స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లతో ఆకర్షిస్తూ ఉంటాయి మొబైల్ సంస్థలు. తమకిష్టమైన సంస్థ నుంచి ఏదైనా అప్డేట్ వస్తోంది అంటే వినియోగదారులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వారికోసం వన్‌ప్లస్, రియల్మీ నుంచి కొత్త కబుర్లు బయటకొచ్చాయి. అవేంటో చూసేయండి..
వన్‌ప్లస్ 9ఆర్టీ...
వన్‌ప్లస్ 9ఆర్టీ ఇటీవలే చైనాలో లాంచ్ అయ్యింది. త్వరలో భారత్‌లోనూ ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది(oneplus 9rt launch). అయితే తాజాగా ఈ ఫోన్ ధరకు(oneplus 9rt price) సంబంధించిన వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి.(oneplus 9rt launch date in india)
భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 40,000 నుంచి రూ. 44,000 మధ్యలో ఉంటుందని తెలుస్తోంది. అయితే.. భారత మార్కెట్లో ఇప్పటికే విడుదలైన వన్‌ప్లస్ 8టీకి సమానంగానే కొత్త ఫోన్ ధర ఉండొచ్చని పలువురు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వన్‌ప్లస్ 8టీ 8జీబీ ర్యామ్/ 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 42,999గా ఉంది. 12జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 45,999
వన్‌ప్లస్ 9ఆర్టీ ఫీచర్స్(oneplus 9rt features):-
- ఆండ్రాయిడ్ 11
- 6.62 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ శాంసంగ్ ఈ4 ఎమోలెడ్ డిస్ప్లే
- స్నాప్‌డ్రాగన్ 888 ఎస్ఓసీ
- 12జీబీ ర్యామ్/256 స్టోరేజ్
- ట్రిపుల్ రేర్ కెమెరా(50+16+2), సెల్ఫీ కెమెరా(16ఎంపీ)
- 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫ్-6, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ
- 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర 3,299యువాన్(సుమారు రూ. 38,400)గా ఉంది. ఈ నెలలో భారత్‌లో వన్‌ప్లస్ 9ఆర్టీ విడుదలయ్యే అవకాశముంది.
రియల్మీ కొత్త ఫోన్ సేల్స్ షురూ..
రియల్మీ జీటీ నియో 2 5జీ(realme gt neo 2 5g price in india) స్మార్ట్‌ఫోన్ బుధవారం విడదలైంది. తాజాగా ఇందుకు సంబంధించిన సేల్స్ ఆదివారం ప్రారంభమయ్యాయి. మరి ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర వివరాలు చూసేయండి..
- 120హెచ్‌జెడ్ ఈ4 ఎమోలెడ్ డిస్ప్లే
- 8జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్, ధర రూ. 31,999
- 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్, ధర రూ. 35,999
- 64ఎమ్పీ ఏఎల్ ట్రిపుల్ కెమెరా, 16ఎమ్పీ ఫ్రంట్ కెమెరా
- రంగులు- నియో గ్రీన్, నియో బ్లూ, నియో బ్లాక్
ఈ స్మార్ట్‌ఫోన్ మీద ఆఫర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్(realme gt neo 2 5g flipkart), రియల్మీ.కామ్‌లో సేల్స్ జరుగుతున్నాయి. రియల్మీ ఫెస్టివల్ సీజన్లో పాల్గొంటే రూ.7000 డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ వారం విడుదలయ్యే ఫోన్లు ఇవే...!
మోటోరోలా ఎడ్జ్ ఎస్..
మోటోరోలా ఎడ్జ్ ఎస్ ఈ నెల 20న విడుదలయ్యే అవకాశం ఉంది. ఫోన్ ఫీచర్స్ ఇవే(motorola edge s features)...
- 6.7 ఇంచ్ బెజెల్-లెస్ పంచ్-హోల్ డిస్ప్లే
- స్నాప్‌డ్రాగన్ 888
- 12జీబీ ర్యామ్+ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- ధర- తెలియాల్సి ఉంది(motorola edge s price in india).
గూగుల్ పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో
గూగుల్ కొత్త ఫోన్లపై(పిక్సెల్ 6(google pixel 6), పిక్సెల్ 6ప్రో) కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నెల 19న వీటిని విడుదల చేయనున్నట్టు సమాచారం(google pixel 6 pro launch date). కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, తైవాన్, జపాన్, బ్రిటన్, అమెరికాలో తొలుత ఈ ఫోన్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో భారత్ లేదు. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే.. కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
వీటితో పాటు స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ, ఏసస్ 8జెడ్ విడుదలపై ఈ వారంలో ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. శాంసంగ్ ఈవెంట్ ఈ నెల 19న జరగనుండగా.. అందులో గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈని విడుదల చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే చిప్సెట్ల కొరత కారణంగా ఈ ఫోన్ ఇప్పట్లో విడుదల కాదనే ఊహాగానాలూ బలంగా వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి:- మీ ఫోన్లో వైరస్ ఉందని తెలుసుకోవడం ఎలా?