ETV Bharat / science-and-technology

కోడిగుడ్డు ఆకారంలో గ్రహం!.. మనకు ఎంతదూరంలో అంటే.. - నాసా వార్తలు తాజా

Potato Shaped Planet: ఇప్పటివరకు శాస్త్రవేత్తలు గుర్తించిన గ్రహాలు అన్నీ దాదాపు గుండ్రటి ఆకారంలోనే ఉన్నాయి. కానీ తొలిసారిగా కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఓ గ్రహాన్ని కనుగొన్నారు. ఈ గ్రహానికి డబ్ల్యూఏఎస్‌పీ-103బీ అని నామకరణం చేశారు.

potato shaped planet
డిగుడ్డు ఆకారంలో గ్రహం
author img

By

Published : Jan 15, 2022, 7:40 PM IST

Potato Shaped Planet: ఈ ఖగోళంలో అంతు చిక్కని, ఆశ్చర్యపర్చే ఎన్నో వింతలు, విశేషాలు దాగున్నాయి. వాటిని గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్న శాస్త్రవేత్తలకు కొత్త కొత్త గ్రహాలు తారసపడుతున్నాయి. తాజాగా 1,500 కాంతి సంవత్సరాల దూరంలో ఓ గ్రహం ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, ఆ గ్రహం గుండ్రంగా కాకుండా కోడిగుడ్డు ఆకారంలో ఉందట. విశ్వంలో ఇప్పటి వరకు గుర్తించిన అన్ని గ్రహాలు అటుఇటుగా గుండ్రటి ఆకారంలోనే ఉన్నాయి. కానీ, ఈ గ్రహం మరింత భిన్నంగా ఉండటం శాస్త్రవేత్తలకు ఆసక్తిని కలిగిస్తోంది. ఈ గ్రహానికి డబ్ల్యూఏఎస్‌పీ-103బీ అని నామకరణం చేశారు.

potato shaped planet
యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీ విడుదల చేసిన చిత్రం

కేంద్ర నక్షత్రానికి సమీపంలో(20వేల మైళ్ల) డబ్ల్యూఏఎస్‌పీ-103బీ గ్రహం ఉండటం వల్ల ఒత్తిడికి గురై కోడిగుడ్డు ఆకారంలోకి మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడి చుట్టూ తిరిగిరావడానికి భూమికి ఏడాది కాలం పడితే.. ఆ నక్షత్రం చుట్టూ తిరగడానికి డబ్ల్యూఏఎస్‌పీ-103బీకి కేవలం 22 గంటల సమయం మాత్రమే పడుతుందట. యూరోపియన్‌, నాసా స్పేస్‌ ఏజెన్సీలకు చెందిన శాటిలైట్లు, భారీ టెలిస్కోపులను ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ విషయాలను కనుగొన్నారు.

ఇదీ చూడండి : బడ్జెట్‌ శ్రేణిలో శాంసంగ్ కొత్త ట్యాబ్‌..ధర, ఫీచర్లివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.