ETV Bharat / science-and-technology

Twitter Ad Revenue Sharing : ట్విట్టర్​ యూజర్లకు మస్క్​ బంపర్​ ఆఫర్​.. బ్లూ టిక్​తో వేలాది డాలర్ల సంపాదన!​ - ట్విట్టర్ యూజర్​ వెరిఫికేషన్​

Twitter Ad Revenue Sharing : అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​.. ట్విట్టర్​ యూజర్లకు అదిరిపోయే న్యూస్​​ చెప్పారు. ఇకపై ట్విట్టర్​ అకౌంట్​ వెరిఫికేషన్​ పూర్తి చేసిన సబ్​స్కైబర్లకు యాడ్​ రెవెన్యూ అందిస్తామని స్పష్టం చేశారు. దీని ద్వారా యూజర్లు నెలవారీగా వేలాది డాలర్లు సంపాదించవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలు చూద్దాం రండి.

Twitter Ad Revenue Sharing
Musk urges Twitter users to get verified and earn thousands of dollars
author img

By

Published : Jul 23, 2023, 12:58 PM IST

Twitter Ad Revenue Sharing : ట్విట్టర్​ యూజర్లకు ఎలాన్​ మస్క్​ బంపర్​ బొనాంజా ప్రకటించారు. యూజర్లు తమ ట్విట్టర్​ అకౌంట్లు వెరిఫికేషన్​ చేసుకొని, వేలాది డాలర్లు సంపాదించుకోవచ్చని మస్క్​ ప్రకటించారు. ప్రకటనల ద్వారా వచ్చే రెవెన్యూలో వెరిఫైడ్​ సబ్​స్క్రైబర్లకు కూడా కొంత మేరకు అందిస్తామని మస్క్​ స్పష్టం చేశారు.

కండిషన్స్​ అప్లై అవుతాయ్​?
Twitter verification requirements : వాస్తవానికి ఒక యూజర్​ ట్విట్టర్​ అకౌంట్​కు 10,000 ఫాలోవర్స్​ ఉండి, నెలకు 5 మిలియన్ల ఇంప్రెషన్స్​ ఉంటేనే ట్విట్టర్ వెరిఫికేషన్​ పూర్తి అవుతుంది. కానీ ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే మస్క్​ యూజర్లు అందరూ ట్విట్టర్​ బ్లూ పెయిడ్​ సబ్​స్క్రిప్షన్ తీసుకోవాలని సూచించారు.

"ట్విట్టర్​ వేదికగా వెరిఫైడ్​ సబ్​స్క్రైబర్స్​ యాడ్​ రెవెన్యూలో భాగస్వామ్యం పొందవచ్చు. ఈ విధంగా నెలవారీగా వేలాది డాలర్లు సంపాదించవచ్చు.​ "
- ఎలాన్​ మస్క్, ట్విట్టర్ అధినేత

నెలకు 7 డాలర్లు మాత్రమే!
Twitter blue tick price : ట్విట్టర్​ యూజర్లు తమ అకౌంట్​కు బ్లూ టిక్​ పొందాలంటే, నెలకు 7 డాలర్లు చొప్పున​ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇది యాన్యువల్​ ప్లాన్​ తీసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది.

ఏమీ ఉపయోగం లేదు!
Twitter ads eligibility : కొంత మంది ట్విట్టర్ యూజర్లు మస్క్​పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకు వేలాది ఫాలోవర్లు ఉన్నప్పటికీ, మిలియన్ల కొద్దీ ఇంప్రెషన్స్​ వస్తున్నప్పటికీ తమకు ఎలాంటి రెవెన్యూ జనరేట్​ కావడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

ఫిబ్రవరి నుంచి యాడ్​ రెవెన్యూ!
Twitter ad revenue for creators : ట్విట్టర్ యూజర్ల ఆరోపణలపై మస్క్​ స్పందించారు. ఇంటర్నేషనల్​ పేమెంట్స్ కొంచెం సంక్లిష్టమైనవని, అయితే ఫిబ్రవరి నుంచి యాడ్ రెవెన్యూ షేరింగ్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

వెరిఫైడ్​ యూజర్​ ప్రొఫైల్ పేజీని ఇతరులు వీక్షించినప్పుడు కనిపించే ప్రకటనలకు.. త్వరలో యాడ్ రెవెన్యూ చెల్లిస్తామని మస్క్ పేర్కొన్నారు. ఈ రెవెన్యూ పేమెంట్స్​ కూడా దాదాపు రెట్టింపు చేసి ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

నష్టాల్లో ఉన్నాం.. కానీ!
Twitter losses 2023 : ఎలాన్ మస్క్​ ప్రస్తుతం ట్విట్టర్ అప్పుల ఊబిలో ఉందని పేర్కొన్నారు. అలాగే యాడ్ రెవెన్యూ కూడా దాదాపు 50 శాతం తక్కువగా వస్తోందని చెబుతున్నారు. అయినప్పటికీ వెరిఫైడ్ యూజర్లకు యాడ్ రెవెన్యూ షేర్​ చేస్తామని ప్రకటించారు. తాము ట్విట్టర్​ క్యాష్ ఫ్లోను మరింత వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.