ETV Bharat / science-and-technology

చందమామపై డ్రాగన్ కన్ను... హస్తగతం కోసం యత్నం.. సాధ్యమేనా?

author img

By

Published : Jul 11, 2022, 7:58 AM IST

China moon mission: చందమామను హస్తగతం చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తోందని నాసా అధిపతి బిల్‌ నెల్సన్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే ఇది కుదిరేది కాదంటున్న నిపుణులు అంటున్నారు. అసలేమైంది?

china moon mission latest news
china moon mission latest news

China moon mission: అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం అంతరిక్ష రంగానికీ పాకింది. రోదసి ప్రస్థానాలపై ఇరు దేశాలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. చందమామ కబ్జాకు డ్రాగన్‌ పూనుకోవచ్చని అమెరికా రోదసి సంస్థ (నాసా) అధిపతి బిల్‌ నెల్సన్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఖగోళ వస్తువులపై యాజమాన్యాన్ని ప్రకటించుకోవడం ఒక దేశానికి సాధ్యమేనా? అంతర్జాతీయ చట్టాల ప్రకారం అది కుదురుతుందా? చంద్రుడు మొత్తాన్నీ తన గుప్పిట్లో బంధించే సత్తా డ్రాగన్‌కు ఉందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇటీవల ఓ జర్మన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెల్సన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిని డ్రాగన్‌ తప్పుబట్టింది. జాబిల్లిపైకి రోదసి యాత్రల కోసం అమెరికా, చైనాలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ రగడ జరిగింది. ముఖ్యంగా.. డ్రాగన్‌ కొన్నేళ్లుగా చంద్రుడిపైకి జోరుగా వ్యోమనౌకలు పంపుతోంది.

చంద్రుడిపై స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, ఆ ఉపగ్రహాన్ని 'చేజిక్కించుకోవ'డానికి మధ్య చాలా తేడా ఉంది. సమీప భవిష్యత్‌లో చైనా లేదా మరే ఇతర దేశం జాబిల్లిని హస్తగతం చేసుకోవడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ చట్టాలు, సాంకేతిక సామర్థ్యం, ఆర్థిక వనరులపరంగా ప్రతిబంధకాలు ఉన్నాయంటున్నారు.

అంతర్జాతీయ అంతరిక్ష చట్టం ఒప్పుకోదు: 1967లో అమల్లోకి వచ్చిన 'అంతరిక్ష ఒప్పందం' ప్రకారం ఖగోళ వస్తువులపై ఏ దేశానికీ అజమాయిషీ ఉండదు. చైనా సహా 134 దేశాలు దీనిపై సంతకాలు పెట్టాయి. చందమామ, ఇతర ఖగోళ వస్తువులు సహా అంతరిక్షంపై సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడం, ఆక్రమించుకోవడం, మరేదైనా ఇతర విధానాల ద్వారా వాటిని సొంతానికి ఉపయోగించుకోకూడదని ఒప్పందంలోని మూడో అధికరణం స్పష్టంచేస్తోంది. స్థూలంగా చెప్పాలంటే.. జాతీయ ఆకాంక్షల పేరిట చంద్రుడిని హస్తగతం చేసుకోవడం కుదరదని ఈ నిబంధన తేల్చి చెబుతోంది. ఈ లెక్కన చందమామ మొత్తం తనదేనని ప్రకటించుకోవడం చైనాకు కుదరదు.

china moon mission latest news
.

డ్రాగన్‌ ఒక్కటే కాదు..: జాబిల్లి దక్షిణ ధ్రువం వద్దకు వెళ్లేది చైనా ఒక్కటే కాదు. అమెరికా తలపెట్టిన అర్టెమిస్‌ ప్రాజెక్టులో 20 దేశాలకు భాగస్వామ్యం ఉంది. 2025 నాటికి చందమామపైకి వ్యోమగాములను పంపాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. చంద్రుడి ఉపరితలంపై పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, ఆ ఉపగ్రహ కక్ష్యలోకి 'గేట్‌వే' అనే అంతరిక్ష కేంద్రాన్ని పంపడమూ ఈ ప్రాజెక్టు లక్ష్యాల్లో ఉన్నాయి. భారత్‌ కూడా 'చంద్రయాన్‌' ప్రయోగాలను నిర్వహిస్తోంది. మరికొన్ని దేశాలూ ఈ బాటలో ఉన్నాయి. వాటిని తోసిరాజని చంద్రుడిని చేజిక్కించుకోవడం డ్రాగన్‌కు అసాధ్యం.

కొంచెం కొంచెంగా..: 3.9 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన జాబిల్లిపై అజమాయిషీ ప్రకటించుకోవడం కష్టం. అయితే వ్యూహాత్మకంగా ముఖ్యమైన కొన్ని ప్రాంతాలపై అనధికార నియంత్రణకు చైనా పూనుకోవచ్చు. కొద్దికొద్దిగా అక్కడి భూభాగాలను ఆక్రమించే 'సలామీ స్లైసింగ్‌' వ్యూహాన్ని ఆ దేశం అనుసరించే ఆలోచన చేయవచ్చు. ఈ ఆక్రమణ స్వల్పస్థాయిలోనే ఉండటం వల్ల మిగతా దేశాల నుంచి పెద్దగా అభ్యంతరాలు రాకపోవచ్చు. ఆ చిన్నచిన్న ఆక్రమణలను కలిపి చూస్తే మాత్రం గణనీయ స్థాయిలోనే ఉంటుంది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో డ్రాగన్‌ కొన్నేళ్లుగా ఈ వ్యూహాన్ని అనుసరిస్తూ వస్తోంది.

ఏ ప్రాంతాలపై ఆసక్తి?:

  • మంచు రూపంలో నీరు భారీగా నిల్వ ఉన్నట్లుగా భావిస్తున్న చంద్రుడి బిలాలపై డ్రాగన్‌ కన్నేయవచ్చు. ఆ హిమాన్ని ఒడిసిపట్టడం వల్ల వ్యోమగాముల కోసం ప్రత్యేకంగా భూమి నుంచి నీటిని తరలించాల్సిన అవసరం తప్పుతుంది.
  • ఈ ఐస్‌ నుంచి ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసి, రాకెట్‌ ఇంధనంగా వాడుకోవచ్చు.

చైనాకు అంత సామర్థ్యం, వనరులు ఉన్నాయా?:

  • చంద్రుడి వ్యూహాత్మక ప్రాంతాలను తన అజమాయిషీలోకి తెచ్చుకోవడమూ అంత సులువు కాదు. ఇందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలి. ఇది దీర్ఘకాల కసరత్తు. దాన్ని ఏ దేశమూ గోప్యంగా చేపట్టజాలదు. ప్రపంచమంతా గమనిస్తూనే ఉంటుంది.
  • అంతరిక్ష రంగంపై చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2021లో భూ కక్ష్యలోకి 55 ప్రయోగాలు చేపట్టింది. అదే సమయంలో అమెరికా 51 ప్రయోగాలు మాత్రమే చేయడం గమనార్హం.
  • 2021లో అత్యధికంగా వ్యోమనౌకలు పంపిన మూడు దేశాల్లో చైనా ఒకటి. ఈ దేశానికి చెందిన 'స్టార్‌నెట్‌ స్పేస్‌' సంస్థ 12,992 ఉపగ్రహాలతో ఒక భారీ సమూహాన్ని సిద్ధం చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. 'తియాంగాంగ్‌' అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని దాదాపుగా పూర్తిచేసింది.

సొమ్ము కావాలి..:

  • చందమామను చేరుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అక్కడి ప్రాంతాలపై అజమాయిషీ ప్రకటించుకోవడానికి మరింత భారీగా సొమ్మును ఖర్చుపెట్టాలి.
  • 2020లో అంతరిక్ష రంగంపై చైనా పెట్టిన ఖర్చు 1300 కోట్ల డాలర్లు. ఇది నాసా బడ్జెట్‌లో సగమే. అయితే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 17.1 శాతం మేర కేటాయింపులను డ్రాగన్‌ పెంచింది.

అది అసాధ్యమే..: ఈ లెక్కన చూస్తే చంద్రుడిపై కీలక ప్రాంతాలను తన నియంత్రణలోకి తెచ్చుకునేంత సాంకేతిక, ఆర్థిక సామర్థ్యం చైనాకు లేదని స్పష్టమవుతోంది. ఒకవేళ అలాంటి ప్రయత్నానికి పూనుకుంటే అది కవ్వింపు చర్య అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అంతర్జాతీయంగా ఆ దేశ ప్రతిష్ఠ మసకబారడమే కాకుండా, ఇతర దేశాల నుంచి తీవ్ర ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.

2019లో చంద్రుడి ఆవలి భాగంపై ల్యాండర్‌, రోవర్‌ను దించి, ఆ ఘనత సాధించిన తొలి దేశంగా చైనా గుర్తింపు పొందింది.

2026 నాటికి జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని చేరేందుకు రష్యాతో కలిసి వ్యోమనౌకను పంపనున్నట్లు కూడా చైనా ప్రకటించింది.

2027 నాటికి ఆ ఖగోళ వస్తువుపై శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, అక్కడికి వ్యోమగాములను పంపాలన్న లక్ష్యాలనూ డ్రాగన్‌ పెట్టుకొంది.

ఇదీ చదవండి: తక్కువ బడ్జెట్​లో స్మార్ట్​ వాచ్​ కొనాలా? టాప్​-5 మోడల్స్​ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.