్, 5ఎంపీ మాక్రో)
  • 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ + శాంసంగ్ వన్ యూఐ 4.1
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్​తో.. 6.5 అంగుళాల ఫుల్ హెచ్​డీ అమోలెడ్ డిస్​ప్లే
  • 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
  • ఇన్​డిస్​ప్లే ఫింగర్​ప్రింట్ సెన్సార్​
  • డాల్బీ అట్మోస్​తో కూడిన స్టీరియో స్పీకర్లు
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు

ఐపీ67 రేటింగ్​తో వస్తున్న ఈ స్మార్ట్​ఫోన్ నీటిలో పడినా పనిచేస్తుంది. దీంతో పాటు నాక్స్ అనే సరికొత్త ప్రైవసీ ఫీచర్​ను ఇందులో జోడించారు. ఫోన్​లోని ఏ యాప్ ఎలాంటి డేటా సేకరిస్తుందనే విషయాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. యాప్​లు డేటా సేకరించకుండా నియంత్రించవచ్చు.

సోమవారం(మార్చి 21) నుంచే ఫోన్ ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. శాంసంగ్ అధికారిక వెబ్​సైట్ లేదా ధ్రువీకృత రిటైల్ స్టోర్లలో మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.34,499, 8జీబీ + 128జీబీ వేరియంట్ రూ.35,999కు లభించనుంది.

ఇదీ చదవండి: 'యూపీఐ లైట్'​ ఫీచర్​తో ఇంటర్నెట్​ లేకుండానే చెల్లింపులు​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.